మెయిన్ ఫీచర్

మహిళలే కుటుంబ పెద్దలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది రీనో అనే గిరిజన తెగ. ఈ తెగలో మహిళలే కుటుంబ పెద్దలు. వీరిది మాతృస్వామ్య వ్యవస్థ.. ఇక్కడి యువతలు తమకంటే చిన్నవయసులో అంటే ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాలు తక్కువ వయసుండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు.. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో నివసించే రీనో ఆదివాసీ తెగకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వారి ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు చాలా విభిన్నం. మామూలు జనాలు రీనోలను ‘బోండాలు’ అని పిలుస్తారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వీరు ఎక్కువగా ఉంటారు. వీరు మాట్లాడే భాష బోండీ.. ఆ తెగలో జనాభా సుమారు పది వేలు. ప్రపంచంలోనే అరుదైన ఆదివాసీ తెగల్లో ఇది ఒకటని ఆంత్రోపాలజిస్టులు చెబుతున్నారు. వీరు తమ దగ్గరున్న కొండ చీపుర్లను, ఇతర వస్తువులను అమ్ముకుని, కావాల్సిన వస్తువులను కొనుక్కుంటారు. వీరి వేషధారణ, ఆచార వ్యవహారాల గురించి తెలుసుకునేందుకు పర్యాటకులు అక్కడి సంతకు వస్తుంటారు. సాధారణంగా గిరిజనులు నీరు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తుంటారు. కానీ రీనోలు కొండ ప్రాంతంలోని శిఖరాగ్ర భాగంలో ఉంటారు. నీటిని కింద నుంచే కొండ పైకి తీసుకెళతారు. గ్రామం చుట్టూ రాళ్లు, కర్రలతో రక్షణ వలయాన్ని నిర్మించుకుంటారు. అక్కడ కొంతమంది పహారా కాస్తరు. కొత్త వ్యక్తులను గ్రామంలోనికి రానివ్వరు. కొత్త వ్యక్తులు ‘దుష్ట శక్తుల’ను వెంట తీసుకొస్తారని వీరి నమ్మకం.
వేషధారణ
ఈ తెగలోని మహిళలు భిన్న వేషధారణను ధరిస్తారు. యుక్త వయస్సు రాగానే మహిళలు గుండు చేయించుకుంటారు. గుండు కనిపించకుండా పూసలదండలను ఆభరణాలుగా అలంకరించుకుంటారు. ఒళ్లంతా పూసల దండలు ధరించి కేవలం నడుము వద్ద మాత్రం ‘రింగ్ డా’ అనే పట్టీని ధరిస్తారు. మెడ చుట్టూ అల్యూమినియం, వెండితో చేసిన రింగులను పెట్టుకుంటారు. చేతుల నిండా లోహపు గాజులను ధరిస్తారు. వనవాస సమయంలో సీత రీనో ప్రజలు నివాసమున్న ప్రాంతంలో ఉండేదని, ఆ సమయంలో రీనో తెగ మహిళలు సీతకు కోపం తెప్పించారట. దాంతో సీత ఆగ్రహంతో ఆ మహిళలు వస్త్రాలు ధరించకుండా ఉండేలా శాపం ఇచ్చిందని స్థానికులు నమ్ముతారు. తరువాత ఆ మహిళలు సీతను ప్రాధేయపడగా, ఆమె తన చీరలోంచి చిన్న వస్త్రాన్ని చించి ఆ మహిళలకు ఇచ్చిందని కూడా చెబుతారు ఆ మహిళలు. అప్పట్నుంచి రీనో తెగ మహిళలు అందరూ గుండు చేయించుకోవడంతో పాటు పూసలతో శరీరాన్ని కప్పుకుంటున్నారని వివరిస్తారు ఈ తెగలోని మహిళలు.
రీనో తెగలో మహిళలే కుటుంబ పెద్దలుగా వ్యవహరిస్తారు. గ్రామ పెద్ద, పూజారి, వైద్యులు పురుషులే అయినా కుటుంబ పెద్దగా మాత్రం మహిళలే ఉంటుంది. కుటుంబ బాధ్యతంతా మహిళే చూసుకుంటుంది. రీనో యువతులు తమకంటే చిన్నవాడైన యువకుడిని పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ పెళ్లికి ముందు శృంగారం గురించి కూడా ఈ తెగలో పట్టింపులు ఉండవు. సాధారణంగా రీనో తెగలో అబ్బాయిలు, అమ్మాయిలు కుటుంబంలో కాకుండా విడివిడిగా డార్మెటరీ వంటి నివాసాల్లో గుంపుగా ఉంటారు. అబ్బాయిలు ఈ డార్మెటరీల వద్ద వాయిద్య పరికరాలు వాయిస్తూ అమ్మాయిల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంటారు. మొదట అబ్బాయే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అమ్మాయికి కూడా ఇష్టమైతే ఆమె మాంసం వండి అబ్బాయికి పంపుతుంది. అబ్బాయి తరపువారు అమ్మాయి కుటుంబానికి కన్యాశుల్కం ఇచ్చే ఆనవాయితీ కూడా ఈ తెగలో ఉంది. నచ్చిన వ్యక్తితో అమ్మాయి ఇష్టపూర్వకంగా జీవిస్తుంది. అయితే ఈ తెగలోని వారు సొంత గ్రామస్థులను మాత్రం పెళ్లి చేసుకోరు. ఒకవేళ జీవిత భాగస్వామి చనిపోతే ఇష్టాన్ని బట్టి మరో పెళ్లి చేసుకుంటారు. ఈ సమాజంలో స్ర్తి, పురుషులు ఇద్దరూ కష్టపడ్డా కుటుంబ బాధ్యతంతా మహిళే చూసుకుంటుంది. ఇప్పుడిప్పుడే ఈ తెగలో కూడా మార్పులు వస్తున్నాయి. మహిళల వస్తధ్రారణ కూడా మారుతోంది. వ్యక్తిగత ఆస్తులను కూడా కూడబెట్టుకుంటున్నారు.
*