మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవత్ప్రేమ యెంత గాఢముగా నుండవలయునో తెలియునా? పతివ్రతకు భర్తపైనుండు ప్రేమ, లోభికి తాను కూడబెట్టుకొనిన ధనముపైనుండు మక్కువ, లోకులకు ఐహిత విషయములందుండు రాగము- ఇవి ముప్పిరిగొనినంత తీవ్రముగా నీ హృదయము భగవంతునికై పరితపించునపుడు నీకు భగవత్సాక్షాత్కారము కాగలదు.
625. ఏసుక్రీస్తు ఒకనాడు సముద్ర తీరమున నడుచుచుండనొక భక్తుడు సమీపించి యిట్లు ప్రశ్నించెను: ‘‘ప్రభూ! భగవంతుని బొందుటెట్లు?’’ ఏసుక్రీస్తు ఆ భక్తునితో గూడ సముద్రములోనికి దిగి వానిని నీళ్లలో అదిమిపట్టెను. కొంతసేపటికి వానిని లేవదీసి, ‘‘నీ కెట్లున్నది?’’ అని యడిగెను. ‘‘ప్రాణం పోవుచున్నదా’ యనిపించినది. గిలగిల కొట్టికొంటిని!’’అని భక్తుడు బదులు చెప్పెను. అంతట ఏసుక్రీస్తు ఇట్లు వచించెను: ‘‘ఊపిరి ఆడక నీవిపుడు ఉక్కిరిబిక్కిరియై యెట్లు పరితపించితివో అట్లు భగవంతునికోసము పరితపించునెడల ఆ తండ్రి నీకు కానవచ్చును.’’
626. ‘‘ఈ జన్మముననే నేను భగవంతుని గాంచవలయును, మూడు దినములలో నేనాతని ప్రత్యక్షము చేసికొనవలయును; ఇంతేల, ఒక్కసారి వాని నామస్మరణము చేసి వాని నాకర్షించుకొందును’’- అనునిట్టి తీవ్రమైన భక్తిచే భగవంతుడు ఆకృష్ణుడై భక్తునకు సాక్షాత్కరించును. కాని ‘సంసార పక్షమగు’ భక్తిగలవారు భగవంతుని గాంచుటయే తటస్థించునెడల ఎన్ని యుగములకో కాని అట్టిది సంఘటిల్లదు.
627. ‘‘బ్రహ్మసాక్షాత్కారము ఈ జన్మమున సాధ్యముకానిచో మఱుసటి జన్మమున గలుగును’’ అను నిట్టి మందబుద్ధియేల? శ్రద్ధ్భాక్తులవిషయమున నిట్టి మాంద్యము కూడదు. ఈ జన్మముననే- ఏల? ఈ క్షణముననే- వాని సాక్షాత్కారము నొందవలయు నను దృఢనిశ్చయముతో భల్లూకవు బట్టు పట్టిననే కాని పరమపురుషార్థమగు మోక్షము సిద్ధింపజాలదు. పల్లెటూళ్లలో వ్యవసాయులు గిత్తలను కొనబోవునపుడు వాని తోకలను అట్టె తాకుదురు. అందులకు గొన్ని యేమియు కదలవు. మెదలవు, సరికదా, అవయవముల నన్నిటిని చాచుకొని నేలపై బరుండియుండును. వ్యవసాయదాయి అవి యెందులకు పనికిరానివని వెంటనే తెలిసికొందరు. కాని మరికొన్ని వానితోకను తాకినంతనే ఎగిరి గంతులువేయును. రైతులు అవి చాల ఉపయోగపడునని వెంటనే గ్రహింతురు. ఈ విధమైన చురుకుగల గిత్తలనే వారు ఎన్నుకొందురు. మాంద్యము ఎన్నటికిని తగదు. బలాఢ్యుడవు కమ్ము, దృఢవిశ్వాసమును బూనుము. ఈక్షణముననే నేను వానే సాక్షాత్కారమును బొందవలయునని పలుకుము. అపుడు నీకు తప్పక విజయము సిద్ధించును.
భగవత్ సాక్షాత్కారమునకు ప్రధాన నియమము
628. మాయాబంధమునుండి తప్పించుకొను మార్గమేమి? అందులకై పరితపించువారికి భగవంతుడే మార్గమును జూపును. వలయునది నిరంతర పరితాపము.
629. ‘‘్భగవంతుని సాక్షాత్కారమును బొందుట కుపాయమేమి?’’ అని యొక శిష్యుడు ప్రశ్నింప శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘్భగవంతునికోసము నీవు పరితపింపగలవా? విలపింపగలవా? భార్యకోసమో, బిడ్డల కోసమో, ధనముకోసమో లోకులు కడవలకొలది కన్నీటిని గార్తురు. కాని భగవంతునికోసము విలపించువారెవ్వరు? బిడ్డడు ఆటల మరగియున్నంతవఱకు తల్లి వంటను ఇతర గృహకృత్యములను జేసికొనుచుండును. కాని బిడ్డడు ఆటవస్తువులతో సంతుష్టిపొందక వాని నావల త్రోసిపాఱవేసి తల్లికోసము విలపించునేని, తల్లి యిక జాగుచేయజాలదు, వంట యింటిలో నుండజాలదు. బహుశః పొయ్యిమీదినుండి వంట కుండను జాఱవిడిచి,

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి