మెయన్ ఫీచర్

కశ్మీర్ ‘నిప్పు’ను ఆరనివ్వని పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశ్మీర్ లోయలో రెండు నెలలకు పైగా జరుగుతున్న అల్లర్లలో 75 మందికి పైగా మృతిచెందారు. ప్రశాంతత నెలకొల్పడంకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తు న్న ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వడంలేదు. తాజాగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నాయకత్వంలో అఖిలపక్ష ప్రతినిధిబృందం రెండు రోజులపాటు కశ్మీర్‌లో పర్యటించి వచ్చినా చెప్పుకోదగిన మార్పు తీసుకురాలేకపోయారు. ఉగ్రవాది బుర్హన్ వనీని చంపిన అనంతరం పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరింత మెరుగుగా పరిష్కరించే ప్రయత్నం చేసి ఉండవలసిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని కలవడానికి వేర్పాటువాద నాయకులు తిరస్కరించారు. అందుకు చెప్పిన కారణం ఈ సందర్భంగా గమనార్హం. ప్రధాన అంశాల పరిష్కారానికి సంప్రదింపుల ప్రాతిపదికగా పారదర్శకతతో కూడిన ఒక స్పష్టమైన ఎజెండా లేకుండా పార్లమెంటరీ ప్రతినిధి వర్గంతో సమాలోచనలు జరిపినంత మాత్రం చేత ఎటువంటి ఫలితం ఉండబోదని వారు పేర్కొన్నారు. అయితే వాస్తవానికి వారు అఖిలపక్ష ప్రతినిధివర్గాన్ని కలుసుకున్నా పరిస్థితిలో చెప్పుకోదగిన మార్పు రాగలదని ఎవ్వరూ భావించడంలేదు. వేర్పాటు వాదులు చెబుతున్న ప్రధాన అంశాలు ఏమి టి? కశ్మీర్‌లోయలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. లేదా తమను పాకిస్తాన్‌లో విలీ నం చేయాలి. వేర్పాటువాదులు చెబుతున్న విధంగా ఇటువంటి పారదర్శకతతో కూడిన మూల అంశాలపై చర్యలకు అంగీకరించడం అంటే భారతదేశ సార్వభౌమాధికారాన్ని వారిముందు తలవంచేటట్లు చేయడమే కాగలదు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా భారత ప్రభుత్వం అందుకు ఆమోదం తెలిపే ప్రస క్తే ఉండదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, వామపక్షాలు అధికారంలో ఉన్నా అంతకన్నా భిన్నమైన ధోరణి అవంబించే అవకాశం ఉండదు. కేవలం రాజకీయ లబ్దికోసమే నేడు వేర్పాటువాదుల పట్ల ఉదారంగా మాటలు వదులుతున్నా ఆచరణలో వారు నేటి ప్రభుత్వంకన్నా భిన్నంగా వ్యవహరిస్తారని చెప్పలేం. కశ్మీర్‌లోయలో సమస్యల పరిష్కారం కోసం యుపిఎ పాలనలో కాంగ్రెస్ ఐదేళ్లు కృషి చేసింది. అయితే పేరుకు కొన్ని సమాలోచనలు జరిగినా వాస్తవంగా సాధించింది అంటూ ఏమీలేదు. అందుకనే ప్రస్తుత పరిస్థితులలో కశ్మీర్‌లోయలో హింసాయుత ప్రతిక్రియలను అదుపు చేయడం శాంతియుత ప్రక్రియతో సాధ్యంకాదని ఇప్పటికైనా అంతా గ్రహించాలి. అంతమాత్రం చేత సైనికులను ఉపయోగించి, కశ్మీర్‌లోయలో హింసాయుత పోకడలను అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా, ఈ చర్యలు శాశ్వత పరిష్కారానికి దారితీయవని గుర్తించాలి. కశ్మీర్‌లోని సమస్యలకు మూలం మనదేశంలో లేదు. పాకిస్తాన్‌లో ఉంది. పాకిస్తాన్ సమస్యను పరిష్కరించకుండా ఇక్కడ పరిస్థితులను మెరుగు పరచడం సాధ్యం కాదు. పాకిస్తా న్ సమస్య అంటే ఆ దేశంలో సైన్యం, ఐఎస్‌ఐ, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద బృందాలనుండి ఎదురవుతున్న సమస్యల కారణంగా, మనదేశంలో అస్థిరత సృష్టించడంకోసం, మన దేశాన్ని బలహీన పరచడం కోసం దృఢ సంకల్పంతో పాకిస్తాన్ పనిచేస్తున్నదని గ్రహించాలి. నేడు కశ్మీర్ లోయలో చెలరేగుతున్న అల్లర్లను రెచ్చగొడుతున్నది, ప్రధాన పాత్ర పోషిస్తున్నది సరిహద్దు ఆవలి వైపునుండి పాకిస్తాన్ అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడి మూలాధారాలను కట్టడి చేయకుండా కశ్మీర్ లోయలో ప్రశాంతత నెలకొల్పడం ఎప్పటికీ సాధ్యం కాదు.
బలూచిస్థాన్‌లోని మానవహక్కుల ఉల్లంఘనలను ప్రస్తావించడం ద్వారా ప్రధానమంత్రి ఈ విషయమై వ్యూహాత్మక చొరవ తీసుకోవడం అభినందనీయం. అంతటితో ఆగకుండా గతంలో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం ఇందిరాగాంధీ చూపినంత చొరవ, సాహసాన్ని ప్రదర్శించడానికి మోదీ సిద్ధపడాలి. 1947, ఆగస్టు14న బలూచిస్థాన్, పాకిస్తాన్‌లో అంతర్భాగం కాదు. పైగా అది స్వతంత్ర దేశంగా కొనసాగేందుకు, అండగా ఉంటామని నమ్మించి మహమ్మదలీ జిన్నా సైన్యాన్ని పంపి ఆక్రమించుకున్నాడని గుర్తించాలి. అందుచేత అదే స్వాతంత్య్రానికి బాసటగా నిలబడడం ద్వారానే పాకిస్తాన్ సైన్యం దూకుడును కట్టటి చేయగలం. పాకిస్తాన్ సైనికులు ముఖ్యంగా జనరల్స్ భారత్ పట్ల శత్రుభావంతో వ్యవహరిస్తున్నారు. మనదేశంపై పగతీర్చుకోవాలని తహతహలాడుతున్నారు. అందుకోసం మనదేశాన్ని అస్థిర పరచడానికి లభించే ఏ అవకాశాన్నీ వారు వదులుకోవడం లేదు. పాకిస్తాన్‌లో పౌర ప్రభుత్వాన్ని బలహీన పరచి, కీలకమైన అధికారాన్ని ముఖ్యంగా, రక్షణ, జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల విషయంలో భారత్‌కు సంబంధించి సైన్యమే కీలక అధికారం కలిగివుంది. ఈ అంశాలలో పౌర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేకుండా చేస్తున్నారు.
ఒక ముస్లిం పదిమంది హిందువులకు సమానం అంటూ పాకిస్తాన్ సైనికులు ప్రగల్భాలు పలుకుతున్నా ఇంతవరకు భారత్‌తో జరిగిన ఒక్క యుద్ధంలో కూడా వారు విజయం సాధించలేపోయారు. 1970లో వాస్తవానికి పాకిస్తాన్‌ను భారత్ ఓడించింది. అందుకు మనదేశంపై పగ తీర్చుకోవడం ద్వారా తమ వీరోచిత సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలని పాక్ సైనిక నాయకత్వం కలలు కంటున్నది. అందుకే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడం కోసం పౌర ప్రభుత్వాలు ఎటువంటి చిన్నపాటి ప్రయత్నాలు జరిపినా సైన్యం తీవ్రరూపంలో శాంతి ప్రక్రియను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నది. వాజ్‌పేయి బస్సుపై లాహోర్ పర్యటనకు వెళ్లగానే కార్గిల్ యుద్ధం జరిగింది. నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లిరాగానే కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగాయి.
‘‘హిందూ భారత్’’తో పాకిస్తాన్ పౌర ప్రభుత్వాలు ఎటువంటి సయోధ్య కుదుర్చుకునే అవకాశాలు లేకుండా చేయడం కోసం జనరల్ జియా ఉల్ హక్ పాకిస్తాన్‌ను ఇస్లామీకరణ చేశాడు. ఈ విష ప్రభావాన్ని కశ్మీర్ లోయలో చొప్పించే యత్నం అప్పటినుంచే పాక్ సైన్యం చేస్తున్నది. మరోవంక ఇస్లామిక్ స్టేట్ చేస్తున్న అకృత్యాలు మనదేశంలోని కొందరు ముస్లిం యువతను కూడా ఆకట్టుకొని రాడికల్స్‌గా మారుస్తున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు కశ్మీర్ లోయలో సైతం స్పష్టంగా కనిపిస్తున్నది. నేడు కశ్మీర్‌లోని హురియత్ నాయకులు సహితం ఇటువంటి రాడికల్ యువకుల మధ్యలో ఉన్నారు. వీరిలో ఎవరైనా కొంచెం ప్రగతిశీలకంగా మాట్లాడినా, శాంతి నెలకొల్పే వైపు చిన్న అడుగు వేసే యత్నం చేసినా వారి ఉనికిని ఈ యువకులు సహించలేకపోతున్నారు. హత్యా ప్రయత్నాలు కూడా యదేచ్ఛగా జరుగుతున్నాయి. అందుకనే వారు శాంతికోసం అర్థవంతమైన సమాలోచనలు జరుపగల పరిస్థితులు లేవు.
జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నట్టు లోయలో అల్లర్లకు ఐదు శాతం జనాభా మాత్రమే బాధ్యులవుతున్నారు. ఆ రాష్ట్ర జనాభాలో 15 శాతం మాత్రమే కశ్మీర్ లోయలో ఉన్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో కేవలం ఐదు జిల్లాల్లో మాత్రమే అల్లర్లు జరుగుతున్నాయి. రెండు నెలలు కర్ఫ్యూ విధించింది కూడా ఈ ఐదు జిల్లాలలోని కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మాత్రమే. మిగిలిన చోట్ల 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. సరిహద్దులో ఉన్న పూంచ్, కార్గిల్ జిల్లాల్లో 90 శాతం మంది ముస్లింలు. కానీ గత రెండు నెలల్లో ఈ రెండు జిల్లాల్లో ఒక్క భారత వ్యతిరేక ప్రదర్శన జరగకపోవడం గమనార్హం. ఇక్కడి ముస్లింలలో సైతం సున్ని, షియా, గుజ్జర్, పహాడీలు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. వీరెవరూ ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో పాల్గొనడంలేదు. నేడు కశ్మీర్ లోయలోని జిహాదీలకు మూలం పాకిస్తాన్‌లో ఉంది. అందుకనే పాక్‌లోని ఆ శక్తులను కట్టడి చేయకుండా కశ్మీర్‌లోయలో పరిస్థితులను మెరుగుపరచడం సాధ్యంకాదు. కశ్మీర్ లోయలో తమ పట్టును పెంచుకోవడం కోసం పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు దుందుడుకు వైఖరి అవలంభించే అవకాశం ఉన్నది. శాంతి ప్రయత్నాలకు సహకరించే ప్రధాన పార్టీల నాయకులు ఎవ్వరిపైన అయినా హత్యాయత్నాలు జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. జమ్ములోని ముస్లిం ఆధిపత్యం గల ప్రాంతాలలో సహితం విద్రోహ చర్యలు వ్యాప్తి చేసే అవకాశాలున్నాయి. పంజాబ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్-్భజపా కూటమి ఓటమి చెందితే అక్కడ తిరిగి ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరిగే అవకాశాలున్నాయి.
మరోవంక పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ఇస్లాం ఉగ్రవాద చర్యలు మరింత ఉద్ధృతం అయ్యే విధంగా పాకిస్తాన్ సైన్యం కృషి చేసే అవకాశం ఉంది. 1971లో అక్కడ జరిగిన మారణహోమానికి కారకులైన వారిని షేక్ హసీనా ప్రభుత్వం వధిస్తూ ఉండటంతో ఉగ్రవాదం రూపంలో ప్రతీకార చర్యలు పెరుగుతున్నాయి. వీరి ప్రభా వం పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌కు వ్యాప్తి చెందుతున్నది. ముస్లిం ఓట్లకోసం ఉగ్రవాదం పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ వారికి మంచి అవకాశం కల్పిస్తున్నారు. భారత్-పాకిస్తాన్‌ల మధ్య శాంతి నెలకొని, సయోధ్య ఏర్పడడానికి పాకిస్తాన్ సైనిక నాయకత్వం సిద్ధంగా లేదు. అందుకు చైనా నుండి వ్యూహాత్మక మద్దతు లభించగలదని ధీమాగా ఉన్నారు. ఈ పరిస్థితులలో కశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులకు మూలం సరిహద్దులకు ఆవల ఉందని గ్రహించాలి. వ్యూహాత్మకంగా వ్యవహరించి, పాకిస్తాన్‌ను కట్టడి చేయాలి. అందుకు క్రియాశీలక విధానం అవసరం కాగలదు.

- చలసాని నరేంద్ర