మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు తల్లిదండ్రుల యెడ ఋణవిముక్తుడగును. భగవద్విషయమున దన కడ్డుతగులునెడ మాత్రమే ఎవ్వడైనను తల్లిదండ్రులయెడ అవిధేయుడై వర్తింపవచ్చును. దానిచే వానికి పాపము రాదు. ఇందులకు ఉదాహరణముగా ప్రహ్లాదుడు తన్ను తండ్రి యెంత వలదనినను హరినామ స్మరణచేయుట మానలేదు. మఱియు ధ్రువుడు తల్లి నిరోధించినను తపమొనర్చుటకై అడవులు కేగుట మానలేదు. ఇందు వారు చేసినది తప్పిదము కాదు.
ప్రార్థన: శ్రద్ధ్భాక్తులు
446. ప్రశ్న: భగవంతుని బిగ్గఱగా ప్రార్థింపవచ్చునా?
ఉ.వానిని నీ యిచ్చవచ్చిన రీతిని ప్రార్థింపుము. భగవంతుడు నీ ప్రార్థన నాలకించితీరును. చీమ చిటుకుమన్న భగవంతుడు వినును. (చూ.456.)
447. ప్రశ్న: ప్రార్థనలవలన ఏమైనను ప్రయోజనము కలదా?
ఉ. లేకేమి! తప్పక కలదు. ప్రార్థించునప్పుడు మనస్సును వాక్కును ఏకీభవించునెడల భగవంతుడట్టి ప్రార్థన నాలకించి సఫలము చేయును. ఊరక నోటితో, ‘‘ప్రభూ! ఈ సకలము నీదియే’’యని పలుకుచు, అంతరంగమునన్నియు తనవేయని భావించునరుని ప్రార్థనలు నిరర్థకములు.
448. నీ మనోభావములయెడ ద్రోహివి కాకుము. నిష్కపటివై యుండుము; నీ మనోభావములకు అనుగుణముగ వర్తింపుము, నిష్కపట హృదయముతో- వినిర్మల హృదయముతో- ప్రార్థింపుము. అపుడు భగవంతుడు నీ ప్రార్థన నాలకించి తీరును. (చూ.489.)
449. నీవేమి సంకల్పింతువో దానినే పలుకుము. వాక్కును సంకల్పమును ఏకీభవింపవలయును. ఇందులకు బదులు నోటితో భగవంతుడే నీ సర్వస్వమని పలుకుచు, హృదయమున సంసారమే నీ సర్వస్వమని నమ్ముకొనియున్నయెడల నీకు దానివలన రవంతయు ప్రయోజనము ఉండబోదు.
450. సార్వభౌముని దర్శింప గోరువాడు ముందుగా ద్వారపాలకులను గద్దెదాపుననుండు అంగరక్షకులను తన కనుకూలురను జేసికొనవలయును,- ముందుగా వారిదయ సంపాదింపవలయును. రాజరాజేశ్వరుని సన్నిధిని జేరి వాని యనుగ్రహమును బడయదలచువాడు ఎన్నియో భక్తిసాధనలను జేయవలయును, ఎందఱనో భక్తులను సేవింపవలయును. చిరకాలము సత్సాంగత్యము చేయవలయును.
451. లౌకిక చింతలు, తాపత్రయమును నీ మనస్సును కలవరపెట్టనీయకుము. విధ్యుక్త కర్మములను సకాలమున నిర్వర్తించుచు నీ మనస్సును మాత్రము సదా భగవానునిపై నిలుపుము.
452. ఓడలోని దిక్సూచియంత్రము సరిగా ఉత్తర దిశను జూపుచుండునంతవఱకు ఓడ దారి తప్పునని కాని, అపాయము వాటిల్లునని కాని భయపడనక్కఱలేదు. జీవన నౌకకు దిక్సూచియనదగు మనస్సు భగవానునివైపు తిరిగియుండి చలింపకుండునంతవఱకు నరునకు ఏ యనర్థమును బాటిల్లదు.
453. భగవానునేమని ప్రార్థింపవలయుననియా, మీ ప్రశ్న? ఐహిక విషయములకొఱకు ప్రార్థింపక నారదమహర్షి వలె (నిర్హేతుక భక్తికొఱకు) ప్రార్థింతము! శ్రీరామచంద్రునితో నారదుడిట్లు పలికెను: ‘‘శ్రీరామచంద్రా! నీపాదారవిందములందు నాకు భక్తిననుగ్రహింపుము.‘‘ శ్రీరామచంద్రుడందులకు, ‘‘తథాస్తు!’’అని వచించి, ‘‘నారదా! ఇంకేమియు వలదా?’’ అని ప్రశ్నించెను. నారదుడిట్లు పలికెను:

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి