మెయిన్ ఫీచర్

నవ సమాజ శిల్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతాయుగంలోని వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. రాయాయణంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు. చైత్రమాసం తొమ్మిదో రోజైన నవమినాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ, శతృఘ్నలు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారం రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు. ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీ.పూ. 5114 జనవరి 10న జన్మించి ఉంటారని భావిస్తున్నారు. రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు.
రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాటకోసం నిలబడ్డాడు కాబట్టి రామున్ని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే
అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం చైత్ర శుద్ధ నవమినాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సద్గతి కలిగిస్తాడనేది ఐతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామగాన మధుపానాన్ని భక్తితో సేవించాడు.
శ్రీరామ నీ నామమేమి రుచిరా..
ఎంతో రుచిరా.. మరి ఎంతో రుచిరా..
అని కీర్తించాడు. శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరుచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే ‘మ’ అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట.. అందువల్లే మానవులకు రామ నామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.
చైత్రమాసం శుక్ల పక్ష నవమి తిథిలో శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలను పూజలను పాటిస్తూ శ్రీరామచంద్రుడి పేరును జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు. శ్రీరాముడు మంచితనానికి, దయకి, నమ్మకానికి చిహ్నం వంటివాడు. అందుకనే శ్రీరాముడిని పురుషోత్తముడని పేర్కొంటారు. పురుషుల్లో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైనవాడని అర్థం. శ్రీరామచంద్రుడి జీవితం మొత్తం ఈ ప్రపంచానికి ఒక గ్రంథం వంటిది. ప్రపంచం శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీరాముడిని కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలిసే ఉంటాయి. అయితే వారికి కూడా తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. అందుకనే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం..
* రామ నామం: రామ నామం అనేది పవిత్రమైన నామం. దీనిని ఉచ్ఛరిస్తే మంచిది. సాక్షాత్తూ మహాశివుడు ఒక్కసారి రామనామాన్ని ఉచ్ఛరించడం ద్వారా మిగిలిన దేవుళ్ళ నామాలను వెయ్యిసార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలిపాడు. అటువంటి మహాశక్తి శ్రీరామ నామానికి కలదు. ఈ రామనామ శక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణమనే మహాగ్రంథాన్ని రచించాడు.
* శ్రీరామ జననం: శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని అంటారు. అయితే, సుమారు వేల సంవత్సరాల క్రితం శ్రీరాముడు జన్మించాడని చెప్పుకోవచ్చు. ఇంకో వాస్తవం ఏంటంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీరాముడి అవతారంలో అవతరించాడని అంటారు. పరశురాముడు, వామనుడు కూడా ఇదే యుగంలో జన్మించారు. రామాయణం, అలాగే ఇతర ఇతిహాసాలలోని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే రాముడు క్రీ.పూ. 5114లో మధ్యాహ్నం 12:30 సమయంలో జన్మించాడు. శ్రీరాముడి జనన సమయంలో సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు.
* రఘువంశం: శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. ఇక్ష్వాకు, రఘు అనే మహారాజుల వంశానికి చెందినవాడు శ్రీరాముడు. ఈ వంశానికి చెందిన ఎందరో మహారాజుల కీర్తి శ్రీరాముడికి అందింది.
* రామరాజ్యం: యుటోపియా పెయిర్డ్వ్‌ని ఇండియా చూసి ఉండుంటే, అప్పుడు ఇండియా శ్రీరాముడి పాలనలో ఉందని తెలుస్తుంది. శ్రీరాముడు దేశాన్ని దాదాపు 1000 సంవత్సరాలు పాలించాడు. శ్రీరాముడి పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ సమయంలో మోసపూరితమైన లక్షణాలు ప్రజల్లో ఉండేవి కావు. ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సఖ్యంగా అలాగే మంచి మర్యాదలతో ఉండేవారు. ఎటువంటి కల్మషం ఉండేది కాదని, పేదరికం అనే ప్రశే్న తలెత్తేది కాదు. ప్రతి ఒక్కరూ సంపదలతో తులతూగేవారు. స్వాతంత్య్రం తరువాత అటువంటి రోజులకు మహాత్మాగాంధీ తిరిగి తీసుకురావాలని ప్రయత్నించారు. ‘రామరాజ్యం’గా అప్పటి పాలన ప్రసిద్ధి చెందింది.
* రామనవమి: రామనవమిని శ్రీరామచంద్రుడి పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటున్నా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఈ రోజున సీతారామకల్యాణాన్ని జరుపుతారు. శ్రీరాముడితో పాటు ఉద్భవించిన అవతారాలు శ్రీమహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడన్న విషయం తెలిసిందే. సాక్షాత్తూ లక్ష్మీ మాతే సీతాదేవిగా అవతరించింది. అనంత అనే సర్పం లక్ష్మణుడిగా జన్మించింది. శ్రీ మహావిష్ణువు శంఖు, చక్రాలు శత్రుఘు్న, భరతుడిగా అవతరించారు. ఆ పరమశివుడి అంశే హనుమంతుడిగా అవతరించాడని అంటారు.
* రామనవమి శక్తి: రామనవమినాడు శ్రీరాముడిని ధ్యానించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని అంటారు. శ్రీరాముడి నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. మొండి వ్యాధులను కూడా తగ్గించే శక్తి రామనామంలో ఉందని భక్తులు విశ్వసిస్తారు.
* రామావతార లక్ష్యం: రామావతారాన్ని ధరించడం వెనుక గల లక్ష్యం ఏంటనే ప్రశ్న ఉదయించగానే రావణ వధ గుర్తొస్తుంది. రామావతార ఉద్దేశాన్ని తెలియజేసే కథ ఒకటి ఉంది. సత్యయుగం లేదా త్రేతా యుగానికి ముందు యుగం అనేది మహానుభావుల్లో నిండి ఉంది. ఆ యుగానికి చెందినవారిలో ఎక్కువమంది మోక్షాన్ని పొందారు. కొంతమంది సమాజానికి సేవ చేయలేనివారు మోక్షాన్ని పొందలేదు. వారందరూ త్రేతాయుగంలో వానరులుగా జన్మించారని అంటారు. శ్రీరాముడి సేవలో తరించి వారందరూ మోక్షాన్ని పొందారని అంటారు.
* పురుషోత్తముడు: శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నవాడు. ఆలోచనాపరుడు. అహంకారం లేనివాడు. అందువల్లనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. శ్రీరాముడి పాదాలచే మన నేల ధన్యమైంది.
* సామాజిక బంధాలు: శ్రీరాముడి జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టినవాళ్లతో ఎలా మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత అలాగే సహనం, విలువల గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలో వివరిస్తుంది. కులం, మతం వంటి సామాజిక అడ్డుకట్టలని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువ గురించి తెలియజేస్తుంది. శత్రువుతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో వివరిస్తుంది. ఆత్మ శతృవుని జయించేవాడు కామం, కోపం, అత్యాశ, అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ యొక్క శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని అంటారు.
* ఏక పత్నీవ్రతుడు: ఈ రోజు ఒక భార్య కలిగి ఉండటం అనేది ఒక కట్టుబాటుగా మారింది. శ్రీరాముడి కాలంలో రాజులకు ఎందరో భార్యలు ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు. దాదాపు 1000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించిన రాముడు సీతాదేవిని తప్ప మరొక మహిళను వివాహమాడలేదు. ఆవిధంగా రాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు.
* రామనవమికి శాస్ర్తియ కోణం: ఎండాకాలం ప్రారంభ సమయంలో రామనవమి జరుగుతుంది. నీళ్ల కొరత, అధికమైన వేడి వంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ సమయంలో రామనామాన్ని జపిస్తూ వేడుకలో పాల్గొనడం వల్ల ప్రజలు మానసిక ప్రశాంతతకు గురవుతారు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. రాబోయే రోజుల్లో కరువును తట్టుకునేందుకు ఈ ఆచారం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఉపవాసం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధులు రావు.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి