మెయిన్ ఫీచర్

మనిషికేనా కుటుంబం?( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే వైద్యుడు ఆ పసికందును తలక్రిందులుగా పట్టుకుని పిర్రలపై గట్టిగా కొడతాడు. వెంటనే వాడు ఏడుస్తూ ఊపిరి పీల్చడం ప్రారంభిస్తాడు. భలే ప్రారంభం. భలే స్వాగతం.
మీరు భయపడిన వెంటనే మీ శ్వాస లయ చాలా మారుతుంది. మీ గుండె దడ మీకు వినిపిస్తుంది. కానీ, మీలో ఎలాంటి భయం లేనపుడు మీ శ్వాస చాలా హాయిగా, నిశ్శబ్దంగా సాగుతుంది. దీనిని మీరెప్పుడైనా గమనించారా? ఇంతవరకు గమనించకపోతే ఇపుడు గమనించండి. గాఢమైన ధ్యానంలో ఒక్కొక్కప్పుడు మీ శ్వాస దాదాపు ఆగిపోయినట్లు మీకనిపిస్తుంది. కానీ అది ఆగదు.
పసికందు పుట్టుకే భయంతో ప్రారంభమవుతుంది. తొమ్మిది నెలలపాటు చీకటిలో వున్న ఆ పసికందు కళ్ళు ఎలాంటి వెలుగును, కనీసం కొవ్వొత్తి కాంతిని కూడా చూడలేదు. అందుకే అధునాతన ఆసుపత్రి దీపాల వెలుగులు చూడగానే ఆ కళ్ళు భయపడతాయి. వెంటనే వైద్యుడు ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా మీ తల్లితో మీకున్న అనుసంధానాన్ని కత్తిరించేస్తాడు. దానితో అంతవరకు మీకున్న ఏకైక భద్రత కాస్త పోతుంది. అందుకే మానవ శిశువంత నిస్సహాయ శిశువు ఈ మొత్తం అస్తిత్వంలో ఎక్కడా లేదని కచ్చితంగా చెప్పొచ్చు. అది మీకూ తెలుసు.
అందుకే గుర్రాలు కాల్పనిక దేవుణ్ణి కనుక్కోలేదు. ఏనుగులు దేవుడి గురించి ఎప్పుడూ ఆలోచించవు. ఎందుకంటే, వాటికి ఆ అవసరం లేదు. అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల వెంటనే లేచి నడుస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చక్కగా పరిశీలిస్తుంది. దానికి మానవ శిశువుకున్నంత నిస్సహాయత లేదు. నిజానికి, మానవ శిశువు నిస్సహాయతపై ఆధారపడిన కుటుంబం, సమాజం, సంస్కృతి, సంప్రదాయాలు, మతాలు, వేదాంతాలను చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. ఇలా ప్రతిదీ మానవ శిశువు నిస్సహాయతపైనే ఆధారపడ్డాయి.
జంతువులలో కుటుంబాలుండవు. అందుకు ముఖ్య కారణం వాటి పిల్లలకు తల్లిదండ్రుల అవసరం లేదు. కానీ, మనిషి ఒక నిర్దిష్ట వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. పుట్టిన పిల్లల బాధ్యతను ఆ వ్యవస్థలో తల్లిదండ్రులే స్వీకరించాలి. ఎందుకంటే, వారి ప్రేమ కలాపాల ఫలితమే పిల్లలు. జంతువుల మాదిరి పిల్లలను గాలికి వదిలేస్తే, వారు జీవిస్తారని మీరనుకోలేరు. అది అసంభవం. ఎందుకంటే, వారికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు పెడతారు? ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? బహుశా, ఆ పసివాడు ‘‘తొందరపడి ముందుగానే ఇక్కడికి వచ్చాడేమో, తల్లిగర్భంలో ఉన్న ఆ తొమ్మిది నెలల కాలం వాడికి సరిపోలేదేమో’’ అనేది కొంతమంది జీవశాస్తజ్ఞ్రుల అభిప్రాయం. ఎందుకంటే, వాడు చాలా నిస్సహాయుడుగా జన్మించాడు. కానీ, తల్లి శరీరం వాడిని తొమ్మిది నెలలు మించి మొయ్యలేదు. అదే జరిగితే ఆమె మరణిస్తుంది. ఆమెతోపాటు ఆ పసివాడు కూడా మరణిస్తాడు. ఒకవేళ ఆ పసివాడు తల్లి గర్భంలో కనీసం మూడేళ్లు గడిపి బయటపడితే బహుశా వాడికి తల్లిదండ్రులు, సమాజం, సంస్కృతి, సంప్రదాయాలు, మతాలు, మతాచార్యులు, దేవుళ్ళ అవసరం ఉండకపోవచ్చు. కానీ, వాడు తల్లిగర్భంలో మూడేళ్ళు ఉండలేడు. ఈ వింత జీవశాస్త్ర పరిమితే మొత్తం మానవాళి ప్రవర్తనను, ఆలోచనను, కుటుంబ, సామాజిక నిర్మాణాలను ప్రభావితం చేసింది. మనిషి భయానికి ఇదే ముఖ్య కారణం.
భయపడడం శిశువు తొలి అనుభవం. మనిషి చివరి అనుభవం కూడా అదే. జననం కూడా ఒక రకమైన మరణమే అని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే,
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.