మెయిన్ ఫీచర్

చిట్టిమొక్కల చిద్విలాసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి ముందు రకరకాల మొక్కలు పెంచుకుంటుంటాం. చాలామంది కొత్త మొక్కలు నాటేందుకు మక్కువ చూపుతున్నారు. గాలికి వివిధ ఆకృతుల్లో కత్తిరించిన మొక్కలు ఊగుతూ హోయలు పోతుంటే ఆ ఇంటికే అందాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా పడకింటి గది పక్కన మొక్కలు తలలు ఊపుతూ చల్లటి పిల్లల గాలులతో నిద్రలేపుతాయి. విభిన్నమైన రంగుల్లో కనిపించే సిలోసియా ప్లమోసాను పెంచుకోవటానికి నేడు మక్కువ చూపుతున్నారు. గ్రీకు పదం నుంచి వచ్చిన ఈ మొక్కల పూలు ఊలు ఈకలను తలపించే విధంగా ఉంటాయి. ఇవి గాలులకు తలలు ఊగిస్తుంటే మనసుకు హాయిగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, నీరు సమృద్ధిగా లభించిన చోట్ల ఈ మొక్కలను పెంచుకుంటే బాగుంటుంది. ఎరుపు, పింక్, ఊదా, బంగారు రంగుల్లో లభించే ఈ పుష్పాలు పది వారాల్లోనే మీ ఇంటి నుదుట సింధూరం వలే పూచి నవ్వుతుంటాయి. ఈ మొక్క ఆరు అంగుళాల నుంచి రెండు అడుగులు వరకు చక్కగా పెరుగుతాయి. వైద్య పరంగా కూడా ఈ పుష్పాలను వినియోగించటం వల్ల వీటికి నేడు డిమాండ్ పెరుగుతుంది. కుండీల్లోనూ, కంటైనర్, గార్డెన్‌లలో విడిగానూ, పొదలుగానూ పెంచుకుంటే చూడముచ్చటగా కనువిందు చేస్తాయి.
హైబ్రీడ్ ఎరుపు పాలకూర
ఈ ఆకు కూర నేడు మన ఇండ్లలో పెంచుకోవటానిక అనువుగా ఉంటుం ది. మనం సాధారణంగా వాడే పాలకూర కంటే పోషకాలు అధికంగా ఉంటా యి. చాలా వేగంగా పెరుగుతుంది. 20-25 రోజులలో కాస్తోంది. కాస్తంత స్థలం ఉంటే చాలు ఆరోగ్యకరమైన ఈ ఆర్గానిక్ ఆకు కూర మీరు రోజువారీ తీసుకునే ఆహారంలో ఉపయోగపడుతోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కూర సహజ రుచి కో సం సేంద్రీయ ఎరువును కూడా వేసుకోవచ్చు. తక్కువ ధరలో విత్తనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. మీ ఇంటి బాల్కానీలో అందంగా కనువిందుచేస్తూ సహజ సిద్ధమైన ఆహారంగా కూడా ఉపకరిస్తోంది.