మెయిన్ ఫీచర్

బాల్యాన్ని బతకనిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దులొలికే చిన్నారి.. అప్పటివరకూ ఆనందంగా ఆడుకుంది.. ఆ తర్వాత అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రించింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన రాక్షసుడు ఆ పసికూనపై కనే్నశాడు. తల్లి పొత్తిళ్లనుంచి వేరుచేసి చిదిమేశాడు. ఆ తల్లికి శాశ్వతంగా కడుపుకోత మిగిల్చాడు. సభ్య సమాజం తలదించుకునేలా హన్మకొండలో జరిగిన ఘటనతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇంత దారుణం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. అత్యాచారాలకు అంతం లేదా?
ఇటీవల మీడియాలో పరిశీలిస్తే చెన్నైలో పదకొండేళ్ల దివ్యాంగురాలిపై కామాంధుల చేతిలో చిత్రవధలకు గురైన సంఘటన, మనుషుల మధ్య వుంటున్న 22 మంది రాక్షసులు పశువులలాగా అభం శుభం తెలియని ఒక దివ్యాంగురాలిపై అత్యాచారం. ఛీ ఛీ ఈ పాడు సమాజంలో ఎందుకు పుట్టాను అని రోదిస్తున్న ఆ చిన్నారి బాల్యాన్ని తిరిగి ఇచ్చేదెవరూ.. ఉత్తరాఖండ్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అశ్లీల వీడియోలకు బానిసలుగా మారిన మైనర్లు అత్యాచారం.. సభ్యసమాజం తలదించుకొనే పరిస్థితి దాపురించింది. చిన్నారులపై లైంగిక దాడుల సంఘటనలు, పిల్లల శరీర భాగాలతో వికృతచేష్టలతో సమాజంలో చీడపురుగుల సంఘటనలు కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి. సమాజం ఎటు వెళ్తుందో అర్థంకాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక యువకుడు ఆరు సంవత్సరాల చిన్నారిని చాక్లెట్ ఇస్తానని చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి క్రూరంగా చిత్రహింసలకు గురిచేసి అత్యాచారం జరిపి హత్యచేసిన సంఘటన, వావి వరుసలు మరిచి చిన్ని హృదయాలను చిదిమేస్తున్నారు. తమ కామవాంఛ చిన్నారులపై వికృత స్థాయిలో విజృంభిస్తూన్న మానవ మృగాలను ఏం చేయాలి? రోజురోజుకూ ఒక్కొక్క విచిత్రమైన కథనాలు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు మారుతుంది ఈ సమాజం?
మనిషి జీవితంలో బాల్యం అనేది వెలకట్టలేని ఒక విలువైన దశ. పిల్లలు పెద్దవారికంటే సులువుగా మోసానికి, దాడికి, దోపిడీకి, వేధింపులకు గురవుతున్నారు. పిల్లలను జాతీయ సంపదగా పరిగణించాలి. బాలలు కూడా మనుషులే. మానవ హక్కులన్నీ వారికీ వర్తిస్తాయి. ప్రతి బిడ్డ గౌరవంగా, సామరస్య వాతావరణంలో పెరగాలి. పిల్లల రక్షణ బాధ్యత మనందరిదిగా గుర్తించాలి.
ప్రస్తుత తరుణంలో మనిషి కాలంతో పోటీపడుతూ సాంకేతికంగా అభివృద్ధిలో దూసుకువెళ్తూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నా కొన్ని మానవ కామపిశాచాలవల్ల దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. తమ కామవాంఛ తీర్చుకోవడానికి మహిళలపై వికృత స్థాయిలో విజృంభిస్తున్న మానవ మృగాలను ఏం చేయాలి?
దేశంలో బలమైన చట్టాలు వున్నప్పటికీ మానవ మృగాలు చిగురుటాకులను చిదిమేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. మధుర, నిర్భయ, అసిఫాలపై జరిగిన లైంగిక దాడులు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా కఠినంగా వ్యవహరించాల్సిందే. లైంగిక దాడులను ప్రోత్సహిస్తున్న వారిపై, పాల్పడినవారిపై కఠిన శిక్షలు అమలుపరచాలి.
లైంగిక దాడులకు గురైన బాలలు పెరిగి పెద్దఅయిన తర్వాత వారి మనస్తత్వం, మానసిక ప్రవర్తనలో చాలా మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. వారు సమాజంపై ఏహ్యభావం పెంచుకొని భవిష్యత్తులో ఉన్మాదులుగా, శాడిస్టులుగా, తీవ్రవాదులుగా మారే ప్రమాదం ఉంది. ఇది ఇలా కొనసాగితే దేశ మనుగడే ముప్పు.
ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడానికి చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాలి. పోక్సో చట్టం అమలులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసేందుకు ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఒక విప్లవంగా చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కామ పిశాచాల మనస్తత్వంపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వుంది. గ్రామ గ్రామాన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. సామాజిక చైతన్యానికి అందరం చేయి చేయి కలుపుదాం. చిన్నారులపై, మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలను, నేరాలను తరిమికొడదాం.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321