మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిగంబరుడైన నిన్ను చూచి సంతోషించటానికి వచ్చాము. నీ సంపద, నీ రాజ్యాన్ని మోసగించి పరిగ్రహించిన పాచికలము మేము. పక్షుల రూపం ధరించి నిన్ను మోసగించి, నీవు కట్టిన బట్టలను గూడా అపహరించవచ్చాము. అపహరించాము. పని అయిపోయింది’’అని పలుకుచూ ఆ పక్షులు ఆకాశమార్గంపట్టి ఎగిరిపోయాయి. ఆ పిట్టల పలుకులు విని ఆశ్చర్యపోయాడు నలుడు.
‘‘నాకు ఈ దుస్థితి దాపురించడానికి ఈ పాచికల దోషంగాక మరేమి కారణము ఉన్నది’’అని తలపోసిన నలుడు దమయంతితో
‘‘దమయంతీ! ఈ పాచికల కోపంవలననే మనం ఈ విధంగా సకల సంపదలను కోల్పోయాము. ఆకలి బాధతో దుఃఖితులమై ప్రాణాలను నిలుపుకొనలేకపోతున్నాము. వీనిమూలంగానే నిషధ ప్రజల గౌరవాన్ని పొందలేకపోయాము. పోగొట్టుకొన్నాము. పాచికలే పక్షుల రూపంలో వచ్చినా వస్త్రాన్నిగూడా అపహరించాయి. ఎంతటి దుస్థితికి లోనయ్యాము’’ అని దుఃఖించాడు.
అత్యంత విషమ పరిస్థితిని పొంది దుఃఖిస్తూ చంచలమైన మనస్సు కలవాడైయ్యాడు.
వెంటనే దమయంతి కట్టిన వస్త్రంయొక్క చెరగునే తానుగూడా ధరించాడు.
ఈ రీతిగా ఆ ఇద్దరూ ఒకే చీర ధరించి ఒండొరుల మెగాలు చూచుకొని పరితపింపసాగారు. కొంతసేపటికి నలుడు దమయంతిని చూచి
‘ఓ లలనా! దమయంతీ! అతిలోక సౌందర్యవతినైన నిన్ను పొందగలిగాను. కానీ విధివక్రించి నన్నీ స్థితికి తెచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో నేను నిన్ను ఎలా సుఖపెట్టగలను. భర్తగా నిన్ను సుఖబెట్టటానికి బదులు నీకు కష్టాలను తెచ్చాను. రాజభోగాల ననుభవించిన నిన్ను ఈనాడు కటిక నేలపై తిండి కూడా పెట్టలేని స్థితిలో నడిపిస్తున్నాను.
నీ శరీరం ఎంత కష్టపడుచున్నదోగదా! నా మూలంగా నీవు అనేక కష్టాలను అనుభవింపవలసి వచ్చింది. విధివక్రించి నన్నీస్థితికి తెచ్చింది. ఎవరెన్ని హితవచనాలను చెప్పినా పెడచెవినిబెట్టి సర్వసంపదలనూ చివరకు రాజ్యాన్ని సైతం కోల్పోయి కట్టుకున్న భార్యనుకూడా ఇక్కట్లపాలు చేశాను.’’
‘‘దమయంతీ! నీ భర్తగా నీకు హితాన్ని కల్గించే మాట చెబుతున్నాను.
ఈ త్రోవలన్నీ ‘‘ఋక్షవంత’ పర్వతాన్ని దాటి ‘‘అవంతీ నగరాన్ని’’దాటి దక్షిణాపధానికి వెళ్ళేవి.
ఇది ‘వింధ్య పర్వతం’.
ఇది ‘పయోష్ణి’నది. అనేక కందమూలలాల ఫలాలచే సుసంపన్నమైన ప్రాంతం. మహర్షుల ఆశ్రమాలున్నాయి.’’అని చెపుతుండగా విన్న దమయంతి ‘‘ప్రభూ! ఈ విషయం ఎందుకు చెపుతున్నారు? కారణమేమి? నేను మీచెంతనే ఉన్నానుగదా! నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు ఎలా ఉండగలరు!’’ అని అనగా
‘‘దమయంతీ! ఇది విదర్భా పట్టణానికి పోయే బాట.
ఈ మార్గం కోసల దేశానికి పోతుంది.
ఇది ‘ఉజ్జయనీ’ నగరానికి వెళ్ళే త్రోవ. ఈ నగరం ‘శిప్రా’నదీ తీరాన ఉన్నది. ఇక్కడి దైవం ‘‘మాహాకాళుడు’’. అపమృత్యు దోషాన్ని హరిస్తాడు’’అని చెప్పగా విన్న దమయంతి అయోమయంలో ‘‘ఊఁ!’’ అని అన్నది. నలుడు మరలా
‘‘ఆ తరువాత దక్షిణంలో ఉన్న దేశమంతా ‘దక్షిణాపధమే’. ఈ తెరపులు అన్నింటిలో మనం వెళ్ళటానికి నీ ఉద్దేశ్యంలో అనువైనది ఏది?’’అని నలుడు పలుకగా.
‘‘ప్రభూ! మీరు ఇలా ఎందుకు శలవిస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు! అని అన్నది దమయంతి.
‘‘చంద్రముఖం వంటి ముఖంగల ఓ దమయంతి! నాతో ఈ అడవులలో కష్టాలుపడుతూ తిరుగజాలవు. విధి నాకు అనుకూలంగా లేదు. హితబోధలేవి నా చెవికెక్కలేదు. దాని ఫలితం ఇది. ఇపుడున్న పరిస్థితిలో నీవు మీ పుట్టింటికిపోయి బంధుజనాలతో సుఖంగా ఉండటం మంచిది’’ అని పలికాడు నలుడు.