మెయిన్ ఫీచర్

మానసిక సమస్యలతో దారుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి రోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఏ మీడియా చూసినా ఒకరినొకరు దారుణంగా నడిరోడ్డుపైన హత్య, చిన్నారిపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు, మారణహోమాలు, ఆత్మహత్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నట్లుగా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈ సమయంలోనే వారి ఆదర్శవంతమైన వ్యక్తిత్వం రూపొందించుకోవడానికి, నవ సమాజ నిర్మాణానికి కౌనె్సలర్ల, సైకాలజిస్ట్‌ల, మానసిక ఆరోగ్య నిపుణుల అవసరం పెరిగిపోతుంది. మనిషిలో పట్టుదల, మానసిక దృఢత్వం ఉంటే ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఏర్పరచుకోవచ్చు. కౌనె్సలర్ మరియు కౌనె్సలీ మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా, కొన్ని టెస్ట్‌లు నిర్వహించడం ద్వారా సమస్యయొక్క తీవ్రత, దాని ప్రభావం ఆ వ్యక్తిపైన ఎంతవరకు ఉన్నది గుర్తించడం తద్వారా అతని ప్రవర్తనలో, వ్యక్తిత్వ లోపాలయొక్క మూలాలను గుర్తిస్తారు. తదనుగుణంగా సైకలాజికల్ కౌనె్సలింగ్ ద్వారా అంతర్గతంగా తనలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీస్తూ సమస్య పరిష్కారానికి మార్గాలను గుర్తింపచేయడం, అతనిలో ఆత్మవిశ్వాసం, సంకల్పం, పట్టుదల, మనోధైర్యాన్ని కల్పించడం ద్వారా వ్యక్తిత్వ లోపాలను సరిదిద్దుకొనే అవకాశం కల్పిస్తారు. మనస్తత్వ కౌన్సిలింగ్ అనేది శిక్షణ పొందిన నిపుణుల (కౌనె్సలర్) సహాయంతో, ఒక వ్యక్తియొక్క ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనాతీరును విశే్లషించుకోవడానికి మరియు మార్చుకోవడానికి ఒక వేదిక.
కౌన్సిలర్ విధులను నిర్వర్తించడం అంత సులభమైనది కాదు. అందరికీ సాధ్యం కాదు. కౌన్సిలర్ పూర్తిగా మనస్తత్వ కౌన్సిలింగ్ యొక్క సిద్ధాంతాలు, సైకలాజికల్ విషయాల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు. ఏ సమయంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాలపై పూర్తి స్పష్టతను కలిగిఉంటారు. వ్యక్తితో సంభాషించునపుడు అతని మాట తీరును, ముఖ కవళికలు, భావనలను వెలిబుచ్చే తీరును, హావభావాలను అంచనావేయగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకుంటూ సందర్భానుసారంగా ఆ వ్యక్తితో మాట్లాడే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. సమస్యను పూర్తిగా వినే నైపుణ్యాలను కలిగి ఉంటారు. ముఖ కవళికలు, సంభాషణలు, వినే నైపుణ్యాలను ఎన్నో సంవత్సరాల అభ్యాసంతో, తీవ్ర శిక్షణతో మాత్రమే మెరుగుపరచుకోగలుగుతారు. కౌన్సిలింగ్‌లో శిక్షణ పొందిన నిపుణులను సంప్రదించినపుడు మాత్రమే మంచి ప్రయోజనంపొందే అవకాశం ఉంటుంది.
ఆలోచించండి...
మనుషుల్లో రోజువారీ కార్యక్రమాలతో ప్రస్తుతం కాలం బిజీగా గడిచిపోతుంది. ప్రతిరోజు మనుషులు తీవ్రమైన సమస్యలతో ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమస్యల సాధన ఏ విధంగా చేయాలనే నైపుణ్యాన్ని కౌనె్సలింగ్ ద్వారా మెరుగుపరచుకోవచ్చు. అందరికీ ఉన్న సమయం రోజుకు 24 గంటలే అయినప్పటికీ సమయం దొరకడం లేదు అనే మాట ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరినోట వింటూనే ఉన్నాం. ఈ సమయాన్ని ఏవిధంగా సద్వినియోగం (టైం మేనేజ్‌మెంట్) చేసుకోవాలో తెలుసుకోవచ్చు. మానసిక సమస్యవున్న వ్యక్తులు మాత్రమే కౌనె్సలింగ్ తీసుకుంటారనే అపోహయొక్క ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటోంది. తద్వారా కౌనె్సలింగ్ తీసుకోవడాన్ని చిన్నతనంగా భావిస్తూ ఉన్నారు.
మనిషిగా తను జీవితంలో స్థిరపడడానికి ఎలాంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలో, తనలో దాగి ఉన్న నైపుణ్యాలతో ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలో కౌనె్సలింగ్ ద్వారా నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఒక వ్యక్తియొక్క మానసిక ఆరోగ్యాన్ని డిప్రెషన్, బాంధవ్య నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, ఆందోళనలను అధిగమించడానికి కౌనె్సలింగ్ ఎంతగానో దోహదం చేస్తుంది.
సైకాలజిస్ట్ ప్రాణ స్నేహితుడా...
ఒక్కొక్కసారి అయ్యో ఈ లోకంలో నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. నేను నా ప్రవర్తనతో ఒక్క అనాధగా మారిపోయామనే భావనతో కృంగిపోయే వారికి ఒక ప్రాణ స్నేహితుడి వలే అక్కున చేర్చుకునే వ్యక్తి సైకాలజిస్ట్ అని గుర్తించండి. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఒకేలా ఉండకపోవచ్చు. ఆపత్కాల సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం, అవసరం చాలా ఉంటుంది. ప్రవర్తనాతీరును నిశితంగా పరిశీలించి, సమస్యలను ఏవిధంగా అధిగమించాలో మీకు సహాయపడే ఒక మనస్తత్వవేత్తను సంప్రదించడంవల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మానసిక సమస్యలను చర్చించడానికి నమ్మకమైన వ్యక్తులు లేరని అనిపించినప్పుడు, ఆ సమస్యల పరిష్కారంకోసం ఆలోచిస్తున్నట్లయితే, వెంటనే మనస్తత్వ వేత్తలను సంప్రదించడం మంచిది, సమస్యల సీక్రెసిని కాపాడుతూ మీ వ్యక్తిత్వ ఎదుగుదలకు సైకాలజిస్ట్ కృషిచేస్తారు.
కౌన్సిలింగ్ అంటే చర్చించడమేనా...
వ్యక్తితో సంభాషించడం, సమస్యలపై తీవ్రంగా చర్చించడం అనేది కౌన్సిలింగ్ విధానంలో చాలా కీలకమైన అంశం, ఈ సమయంలోనే కౌన్సిలింగ్‌కు హాజరైన వ్యక్తి కష్టాలను పూర్తిగా వివరిస్తారు. కౌన్సిలర్ ఆ సమస్యలు విని, తగిన పరిష్కారాలు అందిస్తారు. చర్చించడం అంటే సాధారణంగా మాట్లాడటం, వినడం మాత్రమేకాదు. కౌనె్సలింగ్ ద్వారా ఒక వ్యక్తి జీవితాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక ఆలోచనలు ఉంటాయి. కౌన్సిలింగ్ లో మెడకు సంబంధిత వ్యాయామాలు, ఇంటి పనులు, కుటుంబ పాత్ర పోషణ, లక్ష్యాలు సాధించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం లాంటివి కూడా ఉంటాయి.
కౌన్సిలింగ్ జీవితాంతం తీసుకోవాలా...
కౌన్సిలింగ్ ద్వారా సైకాలజిస్ట్ ఎల్లప్పుడూ వ్యక్తి స్వతంత్రంగా సానుకూల దృక్పథం, సామాజిక, తనలో దాగి ఉన్న నైపుణ్యాలతో మెరుగుపడడానికి కృషిచేస్తారు. వ్యక్తిలోని వారి సామర్థ్యం ఆధారంగా మాత్రమే చికిత్సా సెషన్‌లకు హాజరుకావల్సి ఉంటుంది. సమస్య సాధనకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధిచేసుకుని, ప్రపంచంలో స్వతంత్రంగా ఆనందంగా జీవించడానికి అలవాటుపడే వరకు మాత్రమే సెషన్‌లకు హాజరుకావాల్సి ఉంటుంది.
హత్యలు, ఆత్మహత్యలు, దారుణాలు, అఘాయిత్యాలు లేని సమాజ నిర్మాణానికి, ఒకరినొకరు సహాయం చేసుకోవడం, మానవ సంబంధ విలువలు, ప్రపంచాన ఆదర్శవంతమైన సమాజంగల దేశంగా తయారుకావడానికి సైకాలజిస్ట్, మానసిక ఆరోగ్య నిపుణులు, కౌనె్సలర్‌ల పాత్ర ఎంతగానో ఉంది. బంగారు భవిష్యత్తు, ఉన్నతమైన ఆశయాలుగల పౌరులుగా ఎదగడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321