మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కామక్రోధాదులు ఎప్పుడు లోబడును?’’అని యొక రడుగగా, శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘కామక్రోధాదులను సంసారపరముగా-్భగపరముగా- నడపుచున్నంతవఱకు అవి నీకు శత్రువులుగనే యుండును. వానిని భగవంతుని వైపునకు మఱల్చితివేని, అవియే నీకు పరమాప్తవర్గమగును.
అవి నిన్నంత భగవంతుని సన్నిధికి గొనిపోవును. విషయములందలి కామమును భగవంతునందలి కామముగా మార్పవలయును. ఇతరులపై గలుగు కోపమును భగవంతుడు నీకు ప్రసన్నుడుగానందులకై వాని మీదికి త్రిప్పవలయును.
అరిషడ్వర్గమున మిగిలిన రిపులన్నిటి విషయమునను నీవిటులనే వర్తింపవలయును. కామాదులను నిర్మూలింపజాలము. కాని వానికి ఆత్మగతిని గల్పించి దివ్యముగా నొనర్పవచ్చును.
427. మండోదరి తన భర్తయగు రావణునితో నిట్లుపలికెను: ‘‘సీత మీరాణి కావలయునని మీకింత మమకారమున్నయెడల మీ మాయాశక్తిచే సీతాపతియగు రాముని రూపమునుదాల్చి యామెనేల మోహింపజేయరాదు?’’ రావణుడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను: ‘‘ఓసీ! వెఱ్ఱిదానా! రాముని పవిత్రత రూపమును దాల్చినయెడల తుచ్ఛమగు నింద్రియ భోగములపై మఱల ఆశపడగలనా? రామరూప భావనయే మహోత్తమ స్వర్గసుఖమును సైతము తుచ్ఛమనిపించునంతటి అనిర్వాచ్యానందముతో నా హృదయమును నింపివేయునుగదా!’’
428. ఏనుగును విచ్చలవిడిగా విడిచినయెడల అది చెట్లను పొదలను నిర్మూలింపనారంభించును. కాని మావటివాడు తలపై అంకుశమును ప్రయోగించినంతనే అది శాంతించును. అటులనే మనసును యథేచ్ఛగా పోనిచ్చినయెడల పనికిమాలిన గొంతెమ్మ కోరికలలో విహరించును. కాని వివేకమను అంకుశమును ప్రయోగించినంతనే మనస్సు శాంతించును.
429. సంసారమును రాగము హెచ్చినకొలదియు జ్ఞానలాభమును బొందునవకాశము సన్నగిల్లుచుండును. సంసారముపై రాగము క్షీణించిన కొలదియు జ్ఞానలాభమునుబొందు నవకాశము హెచ్చుచుండును. (చూ.750.)
430. మజ్జిగనుండి వెన్ననుచిలికి తీసిన పిమ్మట దానినిక మజ్జిగతోపాటు ఒకే పాత్రలోనుంచగూడదు; ఉంచితిమేని దాని మాధర్యమును చిక్కదనమును కొంతవఱకు తగ్గిపోవును.
నిర్మలమైన నీటిలో వేఱొక పాత్రలోనుంచవలయును. అటులనే సంసారమును నరుడు కొంత పరిపక్వస్థితిని బొందిన పిమ్మట లోకులతో గలిసి సాంసారిక వ్యామోహముల నడుమ నిలిచియుండెనేని కళంకితుడుకాగలడు. అట్టివాడు సంసారమునకు దూరముగానుండినప్పుడే నిర్మలుడైయుండగల్గును.
431. ప్రశ్న: మనలో అనాది సిద్ధముగానున్న కామమును జయించుటెట్లు?ఉ.పువ్వులోని పిందె పెద్దదయినప్పుడు పూరేకులు వానియంతటనవియే రాలిపోవును. అటులనే నీయందలి దివ్యత్వము వికసించినంతనే మానవదౌర్బల్యము దానియంతనదియే తొలగిపోవును.
434. హేలాంచము (ఒకానొక వనమూలిక)ను సేవించుట పెరటిలోని సామాన్యమూలికలను దినుటవంటిదికాదు; కలకండను దినుట మిఠాయులను మెక్కుటవంటిది కాదు.
ఇందు మొదట చెప్పబడినవి శరీరమునకు ఆరోగ్యకరములు, రోగులు సైతము వీనిని దినవచ్చును; కాని తరువాత చెప్పబడినవో, శరీరమునకు అనారోగ్యకరములు.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి