మెయిన్ ఫీచర్

జీవనశైలిలో యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో కొన్ని విషయాలను తెలుసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. అవి మానవుని జీవనశైలిని సులభతరం చేస్తాయి. ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.. అంతేకాదు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటివాటిల్లో యోగా మొదటిస్థానంలో ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడులన్నీ మనిషి ఆరోగాన్ని కుదేలు చేస్తున్నాయి. శరీరం రోగాలపుట్టగా మారితే, మనసు కూడా భయాలు, బాధలతో నలిగిపోతుంది. ఇలాంటి సమయంలో మనిషికి వికాసం, ఎదుగుదల అనేది అసాధ్యం. అలాంటప్పుడు నిస్సందేహంగా మనిషి శరీరాన్ని నయంచేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కా కుండా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. ఏ వ్యాయామంతో పోల్చి చూసినప్పటికీ యోగాలో ఉన్న చాలా విశిష్టతలు దీన్ని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. యోగాకు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం శరీరంపై మాత్రమే ప్రభావం చూపించదు. శరీరంతో పాటు మెదడు, ఆత్మ.. ఇలా అన్నింటినీ శుద్ధిచేసి, వృద్ధి చేయడంలో యోగా కీలకపాత్ర పోసిస్తుంది. యోగా చేయడం వల్ల పదిహేను అత్యద్భుత లాభాలున్నాయని చెబుతారు. అవేంటో చూద్దామా..
* యోగా ఎముకలను దృఢంగా శక్తివంతం చేస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో ఉండే కాల్షియం తరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఎముకలు బలహీనం అవుతాయి. ఈ పరిస్థితుల్లో బోలు ఎముకల వ్యాధి సోకే అవకాశం ఉంది. కొన్ని ఆసనాలు వేయడం ద్వారా ఎముకలు శక్తివంతమై వాటి బరువు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఎముకలు త్వరగా విరగవు.
* రోగనిరోధకశక్తి పెరగడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని ఆసనాల వల్ల శరీరంలో శోషరస ద్రవాలు పెరుగుతాయట. వీటిలో రోగనిరోధక కణాలు అధిక సంఖ్యలో ఉంటాయట. ఇవి శరీరంలో ఉండే వివిధ రకాల ఇనె్ఫక్షన్లు మరియు వ్యాధులతో సమర్థవంతంగా పోరాడి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
* అధికంగా ఆహారం అనే కోరికకు యోగా అడ్డుకట్ట వేస్తుంది. శరీరానికి, మెదడుకు మధ్య ఉన్న బంధాన్ని దృఢంగా ఉంచడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనం రోజూ ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో మనం అర్థవంతమైన ఆహారాన్ని తీసుకుని ఎంత అవసరమో అంత భుజిస్తాం.
* నిద్రలేమిని తరిమికొట్టడానికి యోగా బాగా సహాయపడుతుంది. ఒత్తిడి, నిస్తేజమైన జీవన విధానం వల్ల చాలామంది వ్యక్తులు ఇరవై సంవత్సరాలకే నిద్రలేమితో బాధపడుతుంటారు. యోగా నిద్రపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. వారానికి రెండుసార్లు యోగా చేసినా కూడా అది మన మెదడుకి ఎంతో స్వాంతనను చేకూరుస్తుంది. ఒత్తిడులన్నింటినీ దూరం చేస్తుంది. నిద్రపోయే ముందు ఊపిరి తీసుకునే వ్యాయామాలు చేసినా కూడా నాణ్యమైన నిద్ర పడుతుంది.
* రక్తపోటును తగ్గించడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శరీరమంతటా కూడా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇందువల్ల ప్రాణవాయువు కలిగిన రక్తం శరీరంలో అన్ని అవయవాలకు బాగా అందుతుంది. ఇందువల్ల రక్తపోటు తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కలిగే రక్తపోటుని కూడా యోగా తగ్గిస్తుంది.
* జీవక్రియను పెంచడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మన శరీరం తీసుకునే ఆహారంలోని పోషకాలన్నింటినీ సరిగ్గా గ్రహించాలి అంటే మనం తీసుకునే ఆహారం సరైన పద్ధతిలో జీర్ణం అవ్వాలి. సరిగ్గా జీర్ణం అవ్వకపోతే పొట్టకు సంబంధించిన సమస్యలెన్నో తలెత్తుతాయి. బరువు కూడా పెరిగిపోతాం. కడుపులో ఎన్నో రకాల జీర్ణక్రియకు సంబంధించిన ద్రవాలను ఉత్పత్తి చేయించడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆహారం సరైన పద్ధతిలో జీర్ణం అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.
* శరీరంలో ఉన్న కండరాళ్లనే కాకుండా గుండె సంబంధిత కండరాలను శక్తివంతం చేయడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగావల్ల గుండె సరైన పద్ధతిలో కొట్టుకోవడమే కాకుండా రక్తప్రసరణను కూడా మెరుగు పరుస్తుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వును తగ్గించడంతోపాటు, గుండెపోటు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
* శరీరంలోని అంతస్రావం విధులను మెరుగుపరచడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్న హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. శరీరం సరైన పద్ధతిలో పనిచేయాలంటే అందుకు ఖచ్చితత్వంతో కూడిన హార్మోన్ల ఉత్పత్తి జరగడం చాలా ముఖ్యం. హార్మోన్ల అసమతుల్యత చోటుచేసుకోకుండా ఉండటాన్ని యోగా నియంత్రిస్తుంది.
* రక్తంలో ఉన్న ట్రై గ్లిజరాయిడ్స్‌ను సంఖ్యను తగ్గించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ఉన్న చెడు కొవ్వును ట్రై గ్లిజరాయిడ్స్ అని పిలుస్తారు. ఇవి గనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని అనారోగ్య రక్తం అంటారు. దీని కారణంగా శరీరంలో రక్తప్రసరణ తగ్గిపోయే అవకాశం ఉంది. చివరికి ఇది గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల వంటి విపరీత పరిణామాలకు దారితీయొచ్చు. యోగా చేయడం వల్ల ట్రై గ్లిజరైడ్స్ నాశనం అవుతాయి.
* యోగా శరీర నైపుణ్యాన్ని పెంచుతుంది. ఎవరైతే యోగాని ప్రతిరోజూ సాధన చేస్తారో అటువంటి వ్యక్తుల శరీరానికి వశ్యత ఎక్కువగా ఉంటుంది. శరీరానికి, మెదడుకు మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. ఇందువల్ల కీళ్ల సమస్యలు తగ్గుతాయి.
* మతిమరుపు వ్యాధిపూ పోరాటం చేయడానికి యోగా ఉపయోగపడుతుంది. మెదడు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, దాని పనితీరును పెంచడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. యోగా వల్ల మతిమరుపు వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య వచ్చిన కొన్ని అధ్యయనాలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
* బహుళ స్ల్కీరోసిస్‌ను నిర్వహించడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చేతులు, కాళ్లల్లో తిమ్మిరి, సమన్వయం కోల్పోవడం , అలసటగా ఉండటం వంటి లక్షణాలతో ఏ వ్యక్తులైతే బాధపడుతుంటారో వాళ్ళందరూ బహుళ స్క్లీరోసిస్‌తో బాధపడుతున్నట్లు అర్థం. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి యోగానే పరిష్కారం.
* మణికట్టు సంబంధిత సొరంగ సిండ్రోమ్‌కు కూడా యోగానే పరిష్కారం. ఏ వ్యక్తులైతే మణికట్టు దగ్గర విపరీతమైన నొప్పిని అనుభవిస్తుంటారో ఆ పరిస్థితినే కార్పల్ టనె్నల్ సిండ్రోమ్ అని అంటారు. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు.
* టైప్-2 మధుమేహాన్ని యోగా ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది. ఇన్సులిన్ స్థాయిలను యోగా నియంత్రణలో ఉంచుతుంది. క్లోమ గ్రంథులను ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. ఇలా టైప్-2 మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే.
* మలబద్ధకాన్ని నయం చేయడానికి కూడా యోగా చక్కగా ఉపయోపడుతుంది. కొన్ని రకాల ఆసనాల వల్ల జీర్ణక్రియ బాగా జరిగి ఈ సమస్య తొలగిపోతుంది.
*