మెయిన్ ఫీచర్

యోగ ‘క్షేమం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఆనంద యోగఅంతర్జాతీయ యోగా
దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈశా ఫౌండేషన్ 3ఆనందం2 అనే ఓ ప్రత్యేక 3ఇన్ కాన్వర్సేషన్ విత్ మిస్టిక్2 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జూన్ 23న అంటే ఆదివారం రోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. సరళమైన ఈశ ఉపయోగ సాధనాలు/సెషన్లతో కార్యక్రమం మొదలవుతుంది.
యోగ సెషన్ తరువాత ఇన్నర్ ఇంజనీరింగ్2 యోగం ఆనంద మార్గం అనే
పుస్తకావిష్కరణ జరుగుతుంది. ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత నాని చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. తరువాత మార్మికులు, యోగి, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన సద్గురుతో నాని ముచ్చటిస్తారు.

‘భారతదేశం నా యోగభూమి. భారతీయులందరూ నా సహయోగులు. నా దేశ యోగ సత్త్వసంపద నాకు గర్వకారణం’ అని నినదించేలా ఈ తరం త్వరలోనే తయారవుతుందేమో అనడానికి ఈరోజుల్లో ఎక్కడ చూసినా యోగాసెంటర్లు, యోగా తరగతులు అంటూ విరళంగా వినపిస్తూనే ఉన్నాయి.
ఐదువేల సం॥ రాల నుంచి మనదేశపు విజ్ఞానంలోని ఒక అంతర్భాగం యోగ అన్న మాట నిజం. కానీ చాలామంది ఇదేదో శారీరిక వ్యాయామం అనీ, శరీరాన్ని వివిధ భంగిమల్లో మలిచే ఆసనాలు అనీ ఇంకా ఒక రకం శ్వాసప్రక్రియ అని మాత్రమే అనుకొంటున్నారు. మానవుని అనంత మేధాశక్తి, ఆత్మశక్తిల కలయిక నిజానికి ‘యోగా’. సైంటిఫిక్‌గా యోగా ఒక పరిపూర్ణ జీవన సార పద్ధతి. జ్ఞాన యోగం , భక్తియోగం, రాజ, కర్మ యోగం అన్నమాటలు అనాదిగా మనం వింటున్నవే. రాజయోగ ప్రక్రియలోని యోగాసనాలు ఒక సమతౌల్యాన్ని ఏకత్వాన్ని మనిషిలో తీసుకుస్తాయన్నది గుర్తించిన విషయం.
యోగాలో ప్రాణాయామం ఒక ప్రధాన అంశం. శరీరం, మనసు, రెండూ కూడా ప్రశాంతంగా ఉండటానికి, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఉపకరించేది ఇది. ప్రాణమంటే జీవనశక్తి ఆయామం అంటే దానిని విస్తరించడం, లేక నియంత్రించడం. శ్వాస, ప్రశ్వాసాల్ని నియంత్రించి ఉంచడానికి పతంజలి మహర్షి యోగసూత్రంగా వెల్లడి చేశారు. లోనికి పీల్చుకొనే గాలి శ్వాస, బయటకు వదిలేది ప్రశ్వాస. నిజానికి అవి నిరంతరం మన ప్రమేయం లేకండా సాగుతూనే ఉంటాయి. అయితే మనం ప్రత్యేకించి క్రమబద్ధం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మ ప్రాణాన్ని కూడా అదుపులో ఉంచుకుంటూ నాడీ మండలం, రక్తప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశాలలో సంచరిస్తూ ఉండే ప్రాణాన్ని శక్తివంతమూ, విస్తరళీయమూ చేసుకోవచ్చు. ‘ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయభవేత్’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా అచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అని చెప్పబడింది.
పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువైన ఆసనాలు. అయితే పొట్ట నిండుగా వున్నప్పుడు, సిగరెట్లు, బీడీ, చుట్ట వంటి పొగలు వస్తున్న చోట, మురికిగా వున్నచోట, దుర్వాసనలు వున్నచోట, గాలి విపరీతంగా వీస్తూ వుంటే ఆ గాలిమధ్య ప్రాణాయామం చేయకూడదు. బట్టలు తక్కువగా, వదులుగా ధరించి మైదానంలో, తోటలో, తలుపులు మూయని గదిలో ప్రాణాయామం చేయాలేగానీ ఇంకోలా కాదు. ఒకవేళ నేలమీద కూర్చోలేనివారయితే నడుం, వీపు, వెనె్నముక, మెడలు నిటారుగా వుండేలా కుర్చీమీద కూర్చుని చేయచ్చు. ముక్కురంధ్రాలు పరిశుభ్రంగా వుండాలి. చాలామందికి తెలిసిన సంగతే అయినా ప్రాణాయామం చేసేటప్పుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, మరోసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయాల్సి వుంటుంది. కుడిచేతి బొటనవ్రేలితో కుడి ముక్కు రంధ్రాన్ని, ఎడమ ముక్కు రంధ్రాన్ని కూడా కుడిచేతి ఉంగరం వ్రేలితో మూస్తూ మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస ప్రక్రియలపై కేంద్రీకరించి వేరే ఆలోచనలకు తావు ఇవ్వక చేస్తే ఎంతో ప్రయోజనం వుంటుంది.
నిజానికి యోగా అంటే కలయిక. జీవాత్మను పరమాత్మను కలిపేదే యోగా. శరీరాన్ని, మేధనీ సమన్వయం చేస్తుంది. నిజానికి వ్యాయామానికి, యోగాకీ చాలా తేడా ఉంది. వ్యాయామం అంటే ఎక్సరైసైజ్ అనేది ఒక పరికరంతో లేదా నడకతో ఆయాసం వచ్చేవరకు చేస్తారు. యోగా అలాకాదు. శ్వాసపై నియంత్రణ యోగా- అంటే శరీరాన్ని మనసునీ అదుపుచేయడం కాక అనుసంధానం చేసేది అని చెప్పుకోవాలి.
యోగాకు మూలం మన వేదాలు. భారతదేశమే ప్రపంచానికి యోగాని పరిచయం చేసింది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవి యోగాలోని ఎనిమిది పాదాలు. వీటి సాధన వల్ల మన శరీరంలోని నికోటిన్ ధాతువు అభివృద్ధి చెంది మెదడులోని న్యూరోట్రాన్స్‌మిషన్‌ను క్రమబద్దీకరిస్తుందని శరీరంలో సమతుల్యత కలిగి క్యాన్సర్ వంటి వ్యాదులకు కూడా చెక్ పెట్టవచ్చు నని శాస్తవ్రేత్తలు సైతం గుర్తించారు. ధృవీకరించారు. యోగాని కష్టపడి కాకుండా ఇష్టపడి చేయడం ముఖ్యం. యోగా మన సంస్కృతినుంచి జనించిందేగానీ ఒక మతానికి చెందిందికాదు. శ్వాసకు మతం లేదు. ఆక్సిజన్‌ను హిందువులయినా, మస్లింలు అయినా, క్రైస్తవులయినా ఆక్సిజన్ అనే అంటారు.
ప్రపంచవ్యాప్తంగా యోగాదినోత్సవాన్ని మన భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదన మీదే ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపి జూన్ 21 ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడాన్ని ప్రకటించింది. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 జూన్ 21 న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ లో జరిగింది. 84 దేశాలకు చెందిన ప్రతినిధులు 35 వేల 985 మంది ప్రజలు హాజరయ్యారు. 35 నిముషాల పాటు 21 యోగాసనాలను వేశారు. ఆ ఘటన అన్ని దేశాలు, అందరు ప్రజలు పాల్గొనడంతో రెండు గిన్నీస్ రికార్డులు నమోదు చేసింది. ఈ ఏడాది జూన్ 21 శుక్రవారం ఐదవ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం. 2014 సెప్టెంబరు 27న ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించిన మోదీ యోగా అమూల్యమైన పురాతన భారతీయ సంప్రదాయంగా పేర్కొన్నారు.
శరీరాన్ని, మనస్సును ఒక్కటిగా చేసి ఆలోచనలను, చర్యలను నియంత్రించి వ్యక్తిలో నిగ్రహాన్ని పెంచి, మనిషికి, ప్రకృతికి మధ్య సామరస్యాన్ని యోగా పెంపొందిస్తుందనీ, ఆరోగ్యం, శ్రేయస్సుకు సంపూర్ణ విధానం యోగా అనీ, ఇది ఒక వ్యాయామం కాదు వ్యక్తిలోని అంతర్గత ప్రాణవత్ ఐక్యతాభావాన్ని ఆవిష్కరిస్తుందని మోదీ అంతర్జాతీయ యోగాదినోత్సవ ప్రతిపాదన చేయగా ఐరాస ఆమోదం తెలపడంతో ఇప్పుడిది దేశదేశాలు జరుపుకునే విశ్వమానవాళి సంపూర్ణ అరోగ్య పర్వమైంది. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఈజిప్ట్, చైనా, యూకె, పాకిస్తాన్‌లో యోగా ఇప్పుడు ఊపందుకుంది. 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి జూన్ 21న ప్రతి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారిక ప్రకటన చేసింది. 193 ప్రపంచ దేశాలు అప్పటికప్పుడే తమ మద్దతును ప్రకటించాయి. ఉత్తరార్థగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు జూన్ 21. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని వివిధ ప్రాంతాల్లో ఈరోజుకు గల ప్రాధాన్యతను అనుసరించే అంతర్జాతీయ యోగాదినోత్సవం జరుపుకోబోతున్నాం. సర్వే భవంతు సుఖినః సర్వే శాంతు నిరామయా, సర్వేభద్రాణి పశ్చంతు మాకశ్చిత్ దుఃఖభాగ్బవేత్

- సుధామ.. 98492 97958