మెయిన్ ఫీచర్

సత్య ధర్మ సంరక్షులు రాఘవేంద్ర తీర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దీక్ష వెనుకనే రక్షణ, స్మరించడంతోనే చల్లని దీవెనలు’’ ఉంటాయని ఆర్యోక్తి. ఆ ఉక్తికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ గురు రాఘవేంద్ర తీర్థులు.
శ్రీ రాఘవేంద్రులు ప్రహ్లాదుని అవతారమని కొందరు, హనుమ అంశమని మరికొందరు అంటారు. ఈ పుడమిపై సత్య ధర్మాలను నిలపడానికి కంకణబద్ధులైనవారు శ్రీవారు. విజయనగర సామ్రాజ్య పతనంతో, మహమ్మదీయుల పెత్తనం పెరిగి హిందూ ధర్మం అణచివేయబడుతున్న తరుణంలో సత్య ధర్మ సంరక్షణకు అవతరించిన మహనీయుడు.
రాయల వంశజుడైన సదాశివరాయలు ఆస్థాన పండితుడైన తిమ్మన భట్టు, భార్య గోపమ్మ, మహమ్మదీయుల చిత్రహింసలకు తాళలేక ఎందరో హిందువులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఆ తరుణంలో తిమ్మన భట్టు గోపమ్మతో కలిసి తన గురువులు, తంజావూరులో ఉంటున్న నరేంద్ర తీర్థులకు శరణాగతులయ్యారు.
శిష్యుని పరిస్థితి తెలుసుకుని ఆ దంపతులను ఆదరించారు. నరేంద్ర తీర్థులు తంజావూరు ప్రభువులతో తనకు గల పలుకుబడి కారణంగా తిమ్మన భట్టుకు ఆస్థానంలో కవిగా కొలువు ఇప్పించారు. అక్కడ ఆ దంపతులకు వెంకటాంబ, గురురాజులు జన్మించారు. పెళ్లీడు రాగానే కుమార్తెకు వివాహం చేసి అత్తవారింటికి పంపించారు. కొడుకును గురుకులంలో చేర్పించారు. ఇక దంపతులిద్దరే మిగిలారు. అందుకని తీర్థయాత్రలకు పయనమయ్యారు.
తిరుమలేశుని దర్శనం కోసం తిరుమల చేరుకున్న తిమ్మన భట్టుకు కలలో శ్రీనివాసుడు సాక్షాత్కరించి ‘ప్రపంచ ఖ్యాతి గడించే పుత్రుని ప్రసాదిస్తున్నాని’ చెప్పి అంతర్హితుడయ్యడు. కల సాకారమైంది. గోపమ్మ నవమాసాలు నిండడంతో బ్రహ్మ తేజంతో వెలుగుతున్న మగ బిడ్డను ప్రసవించింది. వెంకటేశ్వరుని వరప్రసాదంగా భావించి శిశువుకు వేంకటనాధుడని ఆ దంపతులు నామకరణం చేశారు. అల్లారుముద్దుగా పెంచసాగారు.
ప్రహ్లాదునివలె పసితనంలోనే వేంకటనాథుడు శ్రీహరిని హృదయంలో నింపుకున్నాడు. తల్లి తనయునికి హరిభక్తి సామ్రాజ్యాన్ని చవిచూపింది. మూడు సంవత్సరాల ప్రాయానికే వేంకటభట్టును నారాయణుడు అనుగ్రహించగా, తిమ్మన భట్టుపై జ్యేష్టాదేవికి ఆగ్రహం కలిగింది. తిమ్మనభట్టు ఆర్థికంగా చితికిపోయాడు. కుటుంబ పోషణ భారమై పూట గడపడమే ప్రశ్నార్థకమైంది.
అదే సమయంలో ద్వైత వేదాంత పీఠాధిపతి శ్రీ విజయేంద్ర తీర్థులు కుంభకోణం వచ్చారు. కుంభకోణం సంస్థానం స్వాగత ఉత్సవాలతోపాటు విందు ఏర్పాటుచేశారు. ఆహ్వానం అందుకుని తిమ్మనభట్టు సకుటుంబంగా అక్కడకు వెళ్లాడు. శ్రీ విజయేంద్రులవారి చూపు బాలుడైన వేంకటనాధునిపై ప్రసరించింది. ఆ బాలునిలో అనిర్వచనీయమైన శక్తి పొంచి ఉందనీ, దైవాంశ ఉన్నదనీ గుర్తించారు. ఆ సందర్భంలో తిమ్మనభట్టు తన గోడును వినిపించి, తనయునికి అక్షరాభ్యాసం జరిపించవల్సిందిగా అర్థించాడు.
శ్రీవిజయేంద్రులు ‘ఓం’కారంతో అక్షరాభ్యాసం జరిపారు. యుక్తవయస్సు రాగానే సరస్వతిని వివాహం చేసుకున్నారు. ఆమె అన్నగారైన లక్ష్మీ నరసింహాచార్యులు గొప్ప పండితులు. వారి వద్ద సకల శాస్త్రాలు అభ్యసించి గొప్ప పండితుడైనా ఆర్థికంగా కుదుటపడలేదు. సరస్వతి కొడుకుకు జన్మనిచ్చింది. లక్ష్మీనారాయణుడని పేరుపెట్టారు. పరిస్థితులను అధిగమించడానికి శ్రీ సుధీంద్ర యతీంద్రులను దర్శించాలని వెళ్లారు. మఠంలో వేంటనాథుని అంతేవాసిగా చేర్చుకుని మరింతగా శాస్త్రాలను పెంపొందింజేశారు. వేంకటనాథునిలో విష్ణ్భుక్తుడైన శుంకర్ణునే చూసారు. గురువు శిష్యునిపై వాత్సల్యం కురిపించారు. ఇది మిగతా శిష్యులకు అసూయ కలిగించింది. గురువుగారికి కనువిప్పు కలిగే అవకాశం కోసం ఎదురుచూడసాగారు. అయితే సుధ అను సంస్కృత గ్రంథానికి వేంకటనాధుడు పరిమళ అను వ్యాఖ్యాన్ని రచించడం గురువులకేకాదు అక్కడ చేరిన పండిలంతా వేనోళ్ల ప్రశంసించడంతో అసూయపరులైన తోటి అంతేవాసులకు కనువిప్పు కలిగింది.
కాలక్రమంలో సుధీంద్ర యతీంద్రులకు వార్థక్యం సమీపించడంతో ఉత్తరాధికారిగా పీఠాన్ని అధిరోహించడానికి గురువాజ్ఞగా సన్యాసం స్వీకరించి వేంకట నాధుడు రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసనామం స్వీకరించారు. భర్త సన్యాసం స్వీకరించడంతో సరస్వతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ప్రేతాత్మగా మారిపోయింది.
శ్రీ రాఘవేంద్ర తీర్థులు కుంభకోణం నుంచి ఆంధ్ర ప్రాంతం, కర్నూలు జిల్లా, మంత్రాలయంలో తుంగభద్రా నదీతీరాన మంత్రాలయ మఠం నిర్మాణం చేశారు. మంత్రసిద్ధులు, గొప్ప పండితులు అయిన యతీంద్రులు సరస్వతి ప్రేతాత్మకు స్వర్గలోక ప్రాప్తిని తన మంత్రశక్తితో లభింపజేశారు.
ద్వైతమతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఎన్నో గ్రంథాలను రచించారు. ద్వైతమత ప్రతిష్ఠాపకులు ఆనందతీర్థుల (మధ్వాచార్యులు) తరువాత శ్రీ రాఘవేంద్ర తీర్థుల కారణంగా మధ్య సంప్రదాయం ప్రపంచ ప్రాచుర్యం పొందింది. మధ్వ సంప్రదాయం శ్రీ రాఘవేంద్ర తీర్థుల కాలం సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడింది.
శ్రీ రాఘవేంద్ర తీర్థులు తన డెబ్బదివ ఏట అనగా 1671లో శ్రావణ బహుళ విదియనాడు సజీవంగా బృందావనస్థులయ్యారు. 700 ఉత్కృష్ట సాలిగ్రామాలతో, శుద్ధ మృత్తికతో మూయబడిన బృందావనం పవిత్రమయినది. స్మరణీయమైనది. తాను ఏడు వందల సంవత్సరాలు బృందావనంలో సజీవంగా ఉంటానని, భక్తుల ఆకాంక్షలను నెరవేరుస్తానని, బృందావనస్థులవడానికి అందరికీ తెలియజేశారు. అన్నమాట ప్రకారం నేటికి శ్రీ రాఘవేంద్రుల మహిమను అసంఖ్యక భక్తులు పొందుతున్నట్లు చెబుతున్నారు.

-ఎ.సీతారామారావు