మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయంతో ఒక చెట్టుచాటున కొంతసేపు దాగి మరలా ముందుకు సాగింది.
అద్భుత దృశ్యాలను దమయంతి కనులారా చూస్తున్నది. ఇదివరలో తనకు అలాంటి పరిస్థితి కలుగలేదు.
ఆ అరణ్యంలో తన భర్త నలుని వెదుకుచూ ఒక్కతయే తిరుగాడుచున్నది. భర్తను ఎడబాసిన దుఃఖంతో ఉన్నప్పటికినీ, పాతివ్రత్య మహాత్యంవలన దేనికీ భయపడటం లేదు. అలా నడచి నడచి అలసట చెంది ఒక రాతిపై కూర్చొని విలపించింది. మరలా లేచింది. అక్కడనున్న చెట్టుతో...
‘‘ఓ సహకార వృక్షమా (తియ్యమామిడి)! ఎల్లప్పుడూ నాకు ప్రీతిని ఒనగూర్చే నా నాథుడు నల మహారాజును చూచావా?
‘‘ఓ సురపొన్న వృక్షమా! పురుషశ్రేష్ఠుడైన నా పతిని కన్నావా?
‘‘ఓ తిలక వృక్షమా (బొట్టుగుచెట్టు)! ఈ ధరాతలంలో మనుజులలో ఉత్తముడు, శ్రేష్ఠుడూ అయిన నా పతిని చూచావా?
‘‘ఓ హరిచందన వృక్షమా! బుద్ధిమంతుడూ, కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చేవాడిని నా భర్త నలుని తిలకించావా?
‘‘ఓ పొగడ వృక్షమా (వకుళ వృక్షం)! సదా మిత్రులకు సహాయపడి వారి దుఃఖాన్ని హరించే వాడిని నా భర్తను చూచావా?
‘‘ఓ విభీతిక వృక్షమా (చండ్ర చెట్టు)! లోకంలో సదా జనులచేత పొగడబడే వాడిని నా నాథుని చూచావా?’’
అని విలపిస్తూ కనపడ్డ చెట్టువద్దకు వెళ్లి అడుగుచున్నది దమయంతి. ఆమె పాదాలు అడివిలోని ముళ్ళపై, రాళ్ళపై నడచి నడచి బొబ్బలెక్కగా ఆ బాధను ఉపశమించుకొనటానికి సెలయేళ్ళమధ్య నిలబడుతుంది. ఎలుగెత్తి ఓ నలమహారాజా ఎక్కడున్నావు? అని పిలుస్తుంది.
‘‘ఓ రాజా! ఈ నిర్జరారణ్యంలో నన్నొక్కతినే వదలి ఎక్కడకు వెళ్ళావు? నాపట్ల ఎందుకు అసత్య మార్గాన్ని తొక్కావు?
మహారాజా! హంస దౌత్యం నెరపినప్పుడు నీవన్న మాటలు గుర్తుతెచ్చుకో!
‘లోక పాలుర ఎదుట పలికిన పల్కులను ఒక్కసారి స్మరించుకో!
ఈ అడవిలో భయంకరాకృతిగల కొండచిలువ నన్ను పట్టి మ్రింగబోయే సమయంలోనైనా నన్ను రక్షింపరాలేదే?
‘‘నేను తప్ప మరొక ప్రియురాలు లేదని పదేపదే చెప్పావుగదా?
ఈనాడు నిస్సహాయతతో విలపిస్తున్న నీ ప్రియమైన భార్యనైన ననే్నల రక్షింపరావు?
కృశించిన దానను. దీనురాలను. కళతగ్గిన దానను. సగం చీరనే ధరించిన దానను.
అనాథవలె విలపిస్తున్న దానను. ననె్నందుకు ఆదరింపవు?
నిన్ను ఇప్పుడు ఎక్కడని కనుగొనగలను? నిన్ను చూడగలను?
ఎక్కడున్నావో ఎవరిని అడగను?
నీ మధురవాక్కును ఎప్పుడు వినగలను? అని విలపిస్తూ దమయంతి ఆ కారడవిలో పడుతూలేస్తూ ముందుకు సాగుచున్నది.
క్రూరమృగాలు, పాములు, దొంగలు, కిరాతులు సదాతిరుగాడే అడవిలో దమయంతి అలా విలపిస్తూ మూడు రాత్రింబవళ్ళు పయనించింది. దివ్యారణ్యాన్ని పోలి ప్రకాశిస్తున్న ఒక ‘ముని’ఆశ్రమాన్ని చూచింది. ఆ ఆశ్రమం గొప్ప మహర్షుల తపస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది.
ఆ ఆశ్రమాన్ని చూచిన దమయంతి ఊపిరిపీల్చుకుంది. ఆశ్రయం దొరికినంత సంతృప్తిని పొందింది. చిన్నగా ఆ ఆశ్రమంలోనికి ప్రవేశించింది. అందున్న తేజోమూర్తులైన తపోవృద్ధులను చూచింది. శిరస్సువంచి వినయంతో నమస్కరించింది. అప్పుడు ఆ తాపసోత్తములందరూ దమయంతిని చూచారు. సాదరంగా స్వాగతం పలికారు. గౌరవించి ఆశీనురాలవు కమ్మని కోరారు. తదుపరి తాము ఏమిచేయవలెనో చెప్పమని అడిగారు. దమయంతి వినయంతో
- ఇంకాఉంది