మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ గూనివాని దేహమా వంకర టింకర అయినట్టిది.
ఈ కురూపి ఒక జవరాలిని వరించడమా? ప్రేమించి విరహతాపంలో విలపించడమా? ఎంత విడ్డూరంగానున్నది? అంతేగాక వీడిచే ప్రేమింపబడిన వనిత వీడికంటే గొప్పదిగాకుండా ఉంటుందా? ఈతడే ఇంత కురూపి అయితే ఇక ఆమె ఎంత కురూపి కావాలి?’’
అని తలపోసిన జీవలుడు ఒకనాడు బాహుకుడి వద్దకు వచ్చి
‘‘బాహుకా! నీవు స్మరిస్తున్న నీ భార్యకూ నీకూ అసలు ఎడబాటు ఎలా కలిగింది. వివరంగా చెప్పుము’’అని అడిగాడు. ఆ మాటలు విన్న బాహుకుడు
‘‘జీవలుడా! నన్నుజూచి నవ్వరా! నా మొగానికి ఒక ప్రేయసి కూడానా? అసలు ప్రేయసే లేనప్పుడు వియోగం అనే మాట ఎందుకుంటుంది? నీవు వినలేదా? పూర్వకాలంలో ఏ కారణంచేత జరిగిందో నాకు తెలియదుగానీ, మందప్రజ్ఞుడు అనే సైనికుడు తన ప్రేయసిని ఎడదబాసి ఆమెకొరకు వెదకి వెదకి, ఆమె కనిపించకపోవడంచేత మిక్కిలి పరితపించినవాడై కలవరించాడు. నేను అతడి ప్రాలాపాలు ఎలా ఉన్నాయో అలా అనుకరించాను. అంతే. ఆ మంద్రప్రజ్ఞుని మాటలు’’అని చెప్పి నలుడు అంతటితో తెలివిగా ముగింపు పలికాడు.
అలా రాత్రింబగళ్ళు దమయంతిని తలచుకొంటూ దుఃఖిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఋతుపర్ణుని భవనమందే అజ్ఞానంగా కాలం గడుపుచున్నాడు నలుడు.
విధివక్రించి అంతటి మహారాజు ఇక్కట్లపాలయ్యాడు. మారుపేరుతో మరొక రాజువద్ద ఉద్యోగం చేయవలసి వచ్చింది.
బాహుకుడిగా చేరిన నలమహారాజు ఒకనాడు జగదేకవీరుడు. భువనైక మోహనుడు. ఇప్పుడు ఇతరులు చూడటానికి కొరగాని కురూపి. ఎంతటి మార్పు. విధిపరిపాకం? ఎంతటి మార్పు వచ్చింది.? సేవకుడి వృత్తిలో ఉన్న జీవలుడికి కూడా బాహుకుడిని చూస్తే జాలి కలుగలేదు సరికదా అపహాస్యం చేశాడు. అలాంటి జీవలుడికి ప్రేమ విషయం ఏమి తెలుస్తుంది. నిజానికి బాహుకుడి భార్య జగదేకసుందరి అన్న సంగతి జీవలుడికి ఏమి తెలుసు? నలదమయంతుల చరిత్రలో ఏర్పడిన మలుపు పాఠకుల గుండెలను సైతం కరగింప చూస్తుంది. కథాశిల్పసౌష్ఠవంలో విశ్వసాహితి జగత్తులో నలోపాఖ్యానికి గల విశిష్టత నిరుపమానమైనది.
***
ఇట్లుండ అక్కడ విదర్భలో భీమరాజు నలమహారాజు రాజ్యాన్ని పోగొట్టుకొన్నాడనీ, కూతురూ, అల్లుడూ ఎక్కడికి వెళ్ళారో? ఎక్కడ ఉన్నారో? అని చింతిస్తూ ఆందోళన పడుతున్నాడు. అతి బలవంతుడైన భీమరాజు తనకు అనురక్తుల, మంచి నడవడిగలవారు, పెద్ద చదువులు చదువుకొన్నవారు అయిన బ్రాహ్మణులను బహుమతులతో సంతృప్తిపరచాడు. మిక్కుటమైన స్నేహంతో నలదమయంతులను వెదకటానికై నియోగించాడు. వారితో
‘‘విప్రోత్తములారా! పెద్దలారా! మీరు నేనప్పగించిన ఈ పనిలో కృతార్ధులై, వారి జాడ తెలిసికొని, వారిని తోడ్కొని వచ్చినట్లయితే వేయి ఆవులను ఇస్తాను. అగ్రహారాలను కూడా ఇస్తాను. నగరంతో సమానమైన గ్రామాన్ని ఇస్తాను. వారిని ఇక్కడికి తీసికొనిరాకపోయినా వారి జాడ తెలిసికొని వచ్చి చెప్పినాసరే వేయి ఆవులను ఇస్తాడు’’అని చెప్పి పంపాడు. బ్రాహ్మణులు అన్ని దిక్కులకూ పయనమయ్యారు.
అలా వెళ్ళినవారు అన్ని దిక్కులకూ వెళ్ళి భూచక్రంలో ఉండే నగరాలను, పట్టణాలను, పెద్ద పల్లెలను, నలదమయంతులకోసం వెదకసాగారు. అయితే ఎక్కడా నలుడుగానీ, దమయంతి గానీ కనిపించలేదు. వారిలో ‘‘సుదేవుడు’’అనే ఒక బ్రాహ్మణశ్రేష్ఠుడు మాత్రం చేది దేశాన్ని ఏలుచున్న వీరబాహుడి కుమారుడైన సుబాహుని రాజధాని నగరం చేరాడు. సుదేవుడు పుణ్యాహం నిర్వర్తించే బ్రాహ్మణులతో కలిసి రాజమందిరంలోనికి వెళ్ళాడు.

- ఇంకాఉంది