మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్సాంగత్యమున నుండెనా, భగవంతుని దక్క మఱిదేనిని గూర్చియు చింతింపకుండును. మనస్సు యొక్క నైజము మన స్థితిగతుల ననుసరించి మాఱుచుండును.
492. మనస్సే సర్వము. భార్యయందలి అనురాగము ఒక విధమైనది; బిడ్డయందలి అనురాగము మఱియొక విధమైనది. నరుడిద్దఱను ముద్దిడుకొనుచున్నాడు, కాని మనోభావములు వేఱు.
493. బంధము మనస్సుచే గలుగుచున్నది; ముక్తియు మనస్సుచేతనే గలుగుతున్నది. ‘‘నేను ముక్తుడను, భగవత్పుత్త్రుడను! నన్ను బంధించువారెవరు?’’ అని (మనఃపూర్వకముగా) పలికినయెడల నీవు ముక్తుడవే యగుచున్నావు. ఒక నిని పాము కఱచిన యెడల అతడు పూర్ణ విశ్వాసముతో- దృఢ సంకల్పముతో- ‘‘లేదు, విషము లేదు, లేనే లేదు’’ అని చెప్పగల్గిన యెడల నిశ్చయముగా వానికి విషమువలని బాధ తొలగిపోవును. (చూ.514)
494. (ఇచట 109-వ ప్రవచనము జదువుకొనుడు).
495. కొందఱివిశ్వాసమును గ్రుడ్డనమ్మకమని నిరసింప మొదలిడిన యొక శిష్యునితో శ్రీగురుదేవుడిట్లు పలికెను: ‘‘మంచిది, ‘గ్రుడ్డినమ్మక’మనగా నీయభిప్రాయమేమో చెప్పగలవా? నమ్మక మనునదియే గ్రుడ్డిది గాదా? నమ్మకమునకు కన్నులున్నవా? ‘నమ్మకము’ అని కాని, ‘జ్ఞానము’అని కాని చెప్పుము. కాదేని కొన్నిటియెడల నమ్మకము ‘గ్రుడ్డి’దనియు, మఱికొన్నిటియెడల ‘కన్నులు కల’దనియు చెప్పు నీవిచిత్ర భావమేమో నాకు బోధపడకున్నది!’’
496. నారాయణుని యెడ విశ్వాసము లేకుండుట చేతనే నరుడు బాధపడుచున్నాడు. (చూ.44.)
497. భగవంతునియందు శ్రద్ధ్భాక్తులు ఎవరికి అబ్బునో, ఎవిరకి అబ్బవో శరీర లక్షణములచేతనే తెలిసికోవచ్చును. ఎముకలు పొటకరించికొనియుండు బక్కవాడు, గుంటకన్నులవాడు, మెల్లకంటివాడు- ఈ జాతివానికి భక్తివిశ్వాసము లబ్బుట దుర్లభము.
498. పరుని జంపవలయు ననిన, కత్తులును కటారులును కావలయును, తనను తాను జంపుకొనుటకు సూదియే చాలును. ఇతరులకు బోధింపవలయుననిన, అనేక శాస్తమ్రులను జదువవలసి యుండును; స్వయముగా సాక్షాత్కారము నొందుటకు ఒక్క మంత్రమునందు శ్రద్ధ్భాక్తులున్నజాలును.
499. ప్రశ్న: హిందువులలో అనేక శాఖాసంప్రదాయములున్నవిగదా, మనము వానిలో దేనినవలంబింపవలయును?
ఉ.పార్వతి యొకసారి పరమేశ్వరునిట్లు ప్రశ్నించెను. ‘‘నాథా! శాశ్వత బ్రహ్మానందమును బొందుటకు కీలకమేది?’’
‘‘అందులకు శ్రద్ధయే కీలకము’’ అని పరమేశ్వరుడు సమాధానము చెప్పెను. కావున శాఖా సంప్రదాయములలో ఏమియు లేదు. ప్రతి మానవుడును తన సంప్రదాయము నందలి నియమములను సాధనలను శ్రద్ధ్భాక్తులతో అవలంభించుట పాడి. (చూ.482.)
500. ‘పిండి కొలదియు రొట్టె’ యనునట్లు భక్తికొలదియు పారమార్థిక జ్ఞానము. శ్రద్ధ్భాక్తులు లేని తావున తత్త్వజ్ఞానమును వెదకుట పిచ్చిపని. మేత విషయమున ఊరక లేనిపోని విచక్షణ చేయు నావు పాల విషయమున వెనుకబడి యుండుటంద ఱెఱిగినదే. కాని గడ్డి, గాదము, చిట్టు, తవుడ, ఆకులు మొదలగు అన్ని విధములైన ఆహారమును ఆప్యాయముతో దినునావు చక్కగా పాలిచ్చును. అట్టి యావు పొదుగునుండి కుంభవృష్టిగా పాలు లభించును.
501. ఎవ్వనికి నమ్మిక కలదో వానికి అన్నియు నున్నట్లే; ఎవ్వనికి నమ్మిక లేదో వానికి అన్నియు లోటే.
502. ఈశ్వర సాక్షాత్కారము కావలయునందువా, పూనికతో- దృఢ విశ్వాసముతో- నామజపము చేయుము:
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి