మెయిన్ ఫీచర్

అసామాన్యులుగా ఆలోచించాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనలు అందరూ చేస్తారు. కాని అసాధారణంగా కొందరే ఆలోచిస్తారు. అలా భిన్నంగా ఆలోచించగలిగినవారు మాత్రమే జీవితంలో విజయాలు సాధిస్తారు. నాయకులు అవుతారు. ఇలా వారియొక్క, విశిష్ట వ్యక్తిత్వంతో పలువురిని ఆకట్టుకుంటారు. ఎన్నో విజయాలను సాధిస్తారు. అసలు అసాధారణంగా ఆలోచించటమంటే ఏమిటి! అందరూ ఆలోచించే పద్ధతిలో లేదా ఒక మూస విధానంలో ఆలోచించక పోవటమే.
అసాధారణ ఆలోచనలు బాగా చదువుకున్నవారు, ఐ.క్యూ. అధికంగా ఉన్నవారే చేస్తారనుకోవడం పొరపాటు. అసాధారణ ఆలోచనలు చేసేవారికుండే అసలు అర్హత వ్యతిరేక భావాల్ని మనసులోకి రానివ్వకపోవటం ఏదైనాసరే మంచి గురించి, మేలు గురించిన ఆలోచనలనే భావిస్తారు. ఇలా చేస్తే ఎదురుదెబ్బలు తింటామా! విఫలమైతే మన పరిస్థితి ఏమిటనే ఆలోచన వారికి లేకపోవటంవల్లనే అసాధారణంగా ఆలోచిస్తారు.
మంచినే కోరుకోండి:- పాజిటివ్ ఫీలింగ్ మనుషులకు చాలా అవసరం. అది వున్నప్పుడు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఒత్తిడి వంటి వ్యతిరేక అంశాలు వెంటాడవు. హాయిగా రిలాక్స్‌గా పనిచేయగలరు. చేసే పనిలో సృజనాత్మకత పెరుగుతుంది. మంచి ఫలితాలను సాధిస్తారు. సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని అర్ధంచేసుకుని, విశే్లషించి, అంగీకరించి, పరిష్కరించగలిగిన 3పాజిటివ్2 దృక్పధం అవసరం. నాటివరకూ వున్న పాజిటివ్ దృక్పధాన్ని వదులుకుని నెగిటివ్ భావాలలోకి వెళ్ళడమంటే కోరి కష్టాలను తెచ్చుకోవటమే. పాజిటివ్ భావాలు స్థిరంగా వున్నప్పుడే మనిషిలోని సర్వశక్తులు బయటకొస్తాయి. ఆత్మస్థయిర్యం కోల్పోయిన వారికి ఆలోచనలు తట్టవు. అందుకే ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక్క క్షణం ఆగి తిరిగి పాజిటివ్ భావాన్ని, ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించుకునే యత్నం చేయాలి.
సోమరితనం వీడండి:- ఏ పనీ చేయకుండా సోమరిగా వుండేవారి మెదడు దుర్మార్గంవైపు మళ్ళుతుంది. సమాజంలో సోమరులు పెరిగితే ప్రగతి ఆగిపోతుంది. సోమరితనం నుండి వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. అటువంటి వారి వ్యక్తిత్వం కుచించుకుపోతుందేగాని వికసించదు. సోమరితనంలో తేలియాడుతూ భగవంతుని స్మరించటమే తమ జీవితంగా చెప్పుకునేవారు సాధించగలిగింది ఏమీలేదని వివేకానందులు స్పష్టంచేశారు. కేవలం భగవన్నామ స్మరణ చేయటం అనేది ఒక్కటే. ఎటువంటి మేలు చేయదు.
భగవంతుని మీద విశ్వాసంతో, ఆయన కరుణకు పాత్రులై సాటివారికి సాయపడగలిగినవారు కొత్త ఆలోచనలు చేయగలగాలి. వైఫల్యం తలచుకుని బాధపడేవారు కొత్త ఆలోచనలు చేయలేరు. ఎంత కాలమని ఒక వైఫల్యం గురించి ఆలోచిస్తాం. వైఫల్యం ఎదురైనప్పుడు దానిని ఛేదించేందుకు అసాధారణ ఆలోచన చేయగలిగిన నేర్పు ఉండాలి.
భిన్నమైన ఆలోచనలు రావాలన్నా, అసాధారణ ఆలోచనలు అమలుచేయాలన్నా సుఖంగా వున్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవటం ఎందుకు? అనే భావంలోనుండి బయటకు రావాలి. అలా రాగలగటమే వ్యక్తిత్వ వికాసం. అటువంటి వికాసం కావాలంటే కనిపించే, ఎదుర్కొంటున్న సమస్యలను ఒక కొత్త కోణంనుండి చూడటం అలవరచుకోవాలి. ఏ సమస్యనైనా ఒకే కోణంనుండి చూడకూడదు. ముందస్తుగా ఒక నిర్ణయాన్ని ఏర్పరచుకుని ఆ తర్వాత రంగంలోకి దిగటం చెయ్యనే చేయకూడదు. 3ఓపెన్ మైండ్2అనేది చాలా అవసరం.
గత అనుభవాలను గుర్తుచేసుకోవచ్చు కాని గత సందేహాలను నెమరువేసుకోకూడదు. సవాలును స్వీకరించగలిగిన వ్యక్తిత్వం అలవరచుకోవాలి. సవాళ్ళను అంగీకరిస్తేనే అసాధారణ ఆలోచనలు వస్తాయి. కొత్తరకంగా పనులు చేయగలుగుతారు. పక్షులు గాలిలో ఎగరటం అందరూ చూశారు. అయితే దానినుండి విమానపు ఆలోచన చేయటమే 3రైట్ బ్రదర్స్ అవుట్ బాక్స్ థింకింగ్2. అటువంటి అనుభవమే మరెందరో సైంటిస్టులది.
అసాధారణ ఆలోచనల సమాహారమే నూతన ఆవిష్కరణలు. అటువంటి ఆలోచనలు చేసేవారి వ్యక్తిత్వం భిన్నమైనది.

- పి.ఎం.సుందరరావు