మెయిన్ ఫీచర్

మంచి అలవాట్లతో ప్రశాంత జీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం ప్రశాంతంగా సాగాలని ప్రతివారూ కోరుకుంటారు. ఆ ప్రశాంతతకు ఆనందం కూడా తోడైతే ఆ జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. అలాంటి అపురూపమైన జీవితంకోసం కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి, పాత అలవాట్లు వదిలించుకోవాలి. అలాచేయకపోవటం వల్లనే ఈ తరం జీవితంలో అశాంతి, ఆదుర్దా పెరుగుతోంది. మానసిక ఒత్తిడులకు గురవుతున్నారు. జీవితాన్ని ఎలా గడపాలో తెలియనప్పుడు సమస్యలు తలెత్తుతాయి. పొరపాట్లు అని తెలిసినా వదిలించుకోనప్పుడు సమస్యలు పెరుగుతాయి. నేటి తరంవారు చేస్తున్న తప్పులలో ముఖ్యమైనవి గుర్తించి, వాటిలో ఏవి, ఎలా వదిలించుకోవాలో, వదిలించుకున్నందున జీవితంలో కలిసివచ్చేది ఏమిటో వివరిస్తున్నారు నిపుణులు.
క్షమాగుణం
ఇది బలహీనత ఎంతమాత్రం కాదు. క్షమించటమనేది రెండు రకాలుగా లాభాలను చేకూరుస్తుంది. క్షమించగలిగితే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కోపం, కసి అనేవి మనసులో తిష్టవేసినప్పుడు అలజడితో ప్రతిక్షణం ఊగిపోయి తప్పులుచేస్తారు. ఇతర విషయాల మీద దృష్టిపెట్టలేరు. అది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
భావోద్వేగ గాయాలు మరింత ప్రమాదకరం. వీటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. శారీరక గాయాలకు చికిత్స చేసేందుకు వైద్యులుంటారు. కానీ మానసిక గాయాలకు ఎవరికివారే చికిత్స చేసుకోవాలి. ఆ స్వీయ చికిత్సలో భాగమే 3క్షమాగుణం2 కలిగి ఉండటం. దీనివల్ల తనలోతాను ప్రశాంతత సంపాదించుకోవటంతోపాటు, సాటివారితో ప్రశాంతత, సత్సంబంధాలను పొందగలుగుతారు. నాటివరకు వున్న ఘర్షణ వాతావరణం తొలగిపోతుంది.
స్నేహబంధాలు
స్నేహితులు అవసరమే.. కానీ స్నేహితులతోనే జీవితం అంటే కష్టమే. నలుగురిని కలవటానికి ఇష్టపడేవారైనా, నలుగురిలో సందడిగా తిరిగే వారైనా వచ్చిన ప్రతి ఆహ్వానాన్ని మన్నించి వెళదామనుకుంటే చివరికి మిగిలేది చిరాకు, ఒత్తిడి మాత్రమే.
ఆహ్వానాలను సున్నితంగా తిరస్కరించటం అలవాటు చేసుకోండి. ఆహ్వానం అందుకునే సమయంలోనే మీ ఇబ్బందిని తెలియజేస్తే సమస్య అంతగా వుండదు. రోజువారీ వెచ్చించే మీ సమయం మీద మీకు పట్టు, నియంత్రణ రెండూ అవసరమే. నగరాల్లో ప్రయాణ సమయం పెరిగింది. పలురకాల ఇతర ఇబ్బందులు వున్నాయి. వాటన్నిటినుండి బయటపడి ప్రశాంతంగా వుండటం అనేది అలవరుచుకోవాలి. ఇంటిబయటి జీవితాలలో అనుభవించే ఒత్తిడులు సరిపోనట్టు ఇంటి లోపల ఘర్షణ వాతావరణం సృష్టించుకోవటమంటే నరకాన్ని స్వయంగా నిర్మించుకోవటమే.
లోపాలకు దిగులు చెందకండి
ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక లోపం వుంటుంది. అయితే తమ లోపాలను తలచుకుంటూ పదే పదే కుమిలిపోకూడదు. ప్రశాంత జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. తమ లోపాలను తలచుకుంటూ వుండటం వలన వారియొక్క సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తుంది. తమలోని లోపాన్ని తమకు తెలియకుండానే వారు బయటకు చెప్పేస్తారు. అలా చెప్పడంవలన అందరికీ మీరు చులకనగా కనిపిస్తారు. మీలో ఏదైనా ఒక లోపం వుంటే, మీరే దానిని సరిచేసుకోడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు మీ లోపాన్ని సరిచేసుకుంటారు. మీకున్న లోపం గురించి ఎక్కువగా ఆలోచించడంవలన మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపలేరు. అందుకే మీ లోపాన్ని గురించి నీరసించకుండా సరిచేసుకోవడానికి ప్రయత్నించి, విజయం సాధించండి.
నో2చెప్పండి
నో2చెప్పకుండా తమలోని మంచిని ఎదుటివారికి పంచాలనుకోవడం అన్నిసార్లూ కరెక్ట్ కాదు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం వేరు. కుదరని వాటికి కాదు2అని చెప్పలేకపోవడం వేరు. ఇటువంటి పరిస్థితిని తప్పనిసరిగా, ఖచ్చితంగా మెరుగుపరచుకోవాలి. అందుకు మార్గాలు వెతుక్కోవాలి.
* స్మార్ట్‌గా నో2చెప్పే కళను అభ్యాసం చేయాలి. ముందుగా ఎందుకు, ఏ పరిస్థితుల్లో చెప్పలేకపోతున్నామన్న కారణాలను విశే్లషించుకోవాలి.
* నో2చెప్పి చెడు అవడంకంటే కష్టమైనా సాయంచేసి మంచి అనిపించుకుందామనుకునే ధోరణి ఎంతమాత్రం సమంజసం కాదు. ఇలా చాలామందికి చాలాసార్లు నో2చెప్పలేక, 3ఎస్2చెప్పి సమస్యల్లోకి స్వయంగా నెట్టుకోవడంవల్ల జీవితం రానురాను దుర్భరమవుతుంది. సంతృప్తికి స్థానం దక్కదు. పైగా ప్రతి ఒకరికీ ఒకేసారి అవునని చెప్పి, న్యాయం చేయలేక మరో రకంగా ఒత్తిడికి ఉక్కిరిబిక్కిరవుతారు. కష్టంలో ఉన్నవారికి చేయూతనివ్వాలి. నిజమే- కాని ఇక్కడ తనకుమాలిన ధర్మం2 అనే సూత్రాన్ని గుర్తెరిగి వ్యవహరించాలి.
సమయపాలన
సమయపాలన కలిగి యుండటం ఒక గొప్ప లక్ష్యం. సమయపాలన లేకపోవడం పాపమేమీకాదు కాని, ఆ లక్షణం లేకపోవడంవలన నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనులు కుంటుపడిపోతాయి. దానివలన అధికంగా నష్టం జరగొచ్చు. సమయపాలన పాటించని వ్యక్తులు సమాజంలో బోల్డెంత అపకీర్తి మూటగట్టుకుంటారు. మీరు రెండు గంటలకు ఎక్కడికైనా వెళ్ళాల్సిన పని ఉంటే, నిమిషాల ముల్లును ఒక పది నిమిషాలు ముందుకు జరిపితే సరిపోతుంది. మీ గడియారంలో రెండు గంటలు చూపించగానే మీరు వెంటనే బయలుదేరి వెళ్ళొచ్చు. గడియారంలో రెండు గంటల సమయం అని చూపించినా అది నిజంగా 1.50 నిమిషాల సమయమే అవుతుంది. అలా చేయడంవల్ల మీరు అందరికంటే ముందు చేరుకుంటారు. సమయపాలన పాటించే వ్యక్తులుగా మీరు పేరు తెచ్చుకుంటారు.
జీవిత సమస్యలకు పరిష్కారాలు చాలాసార్లు, చాలా సులువుగా వుంటాయి. చాలా లోతుగా ఆలోచించినా కనిపించని పరిష్కార మార్గాలు, సులభమైన ఆలోచనలు కనిపిస్తాయి. మనం ఆనందంగా బ్రతకడానికి చాలా చిన్న సూత్రం ఏమిటంటే, ఎదుటివాళ్ళు మనతో ఎలా ప్రవర్తించాలని, మనం ఆశిస్తామో, అదే ప్రవర్తనను మనం ఎదుటివారి పట్ల చూపించడం. ఇతరులు మన పట్ల స్వీయ క్రమశిక్షణ కలిగి, సమయపాలనా విలువలు పాటిస్తూ వుండాలంటే, మనం కూడా వారిపట్ల అదే బాధ్యతను కలిగి వుండాలి. మన నడవడికే మనకు శ్రీరామరక్ష.

- పి.ఎం. సుందరావు 94906 57416