మెయిన్ ఫీచర్

గృహస్థాశ్రమంలోనే గోవిందుని భజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలతత్త్వజ్ఞానీగా సాంఘిక సంస్కర్తగా శ్రీ వీరబ్రహ్మం స్వామి జీవసమాధి అయి 326 సంవత్సరాలు అయింది. ఆయన వ్రాసిన కాలతత్త్వం స్వామి బోధించిన తత్త్వాలు నేటికీ నిత్యనూతనంగా భాసిల్లుతున్నాయి. మనుష్యుల్లో రావలసిన మార్పులు నేటికీ ఇంకా రావాల్సే వున్నాయి. లక్షలాది మంది పోతులూరి వారి భక్తులుగా మారారు. వారంతా స్వామి చెప్పిన బాటలో నడుస్తున్నారు. అస్పశృత, సమానతలను స్వామి నిరసించారు. మానవులంతా ఒకటే అని చాటిచెప్పారాయన. జంతుబలులను నిషేధించారు. సమాజంలో ఉన్న అసమానతలను ఆనాడే వ్యతిరేకించిన వారు స్వామి. నేడు మనం ఈ కాలంలో జరుగుతున్నవన్నీ ఆనాడేస్వామి కాల జ్ఞానంలో చెప్పి ఉన్నారు. ఇపుడు కూడా ఏదైనా వింత జరిగితే చిన్న పెద్ద తేడాల్లేకుండా ఇది బ్రహ్మంగారు ఎపుడో చెప్పి వున్నారు అని రూఢిగా చెప్తారు. అంటే నాటి తత్వాలు నేటికి జనుల అంతరంగాల్లో నాటుకుపోయాయి. స్వామి చెప్పిన నీతులను పాటించేవారు స్వామి కరుణను పొందుతున్నారు. వారికి కలిపీడ అంటదు. కలిమాయలో పడి అధర్మాన్ని వారు చేయరు. అటువంటి వారు పరంధాముని పథానికి తప్పక వెళ్తారు.
శ్రీ మన్నారాయణ మూర్తి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి శ్రీవీర బ్రహ్మేంద్రులుగా అవతరించారని భక్తులు నమ్ముతారు. విశ్వబ్రాహ్మణ వంశంలో ప్రకృతాంబ , పరిపూర్ణాచార్యులకు పుట్టిన వీరు అఖిల లోకాలకు జగద్గురు అయ్యారు. అలనాటి శ్రీకృష్ణుని వలె ఈ కలియుగంలోను స్వామి గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంటికి వెళ్లి గోవులను కాచారు. ఆ గోవులను కాచే నెపంతోనే రవ్వల కొండపై కూర్చుని 14 వేల తాళపత్ర గ్రంథాలు రచించారు.
నాటి కృష్ణుడు ఆవులను దూడలను ఒక చోట నిలిపి వాటి చుట్టూ గిరి గీసి తాను తన సంగడీలతో ఆడుకుంటూ ఆ పశువులకు ఉన్నచోటే సమృద్ధిగా తిండి దొరికినట్లు అవి అన్నీ హాయిగా నెమరేసుకొంటూ కునుకు తీసేటట్లు చేస్తే ఈ వీరబ్రహ్మంగారు అచ్చమాంబ గోవులను గిరి గీసి అందులో కూర్చున్న చేసి వాటికి సకల సదుపాయాలను కలుగజేసి తాను గుహలో కూర్చుని కాలజ్ఞానాన్ని రచించసాగారు.
తన భక్తులకు, ఆ గ్రామ వాస్తవ్యులకు ఎన్నో మహిమలను ఆనాడే స్వామి చూపారు. శివకోటచార్యుల పుత్రికైన గోవిందమాంబను స్వామి వివాహం చేసుకొన్నారు.
ఓ వైపు సంసారాన్ని సాగిస్తూ మరో వైపు ఆధ్యాత్మిక సంపదను సాధన చేశారు. అధర్మమార్గంలో నడిచేవారికి చేయూత నిచ్చి సన్మార్గం వైపు మళ్లించారు. అన్ని ఆశ్రమాల్లోకి మేటిదైన గృహస్థాశ్రమంలోనే ఉంటూ గోవిందుని భజన ఎలా చేయాలో మానవాళికి నేర్పించిన మహానుభావుడు వీర బ్రహ్మం.
ఆ మహానీయుని బోధలను నేడు వారి శిష్యులు ప్రచారం చేస్తునే ఉన్నారు. వీరబ్రహ్మంగారు చూపిన దారిలో నడవడమే మనం ఆయనికిచ్చే నివాళి

- టి. ఈరన్న