మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వందిమాగదులు నలుని గొప్పదనాన్ని ఎలుగెత్తి పలుకటానికి లేచి నుంచున్నారు.
భీమరాజు మొగాన ఆత్రుత కనపడుచున్నది.
సభాస్థలిలో పైభాగాన ఉన్న రాణీ, ఆమె దాసీజనం ముందున్న మేలి తెరను కొద్దిగా తొలిగించి తదేక దృష్టితో చూస్తున్నారు.
రంగురంగు వస్త్రాలంకరణలతో చేత ఆయుధాలు ధరించియున్న రాజభటులు అప్రమత్తులై నిలబడి చూస్తున్నారు.
వివాహబంధాన్ని మంత్రాలతో సుఖాంతం చేయడానికి రాజపురోహితులు, వేదపండితులు, బ్రాహ్మణులు, అక్షితలు, పూలు చేబూని నిలబడ్డారు.
వెంటనే దమయంతి పుణ్యశ్లోకుడైన ‘‘నలమహరాజును’’వరించింది. భూలోకంలోని రాజ సమూహం చూస్తుండగా దమయంతి నలుని కంఠంలో సితపుష్పమాలను వేసింది.
దమయంతి నలుని పతిగా వరించగా హాహాకారాలు మిన్నుముట్టాయి.
దేవతల ప్రశంస జల్లులు కురిసాయి.
స్వయంవరానికి వచ్చిన మహర్షుల సాధు! నాధు! అనే శబ్దాలు వినిపించాయి. భేరీ మృదంగాలు మ్రోగాయి. మంగళ వాక్యాలు వెలువడ్డాయి.
పురోహితులు, బ్రాహ్మణులు, వేదపండితులు మంత్రాలతో శుభాశీస్సులు ఇచ్చారు. వందిమాగదులు నలుని వంశక్రమాన్ని గానం చేశారు. అతని గొప్పదనాన్ని చాటారు. సభాస్థలి అంతటా సుగంధాలను వెదజల్లారు.
పన్నీరు, సువాసనగల ద్రవ్యాలను చిలికారు.
పూల వర్షాన్ని కురిపించారు.
నలదమయంతుల వివాహం మహా వైభవోపేతంగా జరిగింది.
తన మెడలో పుష్పమాలను వేసి తనను వరించిన దమయంతిని చూచి నలుడు
‘‘దమయంతీ! నా ఈ దేహంలో ప్రాణాలు ఉన్నంతవరకు నీ పై ప్రేమతోనే ఉంటానన్న నిజాన్ని నీకు తెలియజేస్తున్నాను.’’ అని అన్నాడు.
తదుపరి నూతన వధూవరులైన నలదమయంతులు అగ్నిహోత్రునితో పాటు దేవతల శరణు పొందారు. మహాత్ములైన లోకపాలురు సంతోషాన్వాంతులై నలమహారాజుకు ఎనిమిది వరాలను ప్రసాదించారు.
ఇంద్రుడు తాను స్వయంగా ప్రత్యక్షమై నలుడు చేసే యజ్ఞాలలో పాల్గొంటానని వరాన్ని ప్రసాదించాడు. నలుడు కోరిన చోటులలో తానుండేటట్లు గూడా వరాన్నిచ్చాడు. తన కాంతి గల లోకాలను నలునికి ప్రసాదించాడు.
వరుణుడు నలుడు కోరిన చోట జల సమృద్ధిని, పరిమళముగల దండలను అనుగ్రహించాడు.
యమధర్మరాజు నలుని మనస్సు ఎల్లప్పుడూ ధర్మంపైనే లగ్నమయ్యేటట్లు వరాన్ని ప్రసాదించాడు.
దేవతలు నలునికి అనేక వరాలను ప్రసాదించి సంతోషంతో తమ తమ నగరాలకు తిరుగు ప్రయాణాన్ని సాగించారు.
ఆరోజు రాత్రి నల దమయంతులు ఒకటయ్యారు. ఏకాంతంలో నున్న నలుడు దమయంతితో
‘‘ఓ పద్మముఖీ! దమయంతీ! హంస ద్యూతం ఫలించి నేను నిన్ను పొందగలిగాను.
సమస్త దేవతల సాక్షిగా అన్ని కష్టాలలో నిన్ను వీడి ఉండవనీ, జీవితాంతం నీ కొరకు ధర్మాన్ని అతిక్రమించకుండా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. అతిలోక సుందరివైన నిన్ను పొందటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. జన్మనిచ్చిన ఆ సృష్టికర్తకు సదా కృతజ్ఞుడను!’’ అని అనగా
‘‘నల మహారాజా! నా పూర్వజన్మ పుణ్యఫలం వలన నిన్ను భర్తగా పొందగలిగాను. లోకం మెచ్చే నిన్ను పొందటం ఈ భూమిపై మరే స్ర్తి పొందనటువంటి అదృష్టాన్ని పొందగలిగాను. మనసావాచా జీవితాంతం నీ సేవలోనే తరిస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా నినే్న సేవిస్తుంటాను.
- ఇంకా ఉంది