మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి భక్తుడును భగవానుని గూర్చి ప్రత్యేకమగు భావనను గలిగియుండవచ్చును. తదనుగుణమగు రూపమును పూజించుచుండవచ్చును. కొందరికి భగవంతుడు ప్రభువు, కొందరికి తండ్రి, కొందరికి తల్లి, కొందరికి ప్రాణసఖుడు, కొందరికి ప్రాణనాధుడు, మరికొందరికి విధేయుడగు సుతుడునై యొప్పుచుండును.
648. చెఱువులో చేపలు ఎంత దూరమునున్నను నోరూరజేయు నెర నీట వైచినంతనే నల్దిక్కులనుండియు అవి యచటికి వచ్చిచేరును. అటులనే శ్రద్ధ్భాక్తులను నెరతో నెవరిహృదయము పూర్ణమైయుండునో భగవనాడట్టి భక్తునకు అతి శీఘ్రముగా ప్రసన్నుడగును.
649. దేవ ఋషులు భగవంతునకు ఆప్తకోటిలోనివారనవచ్చును. వారే భగవంతునికి మిత్రులు, సన్నిహితులు- వేయేల, స్వజనము అని చెప్పవచ్చును. సామాన్యులగు నితరులందరును భగవంతునికి దూరపు బంధువులవంటివారు, కేవలము వాని సృష్టి జాతములోనివారు.
650. ఒకే సూర్యరశ్మి అనేక ప్రదేశములందు పడుచున్నది. కాని కాంతిని గ్రహించునట్టి అద్దముగాని, నీరు గాని, మెఱుగువెట్టిన లోహములుగాని దానిని చక్కగాప్రతిఫలింపజేయును. భగవంతుని దివ్య తేజము విషయము నిట్టిదే. అయ్యది సమానముగా నిష్పక్షపాతముగా- అందరి హృదయములందును ప్రసరించును. కాని సజ్జనుల యొక్కయు సాధుసత్తములయొక్కయు వినిర్మల హృదయములు మాత్రమే ఆ దివ్య తేజమును స్వీకరించి చక్కగా ప్రతిఫలింపజేయును.
651. వెలుగు నొసగుట దీపస్వభావము. దాని సాయమున గొందరు అన్నము వండుకొందురు, కొందరు దొంగ దస్తావేజులను సృష్టింతురు. కొందరు సద్గ్రంధములను జదువుకొందురు. అటులనే కొందరు భగవన్నామ కీర్తనచే ముక్తి పడయజూతురు, కొందరు తమ దుష్కార్యములను సాధింపజూతురు. ఎవరెటుల వినియోగించుకొనినను భగవన్నామము మాత్రము నిష్కళంకముగనే పరమ పవిత్రముగనే యుండును.
652. భగవానుడు, భాగవతము, భక్తుడు- ఈ మూడును ఒక్కటియే.
658. ఉత్తమ భక్తుడు భగవంతునెట్లు భావించును? బృందావన గోపికలు శ్రీకృష్ణుని జగన్నాథునిగాగాక, తమ కత్యంత ప్రియుడు గోపీనాథునిగా గాంచిన చందనము ఉత్తమ భక్తుడు భగవంతుని తన కత్యంతము ఆప్తునిగా భావించును.
654. భక్తుడు భగవంతుని ‘‘అమ్మా’’అని పిలిచి యానంద పరవశుడగుటకు కారణమేమి? బిడ్డకు ఇతరులందరి యొద్దకంటెను తల్లి యొద్ద చనువెక్కువ. అందువలన తల్లి యనిన మక్కువ.
655. తాపజ్వరముచే దాహపీడితుడగు రోగి సరోవరములోని నీటినంతయు త్రాగివేయగలవని తలచును. ఆ జ్వరము తగ్గి యాతడు పూర్వపుస్థితికి వచ్చినపుడు గినె్నడు నీటినైనను త్రాగడు. అందు అల్పభాగముతోడనే సంతుష్టుడగును. అటులనే మాయయను తాపజ్వరముచే తనయల్పత్వమును మరచిన నరుడు అఖండుడగు భగవానుని వాని యనంత విభూతులను తన చిన్ని హృదయమున నిల్పుకొనగలనని తలచును. కాని రుూ భ్రాంతి తొలగినంతనే పరంజ్యోతి యొక్క జ్ఞాన కిరణమొక్కటి చాలును, వానిని పరమానందభరితుని జేయుటకు!
656. కొందరికి గుక్కెడు సారా త్రాగినంతనే నిషా కలుగును, మరికొందరికి రెండు మూడు సీసాలు త్రాగినగాని కలుగదు. కానీ యిరుతెఱగులవారికిని నిషావలన గలుగు నానందమొక్కటియే. అటులనే కొందరు భక్తులకు పరంజ్యోతి యొక్క కిరణమొక్కటి చేతనే పరవశత్వము గలుగును.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి