మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ లలన తొల్లి మెత్తనైన పరుపులపై పరుండి చెలికత్తెలు పాదాలు ఒత్తుతుండగా శయనించేది. నేడు ఈ కటిక నేలపై, ధూళిలో, దుమ్ములో నిద్రిస్తున్నది. విధి ఎంత వైపరీత్యం అని దుఃఖించాడు. దీనికి కారణం తన స్వయం కృతాపారధమే!
తనయందు అనురక్తయైన ఈ సుకుమారి దమయంతి తన మూలంగా దుఃఖాన్ని పొందుచున్నది. తాను లేకుంటే ఎప్పటికైనా తన వారిని చేరుకోగలదు. తనతోనే ఉంటే దుఃఖాన్ని తప్ప మరేవిధమైన సుఖాన్ని పొందలేదు. అందులో సంశయం లేదు. విడచివెళితే ఆమె సుఖాన్నైనా పొందవచ్చును అని పరిపరివిధాల ఆలోచించి చివరకు దమయంతిని విడచి వెళ్ళడమే మంచిదని నిశ్చయించుకొన్నాడు.
యశస్విని, సాధ్వి అయిన దమయంతి సహజతేజస్వి అవడంచేత అవమానింపబడుటకు వీలులేదు అని తలంచాడు.
కలి ప్రభావంతో ప్రేరితుడైన నలునకు భార్య దమయంతిని విడచి వెళ్ళే విషయంలో గట్టి భావమే కలిగింది.
‘‘దమయంతి పరితాపం ఓర్వలేను. నేను ఎక్కడికైనా వెళతాను. నేను వెళ్ళిన తరువాత ఈమె నన్నుకానక చేసేదిలేక ఎలాగో ఒకలాగ బంధువుల వద్దకు తప్పక చేరుతుంది. ఆ విధంగా ఆమెకు నాతోపాటు ఈ అడవిలో పడవలసిన బాధలు తగ్గుతాయి’’ అని విచారించి పోవటానికి ఉద్యుక్తుడయ్యాడు.
దమయంతి చీరలోని కొంతమేర చించి తనకు వస్త్రంగా మలచుకొన్నాడు. కొన్ని అడుగులు ముందుకు వేశాడు. కానీ కాళ్ళు కదలలేదు. గొప్పదైన స్నేహభావం వలన ఆమెను వీడజాలకపోయాడు. అయితే కలి ప్రభావం నలుని వెంటాడుచున్నది. ఒకప్రక్క అనురాగ బంధం, మరొకవైపు కలి ప్రభావం. ఈ రెంటి నడుమ నలుడు నలిగిపోతున్నాడు. తొందరగా ఒక స్థిర నిశ్చయానికి రాలేక ఊగిసలాడాడు.
విడచి వెళ్ళడమే మంచిదని ఒక నిశ్చయానికి వచ్చాడు. నిద్రిస్తున్న దమయంతిని విడచి వెళ్ళాడు. కొంతదూరం వెళ్ళాడు. మళ్ళీ మనస్సు మార్చుకొని మరలి వచ్చాడు.
‘‘ఇంతకు పూర్వం ఈ ప్రియ సతిని సూర్యుడుగానీ, వాయువుగానీ చూడలేదు. అలాంటి ఆమె నేడు కటిక నేలపై అనాథవలె నిద్రిస్తోంది. నిద్ర లేచి చింపియున్న చీరెను చూచుకొని పిచ్చి దానివలె అవుతుందేమో? నేను లేకుండా మృగాల నిలయమైన ఈ ఘోరాటవిలో ఎలా సంచరించగలదు. ‘‘దమయంతీ నీవు ధర్మపరాయణవు. నిన్ను ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు, మరుద్గణాలు తప్పక రక్షిస్తారు.’’ అని నరలా అజ్ఞానియై ముందుకు నడిచారు.
నిద్రించే దమయంతిని శూన్యంలో వదలి విచారిస్తూనే నలుడు వెళ్ళిపోయాడు.
నలుడు వెళ్లిన తరువాత బడలిక తీరిన దమయంతి నిద్రనుండి మేల్కొన్నది. ఇరుప్రక్కల చూచింది. నలుని కానక ఒక్కసారి భయాందోళనలకు లోనయింది. నలుడు కనిపించలేదు. కానీ తన చీరె కొంత చింపబడి యున్నది. నాలుగువైపుల మరలా తేరిపార చూచింది. భయపడింది. దుఃఖంతో వ్యాకులమైన చిత్తంతో
‘‘ఓ నల మహారాజా!’’అని పెద్దగా అరిచింది.
‘‘హా నాథా! హా మహారాజా! హా స్వామీ! ఎందున్నావయ్యా? సువిశాలమైన భూమండలాన్ని సంరక్షింపగల బాహుబలం కలవాడా! శత్రువులను జయించినవాడా! ఓ నిషధ దేశ ప్రభూ! నిర్దయుడవై నన్నిట్లు ఒంటరిదాన్ని చేసి వెళ్ళటం నీకు తగునా? భావ్యమా? ఎన్నడూ ధర్మాన్ని తప్పనివాడవే? సత్యసంధుడవే? ఎక్కడ ఉన్నావయ్యా? కనిపించవేమి? నేనెచటికి పోగలదాన? ఈ భయంకరమైన అడవిలో నేను నినె్నక్కడని చూడగలదానను? ఏ అపకారమూ చేయని నీ ఈ భార్యను పరులు అపకారం చేసే సమయంలో వెళ్ళిపోయావు! లోక పాలుర ఎదుట నా విషయంలో పూర్వం నీవు చెప్పిన మాటలను ఇప్పుడు ఆచరణలో పెట్టగలవా?’
ఓ పురుషశ్రేష్ఠా! మానవులకు ఆ కాలంలో మరణం సంభవించదు. ఇంతవరకు నీవు చేసిన పరిహాసం చాలు!