మెయిన్ ఫీచర్

ఇస్లామిక్ యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ‘యోగ’ను హిందూమత ఆధ్యాత్మిక వ్యాయామంగానే చూస్తారు. యోగా సాధన చేయడం ముస్లింల సంప్రదాయంలో లేదు. కానీ గుజరాత్ ముస్లిం మహిళలు మాత్రం ఆ భావనను మార్చాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ముస్లిం మహిళలు ఇప్పుడు యోగా చేస్తున్నారు. అంతేకాదు.. యోగాను తమదైన శైలిలో చేస్తూ అందరి చేతా శెభాష్ అనిపించుకుంటున్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను, ఫలితాలను ఈ మహిళలు స్వయంగా, యోగా చేస్తూ తెలుసుకున్నారు. యోగా చేస్తున్న ఈ మహిళలు గుజరాత్‌లోని 3అలావి బోహ్రా2 అనే ముస్లిం తెగకు చెందినవారు. ఇది ఇస్లాంలోని ఒక ఉపతెగ. వీరి సంప్రదాయం ప్రకారం మహిళలంతా ఇళ్లకే పరిమితమవుతారు. యోగా చేయడం మొదలుపెట్టింది మాత్రం ఈ తెగలోని పురుషులే..
గతంలో ఇక్కడికి యోగాకు వచ్చే మహిళలు తరచూ భుజాల నొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు రుతుక్రమం సరిగ్గా లేక ఇబ్బంది పడేవారట. యోగాను రోజూ చేయడం వల్ల నొప్పులనుంచి ఉపశమనం కలిగిందట. రుతుక్రమ సమస్యలు కూడా తొలగిపోయాయని చెబుతున్నారు ఇక్కడి మహిళలు. ఇక్కడ యోగా ముద్రలతో, అల్లాను స్తుతించే 99 పవిత్ర నామాలను మిళితం చేసి నేర్పిస్తున్నారు. ఇలా అల్లా పవిత్ర నామాలను స్తుతించడం వల్ల వీరి మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని చెబుతున్నారు ఇక్కడ యోగా చేసే మహిళలు. మన అనుభవించే ఆరోగ్య సమస్యలకు మన జీవనశైలే కారణం. ఇస్లామిక్ యోగాను సాధన చేయడమే ఇందుకు సరైన పరిష్కారం అని చెబుతున్నారు మహిళలు. ఇక్కడికి వచ్చినప్పుడు వీరు కోరుకున్నది ఒక ఆధ్యాత్మిక ఆసరా.. మాత్రమే.. మనుషుల విన్యాసాలు వారి హృదయంతో ముడిపడి ఉంటాయి. ఆ విశ్వాసాలను కొనసాగిస్తే వారి నమ్మకాలకు మించి ఎన్నో అంశాలు వారికి సత్ఫలితాలను ఇస్తాయి. ప్రవక్త చెప్పినట్టుగా పవిత్రమైన దానిని స్వీకరించు.. అపవిత్రమైన విషయాన్ని తిరస్కరించు.. ఈ పరిణామాలతో యోగ చేయడానికి తమకు అనుమతి లభించినట్లేనని ఈ మహిళలు భావించారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వారు స్వయంగా అనుభవిస్తున్నారు. యోగా అంటే 3ఐక్యం చేయడం2 అనే అర్థం కూడా వస్తుంది. ఈ ముస్లిం మహిళల విషయంలో వారి ఆరోగ్యం, ఆధ్యాత్మికతకూ మధ్య ఐక్యత కుదిరింది అని వీరు తెగ సంతోషపడిపోతున్నారు. *