మెయిన్ ఫీచర్

జ్ఞానాన్ని పంచుతూ.. పెంచుతోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి..
వెనకవచ్చు వాళ్లకు బాట అయినదీ.. అని ఓ సినీ కవి చెప్పినట్లుగా..
ఒక దృశ్యం ఆమె మనసును కదిలించింది. ఆలోచనలను రేకెత్తించింది.. ఆచరణకు పురిగొల్పింది.. ఆమె ఒక్కతే.. అడుగు ముందుకేసింది.. అనేకమంది అనుసరించారు.. ఇప్పుడు అదొక ఉద్యమమైంది. వేల మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. తరువాతే నడకైనా, పరుగైనా.. అచ్చంగా ఇలాగే జరిగింది ఉత్తర ప్రదేశ్‌లో.. వివరాల్లోకి వెళితే..
అది ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలోని బేగంపూర్ ప్రభుత్వ పాఠశాల. అక్కడి సదుపాయాలను, అక్కడి పిల్లల స్థాయిని పరిశీలించేందుకు విధి నిర్వహణలో భాగంగా ఆ జిల్లా మేజిస్ట్రేట్/కలెక్టర్ మాలా శ్రీవాస్తవ వెళ్లింది. ఒక తరగతిలోకి వెళ్లి అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించింది. వారితో మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ఆమె కూడా టీచర్‌గా మారిపోయింది. వెంటనే చాక్‌పీస్, డస్టర్ చేతిలోకి తీసుకుంది. కాసేపు పిల్లలందరికీ పాఠం చెప్పి వెళ్లిపోయింది. దాదాపుగా ప్రతి పాఠశాలకు ఎప్పుడో ఒకప్పుడు.. ఎవరో ఒక అధికారి తనిఖీకి రావడం, పిల్లలతో సంభాషించడం, పాఠం చెప్పడం, వెళ్లిపోవడం.. వంటివన్నీ మామూలు విషయాలే.. ఈ దృశ్యాలు దాదాపుగా అందరూ చూసే ఉంటారు. తరువాత ఆ పిల్లల గురించి గానీ, ఆ పాఠశాల గురించి గానీ ఎవరికీ పట్టదు. ఈవిడ కూడా ఇప్పటివరకూ అనేక పాఠశాలలను తనిఖీ చేసుండచ్చు. చూసిన ప్రతిచోటా పాఠాలు కూడా చెప్పి ఉండవచ్చు.. కానీ ఆ పాఠశాలలోని పిల్లలు మాత్రం ఆమెను ఆకట్టుకున్నారు. వారిలోని చురుకుదనానికి, చలాకీతనానికి, తెలివితేటలకు ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె అక్కడినుంచి వెళ్లినా.. పదేపదే.. ఆ పిల్లలు ఆమె మదిలో మెదులుతూండటంతో.. ఆమెలో ఒక ఆశ మొదలైంది. కాస్తంత మట్టిని తీసుకుని, కొంచెం నీళ్లతో కలిపి, చిన్న ముద్దగా చేసి అద్భుతమైన శిల్పంగా మలచవచ్చు. అందమైన ఆకృతిలా తీర్చిదిద్దవచ్చు. అలాగే ఈ బడిపిల్లలు అన్నింటా చురుగ్గా ఉన్నారు. వీరికి సరైన విద్యను అందించినట్లయితే.., చక్కటి మార్గం చూపించినట్లయితే వీరి భవిష్యత్తు బంగారమయమవుతుందని అనుకుంది. లేకపోతే వారంతా అలాగే ఉండిపోతారు. అనే ఆలోచనలు ఆమెను స్థిరంగా ఉండనివ్వలేదు. చాలా రోజులు ఆలోచించిన తర్వాత ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది.
ఒక మంచి పని జరగాలంటే, ఒక చక్కని మార్పు రావాలంటే, ఒక ఉద్యమం ఉద్భవించాలంటే.. ఎవరో ఒకరు, ఎప్పుడో అప్పుడు ముందడుగు వేయాల్సిందే.. ఆ ముందడుగు తనదే కావాలనుకుంది. అంతే.. మరుసటి రోజు తీరిక చూసుకుని మరోసారి ఆ పాఠశాలకు వెళ్లింది. ఆ పిల్లలను ఆకట్టుకునేలా పాఠం చెప్పింది. పాఠంతో పాటే నాలుగు మంచి మాటలూ చెప్పింది. అంతేకాదు.. ఆ పిల్లలతో కలిసి అక్కడే.. వారితో పాటు కింద కూర్చుని మధ్యాహ్న భోజనం చేసింది. అప్పటివరకూ ఆ పాఠశాల ఉపాధ్యాయులు కూడా అక్కడి పిల్లలతో కలిసి ఇలా భోజనం చేసి ఉండకపోవచ్చు. మాలా శ్రీవాస్తవతో పిల్లలు ఇట్టే కలిసిపోయాలి. వారు మంచి స్నేహితులయ్యారు. అక్కడి ఆమె వెళుతున్నప్పుడు ఒకరిద్దరు పిల్లలు చొరవతో ముందుకు వచ్చి ‘టీచర్.. మళ్లీ ఎప్పుడు వస్తారు?’ అని అడిగారు. అందుకు ఆమె సమాధానం చెబుతూ.. ‘వారానికి ఒక్కరోజైనా వస్తాను.. మీకు పాఠాలు చెబుతాను.. ఇంకా బోలెడు కబుర్లు చెబుతాను.. సరేనా..’ అంటూ వారికి వీడ్కోలు చెప్పి వెళ్లిపోయింది. అప్పుడు పిల్లల కళ్లలో కనిపించిన మెరుపు, వారి మొహాల్లోని వెలుగు.. ఆమె మనోఫలకంపై ముద్రితమైంది. అదే ఆమె లక్ష్యమైంది కూడా.. ఆ పిల్లల్లాగే ఇంకా ఎంతోమంది పిల్లల్లో అలాంటి మెరుపును చూడాలని, అందుకోసం తనలాంటి ఎంతో మంది టీచర్లు కావాలని ఆమె అనుకుంది. అలా ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ‘విద్యాదాన్.. ఏక్ ఆదర్శ్ దాన్’ పథకం. మన చుట్టూ సమాజంలో ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు. వారి వద్ద ఆస్తిపాస్తులు లేకపోవచ్చు. అంతకన్నా విలువైన విద్య, జ్ఞానం ఉంది. జ్ఞానసంపదకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అదేంటంటే.. ఉంచుకుంటే తగ్గుతుంది.. పంచుకుంటే పెరుగుతుంది. అందుకే ఆ జ్ఞానసంపదను ఎవరికివారు తమలోనే ఉంచుకోకూడదు, దాచుకోకూడదు. పంచుకోవాలి, పెంచుకోవాలి. ఇదే మాలా శ్రీవాస్తవ చేస్తున్నది. తనలాగా ఇంకెంతోమంది చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆమె ఆశించింది. తన ఆలోచనను, ఆశను, ఆశయాన్ని బయటపెట్టింది. ‘విద్యాదాన్.. ఏక్ ఆదర్శ్ దాన్’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు, అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నట్లు ఒకరోజు ప్రకటించేసింది కూడా..
‘్భవిష్యత్తు తరం బాగుండేందుకు మనమంతా కదులుదాం.. పునాదులు నిర్మిద్దాం.. వారంలో ఒక గంట పాటు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పాఠ్యాంశాలు కానీ, ఇతర మంచి విషయాలు కానీ.. ఏవైనా సరే.. ఆ పిల్లలకు ఉపయోగపడేవి, వారిని చైతన్యవంతం చేసేవి చెప్పాలి. వారితో స్నేహం చేయాలి. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. ఇలా కొత్తవాళ్లొచ్చి కొత్త కొత్త విషయాలు చెబుతుంటే.. వారికి ఎంతో ఉత్సాహంగా
ఉంటుంది. నేర్చుకోవడంపై, తెలుసుకోవడంపై ఆసక్తి చూపుతారు’ అని అందరినీ కోరింది. అలాగే తాను బేగంపూర్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడి పిల్లలకు పాఠ్యాంశాలు బోధిస్తున్నట్లు వివరించింది. ఆ పిల్లల్లో తాను గమనించిన మార్పును, ఉత్సుకతను కూడా అందరికీ వివరించింది. తనలాగానే అందరూ ముందుకు రావాలని, అందరం కలిసి మంచి మార్పు తీసుకువచ్చి భవిష్యత్తు తరాన్ని ముందుకు నడిపించాలని అర్థించింది. ప్రతి ఒక్క డెవలప్‌మెంట్ బ్లాక్‌లో కనీసంగా పది ఆదర్శ విద్యాలయాలను తయారుచేద్దాం.. అకడమిక్‌గా మంచి ఫలితాలు సాధించేందుకు, పిల్లల్లో సామాజికాంశాలపై అవగాహన పెంచేందుకు, సృజనాత్మక వెలికితీసేందుకు, మానవతా విలువలు నేర్పించేందుకు ప్రయత్నిద్దాం అని పిలునిచ్చింది. అలా ఆమె తొలి అడుగును వేసింది.
ఒకొక్కరుగా ముందుకొచ్చారు. విద్యాదానం మొదలైంది. ఆ నోటా, ఈ నోటా ఈ విధానం విస్తృతమైంది. ఒకరితో మొదలైన ఈ ప్రయత్నం.. పదుల నుంచి వందల్లోకి వెళ్లింది. ఉద్యమంగా మారింది.. మహోద్యమంగా సాగుతోంది..
2017 సెప్టెంబర్‌లో మొదలైన ఈ విద్యాదాన్ పథకంలో స్వచ్ఛందంగా పనిచేస్తామంటూ ఇప్పటివరకూ 700 మంది పౌరులు ముందుకొచ్చారు. వారంతా వారంలో కనీసంగా గంటపాటు ఏదో ఒక పాఠశాలకు వెళుతున్నారు. తమ జ్ఞాన సంపదను పంచుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను, కొంగొత్తగా చెప్పేందుకు తపన పడుతున్నారు. పిల్లలతో గడపడం, వారికి బోధించడం తమకెంతో సంతోషాన్ని, శక్తిని ఇస్తోందని అనేకమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువకాలంలోనే సానుకూల స్పందన వచ్చేసింది. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా, కలెక్టర్‌గా ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ వారం వారం పాఠశాలకు వెళ్లడం, అక్కడి పిల్లతో గడపడం మాత్రం శ్రీ వాస్తవ మానడం లేదు. ఆ పిల్లలు కూడా అంతే.. ఆమె ఎప్పడు వస్తారో అని ఎదురుచూస్తుంటారు. ప్రాథమిక విద్య బలోపేతానికి మాలా శ్రీవాస్తవ చేస్తున్న కృషి ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఒకసారి జిల్లా సమీక్ష సమావేశానికి ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖా మంత్రి అనుపమా జైస్వాల్ వచ్చారు. విద్యాదాన్ పథకం పుట్టుక- పురోగతి, దానిని ప్రవేశ పెట్టిన శ్రీవాస్తవ గురించి తెలుసుకున్నరు. ఆమెను అభినందించారు. మాలా శ్రీవాస్తవ కృషిని ‘నీతి అయోగ్’ గుర్తించింది. ఆమె చొరవను, కృషిని అభినందించింది. విద్యాదాన్ పథకం కింద బహ్రెయిన్ జిల్లాలో దాదాపు 200కు పైగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి అయ్యాయి. మాలా శ్రీవాస్తవ వంటివారు మనందరికీ ఆదర్శం కావాలి. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ఇలాచేస్తే భవిష్యత్తు తరానికి బంగారు బాటలు పడినట్లే.. ఇకనైనా ఆలోచించి.. ఆచరిద్దామా మరి!

-మహి