మెయిన్ ఫీచర్

చెరకు తీపికి తేనెలద్దిన ఘనత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంట్రల్ బొటానికల్ లేబొరెటరీ (అలహాబాద్)కు డైరెక్టర్‌గా, రీజనల్ రీసెర్చి లేబొరెటరీ (జమ్మూ), బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ (బొంబాయి), సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (బొంబాయి) వంటి ప్రసిద్ధ వైజ్ఞానిక సంస్థలకు గౌరవ శాస్తవ్రేత్తగా బహుముఖ సేవలను అందించారు. చెరకు, వంగ మొక్కలపై చిరస్థాయిగా నిలిచే పరిశోధనలు చేశారు. కేరళలోని వర్షాధార అడవుల నుంచి ఔషధపరంగా, వాణిజ్యపరంగా ఉపయోగపడే విలువైన వృక్షజాతులను ఆమె సేకరించారు.
గులాబీకి ఏ పేరు పెట్టినా దాని గుబాళింపులో తేడా ఉండదు.. కానీ, కొడైకెనాల్‌లో ఇద్దరు వ్యవసాయ శాస్తవ్రేత్తలు సృష్టించిన ఆ ‘పసుపురంగు గులాబీ’లు మరీ ప్రత్యేకం.. ఆ గులాబీలను చూస్తే హాయి గొలిపే సువాసనే కాదు, పరిశోధనలకు ప్రాణం పెట్టిన ఓ వృక్షశాస్తజ్ఞ్రురాలి పేరు మన స్మృతిపథంలో మెదులుతుంది.. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ వృక్షశాస్తజ్ఞ్రురాలి నిరంతర తపన నేటి తరానికి స్ఫూర్తి కలిగిస్తుంది.. తమిళనాడులోని కొడైకెనాల్‌లో వృక్షశాస్తవ్రేత్తలు వీరు, గిరిజా వీరరాఘవన్‌లు తాము సృష్టించిన పసుపురంగు గులాబీకి భారతీయ వృక్షశాస్తజ్ఞ్రురాలు ‘ఈకే జానకి అమ్మాళ్’గా నామకరణం చేసి, ఆమె సాధించిన ఘన విజయాలను నేటి తరానికి గుర్తుచేశారు.
మన దేశంలో మహిళలు హైస్కూలు చదువు పూర్తి చేయడమే గగనమైన కాలంలో కేరళకు చెందిన జానకి అమ్మాళ్ వృక్షశాస్త్రంలో అరుదైన పరిశోధనలు చేసి అద్భుతాలను ఆవిష్కరించారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన మిచిగన్ విశ్వవిద్యాలయం నుంచి 1931లో డాక్టరేట్‌ను సాధించిన తొలి భారతీయ వృక్షశాస్తవ్రేత్తగా సంచలనం సృష్టించారు. ప్రధానంగా చెరకుగడల్లో కణజాలం, క్రోమోజోమ్‌లపై ఆమె చేసిన పరిశోధనలు అజరామరంగా నిలిచాయి. సూక్ష్మమైన బీజ మాతృకణాల గురించి సరికొత్త అంశాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆమెకే దక్కింది. చెరకులో కొత్తరకం వంగడాలను సృష్టించారు. మరింత తీపిని అందించే చెరకు రకాలను సృష్టించి, భారతీయ రైతులు చెరకు సాగు విస్తీర్ణం పెంచేలా దిశానిర్దేశం చేశారు.
జీవకణ శాస్త్రం (సైటోజెనెటిక్స్)లో నూతన ఆవిష్కరణలకు నాంది పలికిన జానకి అమ్మాళ్ కేరళలోని తళ్లస్సెరిలో 1897 నవంబర్ 4న జన్మించారు. చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే ఎనలేని మమకారం ఉన్న జానకిలోని పరిశోధనాత్మక తృష్ణను తండ్రి దివాన్ బహద్దూర్ ఈకే కృష్ణన్ ఎంతగానో ప్రోత్సహించారు. కృష్ణన్‌కు మొత్తం 19 మంది సంతానం. మొదటి భార్య శారదకు ఆరుగురు, రెండోభార్య దేవమ్మాళ్‌కు 13 మంది పిల్లలు. దేవమ్మాళ్‌కు పదో కాన్పులో జన్మించిన జానకి తళ్లస్సెరిలో పాఠశాల విద్యను పూర్తి చేసి, మద్రాస్‌లోని క్వీన్ మేరీస్ కళాశాల నుంచి డిగ్రీ, ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఆనర్స్ డిగ్రీ (వృక్షశాస్తం) పూర్తి చేశారు. మద్రాస్‌లోని ఉమెన్స్ క్రిస్టియన్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ మిచిగన్ విశ్వవిద్యాలయం (అమెరికా) నుంచి ప్రఖ్యాత బార్బొర్ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. పితృస్వామ్య వ్యవస్థ, సామాజికంగా ఎన్నో కట్టుబాట్లు ఉన్న కాలంలో జానకి విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేయాలని సంకల్పించి, అకుంఠిత దీక్షతో అనుకున్నది సాధించారు. వివాహం చేసుకోవడం కంటే ముందుగా స్కాలర్‌షిప్‌తో ఉన్నత చదువులకు వెళ్లాలని ఆమె సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 1925లో మిచిగన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత స్వదేశానికి చేరుకొని కొన్నాళ్లు అధ్యాపకురాలిగా సేవలందించారు. అయితే, పరిశోధనల కోసం ఆమె మళ్లీ అమెరికా వెళ్లారు. 1931లో డాక్టరేట్ సాధించాక త్రివేండ్రంలోని మహారాజా సైన్స్ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరారు. రెండేళ్లపాటు ప్రొఫెసర్‌గా సేవలందించాక పరిశోధనలు చేసేందుకు 1934లో ఉద్యోగాన్ని వదలిపెట్టారు. కోయంబత్తూరులోని చెరకు వంగడాల పరిశోధనా కేంద్రంలో చేరారు. చెరకులో కణజాలం, క్రోమోజోమ్‌లకు సంబంధించి అక్కడే ఆమె విస్తృతంగా పరిశోధనలు చేసి, మరింత తీపి రకాలైన చెరకు వంగడాలను సృష్టించారు. తియ్యదనంలో మాత్రమే కాదు, అధిక దిగుబడి ఇచ్చే చెరకు వంగడాలను సృష్టించడంలో ఆమె అద్భుత విజయాలను సాధించారు. మన దేశంలోని వివిధ ప్రాంతాలకు అనువైన చెరకు వంగడాలను రూపొందించి రైతులకు ఎంతో మేలు చేశారు.
1935లో మన దేశానికి చెందిన ప్రఖ్యాత శాస్తవ్రేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సర్ సీవీ రామన్ ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ సెనె్సస్’ను స్థాపించి, ఆ సంస్థలో పరిశోధకురాలిగా పనిచేయాలని జానకి అమ్మాళ్‌ను ఆహ్వానించారు. అయితే, ఆ సంస్థలో పనిచేసే ఏకైక మహిళా శాస్తవ్రేత్త కావడంతో అమ్మాళ్‌కు లైంగిక వివక్ష, కులవివక్ష వంటివి ప్రతిబంధకాలుగా నిలిచాయి. ఆ పరిస్థితుల్లో ఆమె లండన్‌లోని ‘జాన్ ఇనె్నస్ హార్టికల్చరల్ ఇనిస్టిట్యూట్’లో ‘అసిస్టెంట్ సైటోలొజిస్టిక్’గా చేరారు. లండన్‌లో వృత్తిపరంగా ఆమె అఖండ విజయాలను నమోదు చేశారు. అక్కడి శాస్తవ్రేత్తలు సృష్టించిన కొత్తరకం పూలకు (శాస్ర్తియ నామం- మగ్నోలియా కొబస్) తొలిసారిగా ఆమె పేరు పెట్టారు. లండన్‌లో పనిచేస్తుండగా 1940-1945 ప్రాంతంలో జర్మన్ యుద్ధ విమానాలు తరచూ బాంబులు కురిపించేవి. విమానాల నుంచి బాంబులు పడుతూ భయానక వాతావరణం ఉన్నాసరే జానకి తన సహచరులతో కలసి పరిశోధనలపైనే నిమగ్నమయ్యేవారు. ఆమె తపనను చూసి మిగతా శాస్తవ్రేత్తలు అబ్బురపడేవారు. పరిశోధనలపై ఉన్న ఎనలేని ఆసక్తిని గమనించి వైస్లేలోని ప్రఖ్యాత ‘రాయల్ హార్టికల్చరల్ సొసైటీ’ సైటొలజిస్ట్‌గా సేవలందించాలని ఆమెను ఆహ్వానించింది. అరుదైన వృక్షజాతుల సేకరణలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ‘రాయల్ హార్టికల్చరల్ సొసైటీ’లో చేరాక జానకి ప్రముఖ వృక్షశాస్తవ్రేత్తలను కలుసుకుంటూ పరిశోధనలపై మరింత ముందుకు సాగారు. 1945లో ‘క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ ది కల్టివేటెడ్ ప్లాంట్’ గ్రంథం రూపకల్పనకు ఆమె సహాయపడ్డారు. దేశ విదేశాల్లో వృక్షశాస్తవ్రేత్తలకు కరదీపిక లాంటి ఆ పుస్తకం విద్యార్థులకు పాఠ్య గ్రంథంలా చిరకీర్తిని పొందింది.
1951లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యక్తిగతంగా ఆహ్వానించడంతో జానకి తిరిగి సొంతగడ్డకు చేరుకున్నారు. ‘బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా’లో ప్రత్యేక అధికారి హోదాలో చేరారు. ఆ సంస్థను పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేశారు. సెంట్రల్ బొటానికల్ లేబొరెటరీ (అలహాబాద్)కు డైరెక్టర్‌గా, రీజనల్ రీసెర్చి లేబొరెటరీ (జమ్మూ), బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ (బొంబాయి), సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (బొంబాయి) వంటి ప్రసిద్ధ వైజ్ఞానిక సంస్థలకు గౌరవ శాస్తవ్రేత్తగా బహుముఖ సేవలను అందించారు. చెరకు, వంగ మొక్కలపై చిరస్థాయిగా నిలిచే పరిశోధనలు చేశారు. కేరళలోని వర్షాధార అడవుల నుంచి ఔషధపరంగా, వాణిజ్యపరంగా ఉపయోగపడే విలువైన వృక్షజాతులను ఆమె సేకరించారు. పర్యావరణం, జీవ వైవిధ్యం వంటి విషయాలకూ తన పరిశోధనల్లో ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. వృక్షజాతులు, పర్యావరణం వంటి అంశాలపై దేశ విదేశాల్లో జరిగిన సదస్సులో పాల్గొని యువ శాస్తవ్రేత్తలను ఉత్తేజితులను చేశారు. పరిశోధనా రంగంలో ఎంతటి కీర్తి ప్రతిష్టలను ఆర్జించినా, ఎన్నో పురస్కారాలను అందుకున్నా, వ్యక్తిగత జీవితాన్ని ఆమె ఎంతో సాదాసీదాగా గడిపారు. గాంధీ మార్గం ఎంతో ఉన్నతమైనదని ఆమె ఆచరణలో చూపారు.
వృక్షశాస్త్రంలో అద్భుత ప్రతిభ చూపినందుకు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, లినేయం సొసైటీ (బ్రిటన్), రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ (లండన్), జెనెటిక్ సొసైటీ ఆఫ్ అమెరికా, రాయల్ హార్టికల్చరల్ సొసైటీ (లండన్) వంటి ప్రతిష్టాత్మక సంస్థలు జానకి అమ్మాళ్‌ను గౌరవ ఫెలోషిప్‌లతో సత్కరించాయి. బొటానికల్ సౌసైటీ ఆఫ్ ఇండియాకు కార్యదర్శిగా, గౌరవ అధ్యక్షురాలిగా, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు ఉపాధ్యక్షురాలిగా ఉంటూ ఆ సంస్థల పురోభివృద్ధికి కృషిచేశారు.
1961లో బీర్బల్ సహానీ మెడల్‌ను పొందారు. భారత ప్రభుత్వం 1977లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందజేసింది. భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ జానకి అమ్మాళ్ స్మారకార్థం జాతీయ అవార్డును ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్‌లోని జాన్ ఇనె్నస్ సెంటర్ ఆమె పేరిట పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది. వృక్షశాస్త్రంలో, కణజాల పరిశోధనల్లో అరుదైన ఘనత సాధించిన ఆమె తన 87వ ఏట.. 1984 ఫిబ్రవరి 7న తుదిశ్వాస విడిచారు. భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, ఆమె పరిశోధనలు, సాధించిన విజయాలు చరిత్రలో చిరకీర్తిని ఆర్జించాయి.

-పీఎస్సార్