మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు ఆ అశౌచాన్ని ఆధారంగా చేసికొని కలిపురుషుడు పాదంనుండి నలమహారాజులో ప్రవేశించాడు. నలుని ఆవేశించాడు.
భూలోకంలో మానవజాతి సమస్తాన్ని పీడించే సర్వపాపాలకూ పర్యాయపదం ‘కలి’. కలి ప్రభావం అన్నిరకాల సద్గుణాలలో అతి నీచాతి నీచంగా ఎన్నదగింది ‘‘అసూయ’’. కలి మూర్త్భీవించిన మాత్సర్యం మరో నలదమయంతులు. ఆదర్శదంపతులు. నలుడు పుణ్యమూర్తి. కలిపురుషుడు నలునికి దవ్వులలో నిలువ వలసినవాడు. అటువంటి నల మహారాజును సమీపించటానికి ‘అశౌచం’ కలికి అవకాశం కల్పించింది. మూత్ర విసర్జనానంతరం పాదప్రక్షాళన విస్మరించిన పరమ పుణ్యమూర్తి అయిన నలునిలో ‘కలి’అశౌచం వలన ప్రవేశించగలిగాడు.
‘‘అశౌచం కలిపురుషుడికి ప్రవేశ ద్వారము’’అనే నీతి ఈ నలోపాఖ్యానంలో అంతర్గర్భితం. విశ్వసాహితీ ప్రపంచంలో ‘నలోపాఖ్యానం’వలె శుచిత్వానికి నిరుపమాన ప్రాధాన్యం కల్పించిన గాథ మరో కథే లేదని చెప్పవచ్చును. మరొకటి కన్పించదు. అందువలన ‘‘నిరంతర నిత్య జాగృతి, శుచిత్వ పరిరక్షణ అత్యవసరం.’’అనే ఒక హెచ్చరిక ఈ నలోపాఖ్యానంలో సునిసితంగా నిక్షిప్తమైనది.
(14)
నలుని ఆవేశించిన ‘కలిపురుషుడు’ నలుని సోదరుడైన ‘పుష్కరుడు’ అనే రాజువద్దకు వెళ్ళాడు. తననుతాను పరిచయం చేసుకొన్నాడు. నల మహారాజుతో జూదమాడితే అతడి రాజ్యాన్ని చేర్చుకొనవచ్చునని అతడిని ప్రోత్సహించాడు.
‘నీవు నాతో కలసి పాచికలాడి నలుని జయిస్తావు. నలుని జయించి నిషధ రాజ్యాన్ని పొందుము’అని అన్నాడు. అందుకు పుష్కరుడు సమ్మతించి తన అంగీకారాన్ని తెలిపాడు.
తదుపరి కలిపురుషుడు బ్రాహ్మణ వేషం ధరించాడు. పాచికలు చేత పట్టుకొని పుష్కరుని తనవెంట తీసుకొని నలమహారాజువద్దకు వచ్చాడు. పుష్కరుడు నలుని చెంతకుచేరి
‘‘రాజా! నీవు నాతో పాచికలు ఆడటానికి రమ్ము! రాజులు పాచికలాడటం సర్వసాధారణమేగదా? జూదానికి పిలిస్తే తిరస్కరించడం తగనిపని. అది ఓడక ఓడినట్లేగదా! ఆలోచించుము. గొప్పగొప్ప రాజులు పాచికలాడి తమతమ ప్రతిభను చాటుకొన్నారు. క్షత్రియ వీరోచిత గుణాన్ని ప్రదర్శించుము’’ అని అన్నాడు.
అందుకు విజ్ఞుడైన నలమహారాజు పుష్కరుని ఆహ్వానాన్ని విన్నాడు. జూదమునందు అమిత ఆసక్తిగల నలుడు ఊరుకొనలేకపోయాడు. వెనకముందు ఆలోచించలేదు. అకస్మాత్తుగా వచ్చిన పుష్కరుని ఆహ్వానము వెనుక ఉన్న రహస్యాన్ని గమనించలేదు. మంత్రులతోగానీ, దమంతితోగానీ, విజ్ఞులతోగానీ, సహచరులతోగానీ ఆలోచించలేదు. ఇది మందిదాకాదా అని గూడా ఆలోచించే విజ్ఞతను కోల్పోయాడు. పుష్కరునితో జూదం మొదలుపెట్టాడు. దమయంతి చూస్తుండగానే జూదం మొదలుబెట్టి పందెం వేయటానికి ఉద్యుక్తుడయ్యాడు. కలి ఆవహించటంవల్ల నలుని ఆలోచనాశక్తి నశించింది. తనకున్న ధనాన్నంతా పణంగాపెట్టాడు. అలసటలేకుండా, ఆపకుండా జూదం ఆడసాగాడు. హితులు, ఆప్తులు వారించినప్పటికి బుద్ధిహీనుడై జూదాన్ని ఆపకుండా పాడుతూనే ఉన్నాడు. జూదంలో నలుడు పరాజయ పరంపరలను అనుభవించి ఓడుతూనే ఉన్నాడు. ఇదంతా కలి యొక్క ప్రేరణే.
కలి ప్రభావంతో పెక్కునెలలు దుర్వ్యసనమైన జూదానికి లోబడి అనేక వస్తువాహనాదులను పణంగాపెట్టి పుష్కరుని చేతిలో ఓటమి చెందటానికి సంసిద్ధుడైన నలునివద్దకు పౌర బ్రాహ్మణ ముఖ్యులు రాజును జూదం నుండి నివారించటానికి వచ్చారు. అప్పుడు సూతుడు వచ్చి
‘‘కార్యార్థులైన పురజనులు ద్వారం చెంత వేచి ఉన్నారు.’’ అని దమయంతికి తెలియజేశాడు.
‘‘ధర్మార్థదర్శనుడైన మహారాజు వ్యసనాన్ని సహించలేక ప్రజలంతా వచ్చినట్లు మహారాజుకు తెలియ చేయగలవు’’అని దమయంతికి నివేదించాడు.
- ఇంకాఉంది