మెయిన్ ఫీచర్

పిల్లలపై లైంగిక నేరాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో పిల్లలపై జరిగే లైంగిక నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతివారం అనేకంటే ప్రతిరోజూ ఆ వేధింపులకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రజల్లో అసహనాన్ని పెంచుతూనే ఉంది. ఇటీవల నగరంలో తొమ్మిది నెలల పాప అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. పద్దెనిమిదేళ్లలోపు వయసున్న అమ్మాయిలపై నిజంగానే లైంగిక వేధింపులు పెరుగుతున్నాయా? లేక ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారతదేశంలో వేగంగా విస్తరిస్తోన్న టీవీ, మొబైల్ మీడియా కారణంగా ఈ కేసులు ఎక్కువగా బయటకు వస్తున్నాయి అనే అభిప్రాయం కూడా ఇప్పుడు ఉంది. చట్టపరంగా ‘రేప్’కి సంబంధించిన నిర్వచనం కూడా మారిపోయింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రతి కేసునూ పోలీసులు తప్పనిసరిగా నమోదు చేయాలన్న నిబంధన కూడా అమల్లోకి వచ్చింది. కశ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య నేపథ్యంలో లైంగిక వేధింపులపై చర్చ తరువాత ఇది మరింత విస్తృతమైంది. అయితే ఇటీవలే దోషులకు కోర్టు శిక్షను విధించింది. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పనె్నండేళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైతే మరణశిక్ష విధించేలా చట్టంలో ప్రభుత్వం మార్పులను చేసిన విషయం అందిరికీ తెలిసిందే.. అదే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సస్. ఆడపిల్లలతో పాటు మగపిల్లలపై జరిగే నేరాలను కూడా ఈ చట్టం ఒకేలా పరిగణిస్తుంది. పిల్లలపై జరిగే లైంగిక నేరాలపై ఫిర్యాదు చేయకపోవడంతో పాటు వాటిని నమోదు చేయకపోవడం కూడా చట్టప్రకారం నేరమే.. దానికి జైలుశిక్షతో పాటు అపరాధ రుసుము కూడా విధిస్తారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే నమోదైన పిల్లల అత్యాచార కేసుల సంఖ్య నలభై ఐదు శాతం పెరిగింది. ఈ చట్టం వల్ల వైద్యులకు, పోలీసులకు ‘కుటుంబ సమస్య’గా పేర్కొంటూ ఫిర్యాదుదారులను వెనక్కు పంపే అవకాశం లేదు. అలాచేస్తే వాళ్లు జైలుకెళ్లే అవకాశం ఉంది. ఫిర్యాదులను రిజిస్టర్ చేయడం తప్పనిసరి కావడంతో నమోదయ్యే వేధింపుల కేసులూ పెరిగిపోయాయి.
2012లో దిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతంతో భారతదేశంలో లైంగిక నేరాలు అంతర్జాతీయంగా చర్చల్లోకి వచ్చాయి. ఈ కేసుల్లో పోలీసుల విచారణ తీరుపై కూడా దృష్టి పడింది. ఆ పైన మహిళలపై లైంగిక నేరాల నిర్వచనాన్ని మరింత విస్తృతపరుస్తూ చట్టంలో మార్పుచేసింది ప్రభుత్వం. ఆ ప్రభావం మరుసటి ఏడాది స్పష్టంగా కనిపించింది. 2013లో నమోదైన రేప్ కేసుల సంఖ్య 35 శాతం పెరిగింది. అందరూ ఊహించే దానికంటే ఎక్కువగానే పిల్లలపై లైంగిక వేధింపులు జరుగతున్నాయని చాలామంది భావన. ఈ విషయంపై 2007లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక అధ్యయనం నిర్వహించింది. అందులో భాగంగా 13 రాష్ట్రాలకు చెందిన పదిహేడు వేలమంది పిల్లలను విచారించగా, వాళ్లలో సగానికి పైగా పిల్లలు తాము వివిధ రకాల లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని గమనిస్తే పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలు దేశంలో పూర్తిస్థాయిలో వెలుగులోకి రావట్లేదు అనే విషయం అర్థమవుతుంది.
లోపాలు
బలమైన చట్టం ఉండటంతో పాటు నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతున్నా, శిక్షపడే వారి సంఖ్య మాత్రం 2012 నుంచి 28.2 శాతానికి మించట్లేదు. పిల్లలపై జరిగే లైంగిక నేరాల విషయంలో ఏడాదిలోగా విచారణ పూర్తికావాలని ఆ చట్టం చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. నేరాలకు పాల్పడుతున్న వారిలో బాధితులకు తెలిసినవారే ఎక్కువగా ఉంటుండటంతో కేసులను వెనక్కు తీసుకోమనే ఒత్తిళ్లు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. కొందరు కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే భావనతో కూడా ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు. ఫిర్యాదు చేసినా కూడా నిందితులపై విచారణ సజావుగా సాగదు. ఇక్కడి వ్యవస్థ ఫిర్యాదుదారుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకే ఇలాంటి కేసులు పెట్టడానికి ఫిర్యాదుదారులు భయపడుతున్నారు. *