మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైగా ఆ నల మహారాజు సకల వేద ధర్మాలను క్షుణ్ణంగా తెలిసినవాడు. సదా ధర్మమార్గంలో నడుచుకొనడమే అతని వ్రతం. నాలుగు వేదాలను అతడు అధ్యయనం చేశాడు కలీ! అంతేగాదు నలుని గృహంలో జరిగే యజ్ఞాల్లో దేవతలు నిత్యతృప్తులై ఉంటారు. అహింసా నిరతుడైన నలుడు సత్యసంధుడు. సత్యానే్న పలుకుతాడు. ధృడచిత్తుడు. దృఢ వ్రతుడు.
సమర్థత, ధైర్యము, జ్ఞానము, శౌచము, దండోపాయము, శాంత స్వభావము లోకపాలురతో సమానంగా నల మహారాజులో ఉన్నాయి. అట్టి మహారాజును ఎవరైనా శపించాలనుకొంటారా? అతిలోక సౌందర్యవతి అయిన దమయంతిని శిక్షించాలనుకొంటారా? అలా ఆలోచించేవాడు తన్నుతాను వంచించుకొని చంపుకొనే మూర్ఖుడే అవుతాడు. మంచి గుణాలు కల్గిన నలుని శపించడానికి సిద్ధపడిన వానిని, అతి క్లిష్టమైన నరకంలో, లోతైన నదిలో ముంచుతారు. కలీ అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకొనకు! నీ పతనాన్ని నీవే ఆశించకు!’’ అని దేవతలు కలిని హెచ్చరించి వెళ్ళిపోయారు. తదుపరి కలి ద్వాపరుని చూచి
‘‘ద్వాపరా! నలుని మీద కోపం చంపుకోలేక పోతున్నాను. నేను నలునిలో నివసిస్తాను. ఆవేశిస్తాను. ఆ నలుని రాజ్యభ్రష్టునిగా చేసి, సుందరాంగి అని గర్వించే ఆ దమయంతితో సుఖపడకుండా చేస్తాను.’’
నీవు గూడా నా మాట ప్రకారం పాచికలను ఆవహించి నాకు సహాయపడాలి’’ అని కోరాడు.
నేటి సమాజంలో దినదినం మనం ఎన్నో ఘోరకృత్యాలను చూస్తున్నాము. ప్రేమించలేదని ఒకడు కక్షగట్టి ప్రేమించని స్ర్తిపై మారణ ద్రావకాలను పోస్తున్నాడు. కొందరు కక్షతో నడి వీధులలో అందరూ చూస్తుండగానే ప్రేమించని వనితను అతి దారుణంగా నరికి చంపుతున్నారు. కొందరు ప్రేమించని స్ర్తిని పట్టుకొని పది మందితో కలిసి అత్యాచారాలు చేస్తున్నారు. మరి కొందరు, తల్లిదండ్రులైతే నేమి, అన్నదమ్ములైతేనేమి, పరువు ముసుగులో ప్రేమ జంటను చంపుతున్నారు. తనను వరించలేదని క్రోధంతో మరీ దారుణాలకు ఒడిగట్టుతున్నారు. ఇలాంటివి మనం ప్రతిదినం చూస్తున్నాం. వింటున్నాం. ఇలాంటి వారంతా కలి అనుచరులో లేక కలి ప్రభావులో మరి.
ఈ నలదమయంతుల వృత్తాంతం మనకు ‘కలి ప్రభావం’ గురించి తెలియపరుస్తున్నది. కలి లాంటి వారు నేటి సమాజంలో వేలకు వేలు సంచరిస్తున్నారు. పుట్టుకొస్తున్నారు. ఈ దుశ్చర్యలే ‘కలి’ అంటే. కలి ఎక్కడో లేడు. ఈలాంటి నీచ కృత్యాలకు పాల్పడే వారే ‘కలితో’ సమానులు... రాజకీయ నాయకులు, వారి సుపుత్రులు, పత్రికా ప్రముఖులు, మంత్రులు, అరాచక శక్తులు, ఎవరూ ఇలాంటి చర్యలకు అతీతులు కారు.
నల దమయంతులకు పరస్పర వియోగాన్ని కల్పించటానికి కలిపురుషుడు నిశ్చయించాడు. నల మహారాజు ద్యూత ప్రియుడని ‘కలికి’ తెలిసింది. అందుచేత పాచికలతో ప్రవేశించమని కలి పురుషుడు తన సహచరుడైన ద్వాపరుడిని నియోగించాడు. తాన నలుడిలో ప్రవేశింప సంకల్పించాడు.
ద్వాపరునితో కలి ఒప్పందము చేసుకొని నిషధ మహారాజు నగరానికి వెళ్లాడు. ఆ నిషధ నగరంలో చాలాకాలం ఉన్నాడు. అవకాశంకోసం వేచి ఉన్నాడు. అలా పండ్రెండు సంవత్సరాలు నివసించాడు.
నలుడు అనవరతం అశ్వమేధాది యజ్ఞయాగాదులు నిర్వర్తించి బ్రాహ్మణులకు అపార దక్షిణలు పంచిపెట్టుతూ ఉండేవాడు. జపం, తపం, హోమం, దానధర్మ పుణ్యకార్యాలు నలుని దినచర్యలయ్యాయి.
పండ్రెండవ సంవత్సరంలో కలికి అవకాశం లభించింది. ఒకనాడు నలుడు మూత్రవిసర్జన చేసిన అనంతరం పాదప్రక్షాళనం (కాళ్ళు కడుక్కోకుండా) మరచిపోయి సంధ్యావందనం ఆచరించాడు.
- ఇంకాఉంది