మెయిన్ ఫీచర్

నమో నమో దత్తాత్రేయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వంభరాయ దేవాయ దేవాయ భక్త ప్రియకరాయచ
భక్తి ప్రియాయ దేవాయ నామ ప్రియాయతే నమః
దత్తాత్రేయుని పూజించాలి. స్తుతించాలి. దత్తాత్రేయుడు సద్గురువు. చీకటిలో అజ్ఞానంలో కూరుకుని పోయన జీవులకు జ్ఞానామృతాన్నిచ్చిన సద్గురు వరేణ్యుడు దత్తాత్రేయుడు.
ఒకసారి అనసూయ పాతివ్రత్యాన్ని గూర్చి వైకుంఠంలో చెబుతూ ఆమె ఇనుప గుగ్గిళ్లను కూడా మెత్తని అమృతగుళికలుగా మార్చివేస్తుంది అని అంటారు. ఈ విషయం లక్ష్మీసర్వసతీ పార్వతులకు కూడా తెలియచెప్తాడు. అనసూయ అంతటి గొప్ప మనిషి ఎక్కడా ఉండి ఉండదు అని పొగుడుతాడు. అనసూయ అత్రి మహర్షి భార్య అంత పతివ్రతనా ?అని వీరిముగ్గురూ అసూయ లోనవుతారు. దానితో వారి భర్తలను ఆమె ను పరీక్షించి రమ్మని ప్రోత్సహించి పంపుతారు.
వారు అత్రి మహర్షి లేని సమయంలో మారువేషాల్లో వెళ్లి భిక్ష అడుగుతారు. ఆ తల్లి వారికి భిక్ష ఇవ్వబోగా ఆమెకు ఒక షరత్తును పెడ్తారు. నగ్నంగా మాకు మీరు భిక్ష ఇస్తే తీసుకొంటామని త్రిమూర్తులు చెబుతారు. ఆ అనసూయామాత కాస్త కూడా తొట్రు పాటు కనిపించనీయకుండా అలాగే చేద్దామని వారి పైన తన భర్తను తలుచుకుని మంత్రించిన నీరు చల్లుతుంది. త్రిమూర్తులు ముగ్గురూ పసిపాపలై పోతారు. వారికి తన స్తన్యమిచ్చి వారి ఆకలిని ఆ తల్లి తీరుస్తుంది.
అంతలో అత్రి మహర్షి వస్తారు. జరిగిన విషయమంతా తెలుసుకొంటారు.ఆ పసిపాపలు ఆ తల్లిదగ్గరే పెరుగుతుండగా తమ భర్తలు తిరిగి రాలేదని త్రిమూర్తుల భార్యలు నారదుని దగ్గర వాపోతారు. నారదుడు చేసేది ఏమీ లేదు. మీరు వెళ్లి ఆ తల్లిని వేడుకొనండి ఆమె మీ కష్టాన్ని తీరుస్తుంది అని చెప్తాడు.
అలా లక్ష్మీపార్వతీ సరస్వతులు ముగ్గురు అనసూయా మాత దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి తమ భర్తలను తమకు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తారు. ఆమె ఊయలల్లో ఉన్న వారిని తీసుకుని వెళ్లమని చెబుతుంది. అపుడు వారికి ఎవరు ఎవరి భర్తనో తెలుసుకోలేక తిరిగి అనసూయనే క్షమించమని అడుగుతారు. అత్రి వచ్చి వారిని వారిపై నీళ్లు చల్లుతారు. అపుడు త్రిమూర్తులు వారి రూపాల్లోకి మారుతారు.
అత్రి అనసూయల భక్త్భివానికి మెచ్చుకుని వారికి తాము బిడ్డడై జన్మిస్తామని వరాన్ని ఇస్తారు.
అలా భగవంతుడు తనకు తాను దత్తం చేసుకొని అత్రి వరదుడుగా అనసూయ ముద్దుబిడ్డగా జన్మించాడు. ఆ దేవుడే దత్తాత్రేయుడుగా కీర్తించబడుతున్నాడు. ఆ దత్తాత్రేయుడే 16 అవతారాలను దాల్చి ముముక్షువులకు దారి చూపాడు. సందేహాలతో కొట్టుమిట్టాడేవారికి సందేహాలను తీర్చి సద్గురు అయ్యాడు. ఆయన తన జీవితంలో 24 మంది గురువుల దగ్గర నుంచి విద్యనేర్చుకున్నానని చెప్పారు.
దత్తాత్రేయుని స్మరించిన వారిని, వారి నామాన్ని జపించిన వారిని కడదాకా కాపాడుతాడు.
దత్తాత్రేయ భగవానుడు త్రిమూర్తి స్వరూపుడు- ఆదిగురువు- దేవతామూర్తులందరికీ గురువు. ఆయననే తమ ఆదిగురువుగా భావించి దేవతలు- సమస్త జీవకోటి ఆరాధిస్తారు. శ్రీ దత్తాత్రేయుడు భక్తుల కోర్కెలను నెరవేర్చుటకు 16 అవతారాల్లో జన్మించారు. అందులో తొమ్మిదవ అవతారమే శ్రీ విశ్వంభరావధూత. చైత్రశుద్ధ పూర్ణిమ రోజున చిత్తానక్షత్రంలో సూర్యాస్తమయకాలంలో అవతరించారు. ఈ సంవత్సరం 2019లో ఏప్రిల్ 19న స్వామివారి జయంతి రోజు ఏదైనా దత్త దేవాలయానికి వెళ్లి స్వామివారిని అర్చించాలి. అది వీలుకానివారు ఇంట్లోనే శ్రీ దత్తాత్రేయుల స్వామి ఫొటోనుగాని, చిన్న విగ్రహాన్నికాని తెచ్చుకొని పాలతో వీలైతే ఆవుపాలతో అభిషేకించాలి. వేయి చేతులతో, వేయి శిరస్సులతో అవతరించిన ఆయన అవతార మూర్తిని మనసులో ధ్యానించాలి.
శ్రీపాద పాతే మే పాదౌ వూరూ సిద్ధాననస్థిత
పాయా ద్దిగంబరో గుహ్యం నృహరి పాతుమే కటిమ్ నాభిం పాదు జగత్ స్రష్టా ఉదరం పాత దలోదర .. అంటూ శ్రీ దత్తాత్రేయ భగవానునవని శ్రీదత్తాత్రేయ కవచాన్ని పఠించాలి. శ్రీ ధత్తాత్రేయుని వీలైతే అష్టోతర స్తోత్రంతో, పూలతో పూజించాలి. అరటిపండ్లను నివేదించాలి. పెసరపప్పుతో కూడిన చక్కెర పొంగలిని వండి స్వామివారికి నివేదించాలి. దగ్గరలో ఏదైనా దేవాలయంలో మేడి చెట్టు వుంటే దాన్ని పూజించి 11 లేక 108 ప్రదక్షిణలు చేయాలి. తనకు విద్య బోధించిన గురువు దర్శనం చేసుకొని ఆయన దీవెనలు పొందాలి. దగ్గరలో ఏదైనా గోశాల వుంటే అక్కడ ఏదైనా గోవును పూజించాలి. గోవుకు గ్రాసం ఇవ్వాలి. పచ్చగడ్డి లభిస్తే తినిపించాలి లేదా చెరకు ముక్కలు తినిపించాలి. గోప్రదక్షిణం చేసి మనసులో కోరిక తెలుపుకోవాలి. దత్తచరిత్రను పారాయణం చేయాలి. శ్రీ దత్తాత్రేయదత్తాత్రేయ తవ శరణం దత్తానాథా తవ శరణణ
త్రిగుణాత్మక త్రిగుణాతీత త్రిభువన పాలక తవ శరణం
శాశ్వత మూర్తే తవ శరణం శ్యామసుందర తవశరణం
శేషాభరాం శేష భూషణా శేషశాయ గురు తవ శరణం
అంటూ దత్తాత్రేయుని శరణాష్టకాన్ని చదువుకోవాలి. ప్రతిరోజు కూడా దత్తాత్రేయుని అష్టాకాన్ని చదువుకున్నా ఆ సద్గురువు అనుగ్రహం తప్పక లభిస్తుంది.

-ఈశ్వరగారి నరహరి శర్మ