మెయన్ ఫీచర్

అంతర్జాతీయ చట్టాలే భారత్‌కు సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చంద్రయాన్-2’తో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్ని చేసింది. స్వీయ నియంత్రణ వ్యవస్థలతో, దేశీయ ఉత్పత్తులతో ఉపగ్రహాల రూపకల్పన మొదలు ప్రతి దశలో సొంత పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రపంచ పెద్దన్నల పాత్రను తగ్గిస్తూ భారత్ ఖ్యాతి గడించింది. అంతరిక్ష రంగంలో భారత్ అద్భుత విజయాలను మున్ముందు కూడా సాధించనుండడం తిరుగులేని సత్యం. ఎట్టిపరిస్థితుల్లోనూ 2029 నా టికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే వివిధ పరిశోధనలు కొనసాగించాలనే లక్ష్యంతో ప్రణాళికలు వేసింది. కానీ, అమెరికాకు చెందిన ‘నాసా’ మనకంటే 50 ఏళ్లు ముందుంది. అర్ధ శతాబ్దం క్రితమే చంద్రుడిపైకి మనిషిని పంపించి రికార్డు సృష్టించింది. మనం అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేలోగా మహిళా బృందాన్ని చంద్రుడిపైకి పంపించేందుకు అమెరికా ఉరకలు వేస్తోంది.
ప్రపంచంలో 72 దేశాలు అంతరిక్ష పరిశోధనల్లో నిమగ్నమయ్యాయి. ఉపగ్రహాల ప్రయోగంలో పది దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా), నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), రాస్‌కాస్మోస్ (రష్యా) లు మిగిలిన దేశాలకు మార్గదర్శకంగా అంతరిక్ష పరిశోధనల్లో ఆరితేరాయి. వీటితో పాటు స్పేస్ -ఎక్స్, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్, ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ, నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్-ఫ్రాన్స్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ పరిశోధనలకే పరిమితం కాకుండా, గ్రహాల స్థితిగతులపై అధ్యయనానికి సిద్ధమవుతున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం 14 దేశాలకు మాత్రమే వాహకనౌకలను ప్రయోగించే సామర్ధ్యం ఉంది. చైనా, రష్యా, అమెరికాలతో పోటీ పడి భారత్ సైతం ముందుంజలోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఆఫ్రికా యూనియన్, అరబ్ లీగ్, దక్షిణ అమెరికాలు ఉపగ్రహ ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి.
అంతరిక్షంపై 1945 ప్రాంతంలోనే అగ్రరాజ్యాల కన్నుపడింది. అప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్న అమెరికా కొరియన్ యుద్ధం (1950-53)లో అణ్వాయుధాలను వాడాల్సి వస్తుందని హెచ్చరికలు చేసింది. దాంతో ‘సురక్షిత అంతరిక్షం’ కోసం ఐక్యరాజ్యసమితి సన్నాహాలు ప్రారంభించింది. బాహ్య కక్ష్యలో శాంతిని నెలకొల్పేందుకు ఐక్యరాజ్యసమితి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ చొరవతో అత్యంత కీలకమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అందులో మొదటిది అంతరిక్షంలో శాంతిని నెలకొల్పేందుకు 1967 అక్టోబర్ 10న ఒప్పందం కుదిరింది. అంతరిక్షంలో నష్టాన్ని కలిగిస్తే దానికి సంబంధిత దేశాలదే బాధ్యత అని మరో ఒప్పందం 1972 సెప్టెంబర్ 1న కుదిరింది. ఏ దేశమైనా అంతరిక్షంలో ప్రయోగాలు చేయదల్చుకుంటే అందుకు సంబంధించిన సమాచారాన్ని మిగిలిన దేశాలకు తెలియజేయడమేగాక, ఆయా ఉపగ్రహాలను ముందుగా రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధనను 1976 సెప్టెంబర్ 15న కుదిరిన ఒప్పందం ద్వారా అమలులోకి తెచ్చారు. అంతరిక్ష ప్రయోగాలు చేయడమే కాదు, అక్కడ ఎలాంటి వ్యర్థాలను వదిలిపెట్టడానికి వీలులేదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఆయా దేశాలు ఇందుకు బాధ్యత వహించాలి. అనూహ్యంగా సాంకేతిక లోపాలు తలెత్తి లేదా ఇతర కారణాలతో ఉప గ్రహాలు ఢీ కొనడం, ఆగిపోవడం, కక్ష్య నుండి పలాయనం చెందడానికి కూడా వాటిని ప్రయోగించే దేశాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినా- గురివింద గింజ సామెతలా భారత్ తీరును నిలదీస్తోంది.
అమెరికా, కెనడా, జపాన్, రష్యా, యూరప్ దేశాలు సంయుక్తంగా వినియోగించుకుంటున్న అంతరిక్ష కేంద్రం మరో పదేళ్లు కొనసాగనుంది. మిగిలిన దేశాలు వైదొలిగినా అమెరికా మాత్రం అదే కేంద్రానికి మరమ్మతులు చేసి కొనసాగించాలని చూస్తోంది. మరో పక్క బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ అమెరికా కీలక భూమికను పోషిస్తోంది. భారత్ అంతరిక్ష పరిశోధనల్లో మరో మెట్టు ఎక్కితే గట్టి పోటీ ఇచ్చేది అమెరికానే. రానున్న సవాళ్లలో మొదటిది సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఒకటైతే, ఆయా గ్రహాలలో మిగిలిపోతున్న వ్యర్థ పదార్థాలకు సంబంధించిన వివాదాలు కీలక అంశం కాబోతున్నాయి.
ఇప్పటికే అంతరిక్షంలో వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. రానున్న రోజుల్లో సాధారణ పౌరులు సైతం అంతరిక్ష యాత్రకు వెళ్లి వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనావాసానికి సైతం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇదంతా అమలులోకి వస్తే అంతరిక్షం పరిస్థితి ఏమటనే భయం మొదలవుతోంది. తాజా లెక్కల ప్రకారం 128 మిలియన్ల వ్యర్థ పదార్థాలు అంతరిక్షంలో ఉన్నాయి. మరో 17 కోట్ల మేర శకలాలున్నాయి. అందులో 10 సెంటీమీటర్ల కంటే పెద్దవైన 34 వేల వ్యర్థపదార్థాలు కక్ష్యలో ఉన్నాయి. 2016 డిసెంబర్‌లో ఐదు ఉపగ్రహాలు ఏకకాలంలో ఢీ కొనడంతో వ్యర్థాలు మరింత పెరిగాయి. ఉపగ్రహాల శిథిలాలు, చెత్తాచెదారం, కాలం చెల్లిన ఉపగ్రహాలు, మండిపోయిన రాకెట్లు, ఇతర శకలాలు పెరుగుతున్నాయి. ఈ శకలాల్లో కొన్ని చిన్నపాటి ఉల్కల కంటే దట్టంగా ఉన్నాయి. ఇందులో చాలా వరకూ సాలిడ్ రాకెట్ మోటార్ల నుండి వెలువడిన దుమ్ము, ఉపరితల రాపిడి కారణంగా వెలువడ్డ పెయింట్లు, గడ్డకట్టిన పదార్థాలున్నాయి. వీటి వల్ల మిగిలిన ఉపగ్రహాల్లోని సౌరఫలకాలకు, కటకాలకు దెబ్బతగిలే ముప్పు ఏర్పడింది. వీటిని అదుపు చేయలేకపోతే శిథిలాల సాంద్రత స్థాయి పెరిగి గొలుసుకట్టు చర్యలా ఘాతాలు జరిగి అక్కడ పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీ కొట్టే వీలుంది. భూ నిమ్న కక్ష్యల్లో సార్వత్రిక కక్ష్యలు అనేకం ఉంటాయి. ఇక్కడ ఉపగ్రహాలు అన్నీ ఒకే కక్ష్యలో కాకుండా అనేక వలయాల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. సౌర అనువర్తిత కక్ష్యలు మాదిరిగా భూ నిమ్న ఉపగ్రహాలు అనేక కక్ష్యా తలాల్లో రోజుకు సగటున 15 సార్లు వరకూ పరిభ్రమిస్తూ ఉంటాయి. దీంతో ఈ కక్ష్యల్లోకి సమీప వస్తువులు వస్తుంటాయి. భూ గురుత్వాకరణ అసమతుల్యత కారణంగా కక్ష్యల్లో అస్థితర ఏర్పడి మారుతుంటాయి. ఇలాంటి సమయంలో ముఖాముఖిగా సెకెనుకు 16 కిలోమీటర్లు వేగంతో ఘాతాలు జరుగుతుంటాయి. ఈ ముక్కలు కక్ష్యలను దాటి మహాఘాతాలకు కారణం అవుతుంటాయి.
1958లో అమెరికా వాన్‌గార్డ్-1 అనే ఉపగ్రహాన్ని భూ మధ్యస్థ కక్ష్యలోకి ప్రయోగించింది. 2009 అక్టోబర్ నాటికి కక్ష్యలో ఉన్న మానవ నిర్మిత అంతరిక్ష వస్తువులు అన్నింటిలోకి అది ప్రాచీనమైనదని చెప్పవచ్చు. అప్పటి నుండి నేటి వరకూ దాదాపు 50వేల ప్రయోగాలు జరగ్గా, కేవలం 902 ఉపగ్రహాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఆనాటి సోవియట్ యూనియన్ 1970లో గూఢచారి ఉపగ్రహాలను పంపింది. రాడార్ల పవర్ కోసం అణురియాక్టర్లను వినియోగించింది. చివరికి అణుధార్మిక పదార్థాలు భూమికి చేరి అనేక దుష్ఫలితాలను ఇచ్చింది. ఎడ్వర్డ్ టఫ్టే 1990లో రాసిన ఇనె్వజనింగ్ ఇన్ఫర్మేషన్ అనే పుస్తకం ప్రకారం మొట్టమొదటి అమెరికన్ అంతరిక్ష నడక సందర్భంగా వ్యోమోగామి మైఖేల్ కాలిన్స్ పోగొట్టుకున్న గ్లౌస్ కూడా అంతరిక్ష శిథిలం కిందకే వస్తుంది. మైఖేల్ కాలిన్స్ జెమిని -1 వద్ద పోగొట్టుకున్న కెమరా, మిర్ కేంద్రంలో వ్యోమగాములు 15 ఏళ్ల పాటు వదిలేసిన చెత్త సంచులు, ఒక రెంచీ, ఒక టూత్ బ్రష్, సునీతా విలియమ్స్ పోగొట్టుకున్న కెమెరా, ఎస్‌టీఎస్ -120 మిషన్‌లో విరిగిన సౌర ఫలకం, హెడ్‌మేరీ స్ట్ఫోనిషిన్ పైపర్ పోగొట్టుకున్న బ్రీఫ్‌కేసు పరిణామంలోని టూల్ బ్యాగ్ ఇవన్నీ అంతరిక్షంలో కదలాడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద జాబితానే. ఇపుడిపుడే భూమిపై నుండే ట్రాకింగ్‌కు రాడార్లు, ఆప్టికల్ డిటెక్టర్లు సిద్ధమవుతున్నాయి. ఇంత వరకూ అనిర్థారితంగా ఉన్న సమాచారం నూతన పరికరాలతో నిర్ధారించుకునే వీలు కలుగుతోంది. అంతరిక్షంలో చెత్త ఉందని తేలినా, దానిని భూమీదకు తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. అంతరిక్ష చెత్తను తక్కిన వ్యోమనౌకలకు అడ్డురాకుండా పక్కకు మళ్లించి అక్కడే వాటిని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం లేజర్ బ్రూమ్స్, సోలార్ సెయిల్స్ స్పేస్‌నెట్‌లు, ఎలక్ట్రోడైనమిక్ లేజర్స్ విధానాలతో పాటు కలెక్టర్ శాటిలైట్లు వినియోగిస్తున్నారు. దారితప్పిన ఉపగ్రహాలను పట్టుకుని, వాటి హార్డ్‌వేర్‌ను సంగ్రహించడానికి అమెరికా ఫీనిక్స్ ప్రాజెక్టును రూపొందించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్లీన్‌స్పేస్ వన్ ప్రాజెక్టు కింద ఉపగ్రహాన్ని వెంబడించి దానిని భూ వాతావరణంలోకి లాక్కొచ్చి ధ్వంసం అయ్యేలా చేస్తోంది. ఈ ప్రయోగాల్లోనూ భారత్ ముందంజలో ఉన్నా, అంతరిక్ష చెత్తకు సంబంధించి ఎలాంటి సవరణలకూ నోచుకోకుండా చాలా కాలంగా ఉన్న పాత అంతర్జాతీయ చట్టాలే రానున్న రోజుల్లో భారత్‌కు తలనొప్పి కానున్నాయి.

-బీవీ ప్రసాద్ 98499 98090