మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ శాపం నలుడు నీ చెంతకు వచ్చేవరకు ఉంటుందని చెప్పాడు. అతడి శాపంవలన కదలలేక పడియున్నాను. ఆ మహర్షి శాపంవలన ఒక్క అడుగుకూడా కదల లేక పోతున్నాను. ఈ దావాగ్ని సకల ప్రాణికోటికీ మృత్యుకారణమై అన్నివైపుల విజృంభిస్తున్నది. నీ దర్శనం నన్ను శాపంనుండి విముక్తి కావింపగలదు. ఈ కీడునుండి నీవు నన్నుకాపాడమని వేడుకొంటున్నాను నీవు దయామయుడవు.’’
‘‘ఓ మహారాజా! ఈ కారుచిచ్చు మంటలు నాలుగుదిక్కులా క్రమ్ముకొని సమీపించాయి. ఈ మంటలలో కాలి చనిపోజాలను. నాతో సమానమైన నాగరాజు మరొక్కడు లేడు. నేను నీకు మిత్రుడను అవుతాను. నీకు శ్రేయస్సును ఉపదేశిస్తాను. నేను చాలాతేలిక అవుతాను. నన్ను శీఘ్రంగా తీసికొనివెళ్ళుము. దయతో నన్ను ఎత్తుకొని ఒక చల్లని సరోవర తీరం చేర్చుము’’అని నలుని వేడుకొన్నాడు.
అలా వేడుకొన్న కర్కోటకుడు వెంటనే బొటనవ్రేలికి సరిపోయే శరీరంగల వాడై ఎత్తుకొనడానికి సులువుగా మారాడు. అంత నలుడు కర్కోటకుని ఎత్తుకొని కార్చిచ్చులేని ప్రదేశానికి చేరాడు. అగ్నిహోత్రునిచే విముక్తుడైన కర్కోటకుని మరొకతావునకుచేర్చి విడిచిపెట్టాలని నలుడు తలచే లోపలనే కర్కోటకుడు
‘‘నలమహారాజా! మీరు మీ అడుగులు లెక్కిస్తూ పది అడుగులు ముందుకు వెళ్ళండి. అక్కడ నేను మీకు గొప్ప మేలుచేస్తాను’’ అని నలునితో అన్నాడు.
నలుడు కర్కోటకుడు చెప్పినట్లు లెక్కపెట్టుకొంటూ పదవ అడుగువేస్తున్నప్పుడు కర్కోటకుడు నలుని కాటువేశాడు. సర్పద్రష్టుడైన (కరవబడిన) నలుని రూపం మారిపోయింది. వికృతరూపాన్ని పొందాడు. నలుడు తన వికృతరూపాన్ని చూచుకొని ఆశ్చర్యపోతుండగా కర్కోటకుడు తన నిజరూపాన్ని చూపి ‘‘ఆర్యా! నీవు నాచేత కరవబడినందుకు విచారించకుము. ఇప్పుడు నీవు వికృత రూపుడివవటమే నీకు మేలు. నిన్ను జనులెవరూ తెలిసికోకుండా ఉండటానికే నేను నీ రూపాన్ని మార్చివేశాను. నిన్ను ఎవరైనా గుర్తిస్తే నీకు కీడు కలుగుతుంది.
నలమహారాజా! నా విషంచే నీ శరీరంలో కల్గిన మార్పుఉన్నంతవరకూ నీవు దుఃఖంతోనే ఉంటావు. నీకు దుఃఖాలు తీరే మంచిరోజులు వచ్చినప్పుడు నీ వికృతరూపం మారుతుంది. ఏ తప్పూచేయని నిన్ను వంచించినవాని కోపాసూయలకు నీవు అర్హుడవుగావు. అట్టివానినుండి రక్షణయే నావల్ల నీకు జరిగింది...
నరోత్తమా! నా అనుగ్రహంవలన, నా విషం నీ శరీరంలో ఉన్నంతవరకు నీకు విషసర్పాల భయంగానీ, పిశాచరాక్షస భీతిగానీ, శత్రుభయం గానీ ఉండవు నీకు అన్ని యుద్ధాలలో విజయం చేకూరుతుంది.
నలమహారాజా! నీకు భార్యాసంగమం కలుగుతుంది. పూర్వపు రాజ్యసంపద తిరిగి లభిస్తుంది. నీకు ఎప్పుడు అసలు ఆకృతికావాలని అనిపిస్తుందో ఆ క్షణం నీ తొల్లిటి ఆకృతి నీకు లభించగలదు. అప్పుడు నన్ను స్మరించుము. ఈ వస్త్రాన్ని కప్పుకొనగానే నీకు అసలురూపం సంప్రాప్తిస్తుంది.’’అని వరాన్నిచ్చి
‘‘రాజా! ఋతుపర్ణుడు అనే మహారాజు భూమండలంలో ప్రసిద్ధుడు. అతడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. అయోధ్యా నగరానికి రాజు. అతడు నీచేత కొలువదగినవాడు. కావున నీవు అతడిని సేవిస్తూ ఉండగలవు.
అట్టి ఋతుపర్ణ మహారాజు నీవలన ‘అశ్వహృదయాన్ని’ (అశ్వహృదయమనే విద్య) గ్రహించి, నీవు ‘‘అక్షహృదయాన్ని’’ (అక్షహృదయమనే విద్య) తెలిసికోవటంవలన మున్ముందు నీకు ఎంతో మేలుకలుగుతుంది.
‘‘రాజా! ఇకపై నీవు భాహుకుడు అనే పేరుపెట్టుకొని రథసారథిగా ఋతుపర్ణుడివద్ద ఉండుము’’అని పలికి
కర్కోటకుడు నలునకు దివ్య వస్తద్వ్రయాన్ని ప్రసాదించి వెంటనే అదృశ్యమయ్యాడు.
కర్కోటకుడు ముందుచేయవలసిన కార్యక్రమాన్ని నలునికి ఉద్భోదించాడు.
- ఇంకాఉంది