మెయిన్ ఫీచర్

కఠోర దీక్షతో కలలు సాకారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోషకాహారాన్ని ఇండివిడ్యువల్ బేస్డ్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? రకరకాల అనారోగ్య సమస్యలకు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రతి ఒక్కరినీ సతమతపెడుతుంటాయి. వీటన్నింటికీ సమాధానంగా ‘మైటీ మిల్లెట్స్’ స్టార్టప్‌ను ప్రారంభించింది మీనా జైన్. దీని ద్వారా క్లయింట్లకు ఆరోగ్యాన్ని, చక్కని జీవనశైలిని, పోషకాహారాన్ని అందిస్తూ.. వాళ్లకి ఆరోగ్యం పట్ల దిశానిర్దేశం చేస్తోంది మీనా.

ఆమె పేరు మీనా జైన్. పందొమ్మిదేళ్ల వయస్సులోనే ఆమెకు పెళ్లయింది. దాంతో చిన్నవయస్సులోనే ఆమెపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. బీకాం చదివిన ఆమె ఎన్నో ఉద్యోగాలను చేసింది. కానీ ఏదో ఒక ప్రత్యేకమైన కెరీర్‌ను ఎంచుకోవాలనే తపన ఆమెకు చిన్నప్పటి నుంచీ ఉండేది. అందులోనూ ముఖ్యంగా న్యూట్రిషనిస్టుగా మారి తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీను ఏర్పరచుకోవాలనుకునేది. కానీ కుటుంబ బాధ్యతల్లో భాగంగా ఇద్దరు పిల్లలు, వారి చదువులు.. ఇవన్నీ పూర్తయ్యే సరికి మీనాకు 45 సంవత్సరాలు వచ్చేశాయి. పిల్లలు కూడా పెద్దవాళ్లు కావడం ఆమెకు కాస్త విశ్రాంతి దొరికింది. ఇక ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. ఎప్పటినుంచో ఆమె మనసులో ఉన్న న్యూట్రిషన్ కోర్సును చదివి అందులో టాపర్‌గా నిలిచింది. అనుకున్నది సాధించడానికి చిత్తశుద్ధి, పట్టుదల ముఖ్యం కానీ వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది మీనా జైన్.
45 సంవత్సవాల వయస్సులో న్యూట్రషనిస్టుగా పోషకాహార పరిశోధనలను ప్రారంభించింది. చిరుధాన్యాలపై విస్తృతస్థాయిలో అధ్యయనం చేసింది. యాభై సంవత్సరాల వయస్సులో ఆమె కలనే వృత్తిగా చేసుకోవాలనుకుంది. నిజానికి ఈ వయసులో చాలామంది మహిళలు కుటుంబ బాధ్యతలు మోసి మోసి అలసిపోయి విశ్రాంతిని కోరుకుంటారు. ఫలితంగా తాము చిన్నప్పుడు ఏవేవో సాధించాలని కన్న కలలను మరిచిపోతుంటారు. కానీ మీనా మాత్రం వయసు పెరుగుతున్నా ఆమె తన లక్ష్యం వైపే అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బోన్ హెల్త్ పౌడర్, డైజెస్టివ్ పౌడర్‌లను తయారుచేసింది. వీటిలో ఎటువంటి రసాయనాలు కానీ, కృత్రిమమైన ఫ్లేవర్లు కానీ వాడలేదు. సహజసిద్ధమైన పదార్థాలనే వీటిల్లో ఉపయోగించి మొదట ఒక కిలో పరిమాణంలో వీటిని తయారుచేసింది. ఆ తర్వాత పోషక విలువలుండే గ్రనోలాబార్స్, న్యూట్రీబార్స్‌ను తయారుచేసింది. అనుకోకుండా మీనా జైన్ కొడుకు స్నేహితుడు పనిచేసే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో ఆర్డరు వచ్చింది. అలా మీనా తయారుచేసిన ఆహార ఉత్పత్తులకు ఆ కంపెనీ సిబ్బంది నుంచి మంచి స్పందన లభించింది. అది ఆమెలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దాంతో మిల్లెట్స్‌తో పాటు కూరగాయలతో కూడా రకరకాల హెల్దీ డైట్స్, చిరుధాన్యాలతో సావరీలను చేయడం ప్రారంభించింది.
ఏది ఆరోగ్యకరం..?
నేటికాలంలో ఆహారానికి సంబంధించిన రకరకాల సమాచారం ఇంటర్నెట్‌లో లభించడం వల్ల ఏది ఆరోగ్యకరమైన ఆహారం అనే విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలున్నాయి. ఏది తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి? ఇలాంటి ఆహారం అందరికీ మంచిదేనా? అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఎలా తినాలి? పోషకాహారాన్ని ఇండివిడ్యువల్ బేస్డ్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? రకరకాల అనారోగ్య సమస్యలకు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రతి ఒక్కరినీ సతమతపెడుతుంటాయి. వీటన్నింటికీ సమాధానంగా ‘మైటీ మిల్లెట్స్’ స్టార్టప్‌ను ప్రారంభించింది మీనా జైన్. దీని ద్వారా క్లయింట్లకు ఆరోగ్యాన్ని, చక్కని జీవనశైలిని, పోషకాహారాన్ని అందిస్తూ.. వాళ్లకి ఆరోగ్యం పట్ల దిశానిర్దేశం చేస్తోంది మీనా. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ క్లయింట్లను కలిగి ఉన్న మీనా.. వారి శరీరం తీరు, అనారోగ్య సమస్యలు, జీవనశైలి తదితర అంశాలకు అనుగుణంగా ఇండివిడ్యువల్ డైట్ ఇస్తోంది. ‘మైటీ మిల్లెట్స్’ని న్యూట్రిషన్ బ్రాండ్‌గా ముందుకు తీసుకెళ్లడానికి మీనాకు తన కొడుకు సాహిల్ బాగా సాయం చేస్తున్నాడు. అతను ఆమెకు తోడుగా నిలబడటంతో వ్యాపారపరంగా ఆమె ఏనాడూ తడబడలేదు. ఇటీవల ఈ రంగంలో పోటీ బాగా పెరిగింది. పరిశోధనలు
ఐదు సంవత్సరాలుగా మీనా అనేక అధ్యయనాలు, పరిశోధనలు చేసి ఆ అనుభవంతో ఎముకలకు సంబంధించిన పౌడర్, జీర్ణక్రియకు సంబంధించిన పౌడర్‌ను తయారుచేసి క్లయింట్లకు ఇవ్వడం మొదలుపెట్టింది. అవి మంచి ఫలితాలను చూపించాయి. అంతే.. మీనా రూపొందించిన ఈ పౌడర్లకు మంచి పేరు వచ్చి వాటికి డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా రకరకాల విత్తనాలతో లడ్డూలు, ఇతర ఆహార పదార్థాలను చేయడం మొదలుపెట్టింది. అలా మీనా అధ్యయనంలో ‘గ్రనోలా’ పోషకాల నిధి అని గ్రహించి ‘గ్రనోలా బార్స్’ను తయారుచేసింది. మార్కెట్‌లో లభించే బార్స్ కంటే భిన్నంగా.. 70 శాతం మేర నట్స్, డ్రైఫ్రూట్స్, సీడ్స్, ఓట్స్‌లను ఉపయోగించి ఈ బార్స్‌ను తయారుచేసింది. అలాగే ఈవిడ తయారుచేసిన ఉత్పత్తుల్లో షుగర్‌కు ప్రత్యామ్నాయంగా ‘మాపుల్ సిరప్’ను వాడుతోంది. ఇది మంచి స్వీట్‌నర్. వీరు తయారుచేసిన రెండు న్యూట్రీబార్స్‌లో ఒకటి కోకో సూపర్ సీడ్ బార్ కాగా, రెండోది కోకోనట్ రాగి బార్. ఇవి రెండూ చర్మానికి, జుట్టుకు ఎంతో మంచివి. మొదట్లో మీనాకు తెలిసిన కుటుంబాలు, స్నేహితులే ఈ ఉత్పత్తులకు కస్టమర్లు. ఆ తరువాత నోటి ప్రచారం ద్వారానే ఆ ఉత్పత్తుల వినియోగ విస్తృతి పెరిగింది. సావరీ స్నాక్స్‌ను పెళ్లిళ్లు, ఇతర ఈవెంట్లలో అలాగే కార్పొరేట్ సంస్థలకు పెద్ద మొత్తంలో అందిస్తుంటారు. అంతేకాదు కార్పొరేట్ ఆఫీసుల్లో, క్లబ్బులో న్యూట్రిషియస్ ఫుడ్‌కు సంబంధించి సెషన్లు, సెమినార్లు తరచుగా ఇస్తుంటారు.
మీనా జైన్ ఒకవైపు వ్యాపారాన్ని చూసుకుంటూనే మరోవైపు పోషకాహారానికి సంబంధించిన పరిశోధనలను కొనసాగిస్తోంది. సాయంత్రం వేళల్లో, మీల్స్‌కి మీల్స్‌కి మధ్య కొందరు ఏవైనా తింటుంటారు. అందుకోసం ఆరోగ్యవంతమైన సావరీస్‌నుచేసే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది ఆమెకు. సజ్జలతో సావరీస్ చేసింది. వీటిని ఒవెన్‌లో బేక్ చేసింది కాబట్టి అస్సలు ఆయిల్ ఉండదు. ఇలాంటి ఆరోగ్యకరమైన మరిన్ని బార్స్, స్నాక్స్ తీసుకురావాలన్నదే మీనా ఆలోచన. అందుకే ‘మైటీ మిల్లెట్స్’ నినాదమేంటంటే.. ‘డోంట్ స్టార్వ్.. ఈట్ స్మార్ట్’. ఈ సంస్థ లక్ష్యం ఏంటంటే.. ప్రతి ఒక్కరూ న్యూట్రిషన్, వెల్‌నెస్‌లతో కూడిన ఆహారాన్ని తినాలి. అందుకే ఈమె దగ్గరికి వచ్చే క్లయింట్ అనారోగ్య సమస్యలకు, వారి శరీర స్వభావానికి తగ్గట్టు వారి ఆహారపు అలవాట్లకు, జీవనశైలికి అనుగుణంగా ప్రత్యేకమైన న్యూట్రిషన్ డైట్ ప్లాన్లు కూడా అందిస్తున్నారు. ఫిట్‌నెస్ అండ్ లైఫ్ స్టయిల్ ప్లాన్, డిటాక్స్ ప్లస్ వెయిట్‌లాస్ ప్లాన్, వెయిట్ మేనేజ్‌మెంట్ ప్లస్ ఇంచ్ లాస్ ప్లాన్, హెల్త్ కండిషన్ అండ్ మేనేజ్‌మెంట్ ప్లాన్స్ వంటివెన్నో ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీనాజైన్‌కు దేశవ్యాప్తంగానే కాదు ఆస్ట్రేలియా, దుబాయ్, అమెరికా వంటి అనేక దేశాల్లో క్లయంట్స్ ఉన్నారు. ఆరోగ్యకరమైన పోషకాహారం తినే సంస్కృతిని పిల్లలకు చిన్నతనం నుంచే తల్లిదండ్రులు అలవాటుచేయాలి. దాంతో వాళ్లు ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆరోగ్యకరమైన యువత ఉన్న దేశం అభివృద్ధిపథంలో ముందుంటుందని చెబుతున్నారు మీనా జైన్.