మెయిన్ ఫీచర్

ఒత్తిడి వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిపాటి ఒత్తిడే కదాని నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు అది అగ్ని పర్వతమై బద్ధలవుతుంది. ఇటు సామాజిక జీవితాన్ని, అటు ఆరోగ్య ఆనందాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. దేనికైనా పరిమితులుంటాయి. వాటిని బట్టి పోతుంటే ఇంటా బయటా తలెత్తే చిరాకులు, ఒత్తిడులను అధికమించటం కష్టంకాదు.
ఒత్తిడికి గురైనపుడు పుస్తకాలు చదవడం. వ్యాయామం చేయండి. సంగీతం వినండి.. పాడండి.. కళలవైపు ధ్యాస మళ్ళించండి. ఇష్టమైన పనులు చేయండి. చెట్లు పెంచండి. పెద్దలతోనూ, పిల్లలతోనూ కాలక్షేపం చేయండి. చదువుకొనే పిల్లలతో అంత్యాక్షరి ఆడుకోండి. క్విజ్‌లు వినోదాలతో కూడిన ఎలాంటి మంచి అలవాట్లయినా ఒత్తిడిని తగ్గించేవే. హాబీ ఏదైనా సరే మన మనసుకు ఉల్లాసం కలిగించేలా ఉంటే చాలు. అదే పదివేలు.
‘‘ఏంటి! వీడింకా నిద్రలేవలేదా.. పనిమనిషి అంతులేదు.. ఓవైపు టైం అయిపోతుంది.. ఆదివారం కాస్త పాదరసంలా చేతుల్లోంచి జారిపోయింది. ఈయన కూడా ఇంతే.. టైం ఆరు గంటలయినా కుంభకర్ణుడిలా ఇంకా గుర్రునిద్ర. ఇవాళ అసలే బోలెడు పనులు. ఒక్క పని కూడా కాలేదు’’- ఇలాంటి అవధాన ప్రక్రియ ప్రతి ఇంట్లోనూ ప్రొద్దునే్న కనిపించే సాధారణ దృశ్యం.
తల్లిగా, భార్యగా, ఇంటి మనిషి, పనిమనిషి, వంటమనిషిగా అవతారాలెత్తి.. ఇలా అన్ని పాత్రల్ని సమర్థవంతంగా పోషిస్తూ ఇటు ఇల్లు అటు ఆఫీసు చక్కబెట్టుకొస్తున్న మహిళల చాకచక్యానికి నిజంగా జోహార్లు. అయితే, ఈ క్రమంలో ఎన్నో ఒత్తిడులు.. మానసికంగా ఆందోళనలు. భర్తకు చేదోడు వాదోడుగా ఉద్యోగం, వ్యాపారం, ఆఫీసు ఏదోక పని వెతుక్కుని సంసారం సాగరాన్ని ఈదుకొస్తున్నారు.
తలకు మించిన పనులతో చాలామంది మహిళలు ఆర్థికంగా అలా ఉంచి శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నో ఆందోళనలతో అనారోగ్యానికి గురౌతున్నారు. చీకు, చింత, చికాకులతో సతమతమవుతున్నారు. సరిగ్గా ఇలాంటప్పుడే వీరికి సరైన సలహాలు ఎంతో అవసరం.
ఏదైనా సమస్య వచ్చినపుడు, చికాకు కలిగినపుడు ధైర్యం చెప్పే స్నేహితులు, కుటుంబంలో తలెత్తిన మానసిక సమస్యలకు బెదిరిపోకుండా తోడుగా నిలబడే ఆత్మీయులు, కుటుంబ సభ్యులుంటే చాలు. ఇంకేమి అక్కరలేదు. పిల్లల చికాకులు, భర్త లేదా అత్తమామలతో అప్పుడప్పుడు వచ్చే మనస్పర్థల తాలూకు సెగ ఏదీ కూడా తమను తాకకూడదన్నది ఎందరో మహిళల మనోగతం. మంచి సహచరులు, శ్రేయోభిలాషులుంటే ఇవన్నీ మటుమాయమై మనకు కొండంత అండగా నిలుస్తారనిపించేది అంగీకరించాల్సిందే.
ఎంత పని భారమున్నా, మోయగల్గిన మహిళలు ఇంట్లో పోరును మాత్రం భరాయించలేరు. దీంతో సతమతమవుతారు. కుటుంబ సమస్యలతో, మనస్పర్థలతో మహిళలు ఆందోళనకు గురై ఒత్తిడులతో కొట్టుమిట్టాడుతుంటారు.
ఇంట్లో పెద్దవాళ్ళుంటే పిల్లలను నిశ్చితంగా వదిలేసి బయట క్యాంపులకైనా వెళ్ళవచ్చు అనుకునేవారికి కొన్ని సందర్భాల్లో చికాకులు తప్పవు. వాళ్ళ ఆరోగ్య సమస్యలతోపాటు ఉచిత సలహాలతో తలనొప్పి వచ్చిపడే ప్రమాదమూ ఉంది. అందుకే బాగా సహకరించగలిగిన కుటుంబ సభ్యులు, భర్త ఉంటే చాలు. ఎన్ని ఒత్తిడులునైనా ఎదుర్కోగలరు. అలా కాకుండా ఇంటి పోరు ఇంతింత కాదయా.. అన్న చందంగా ఉంటే నిత్యం ఆ మహిళకు చికాకులే.. చెప్పుకోలేని వ్యధలే. పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా భర్త, ఇంట్లో పెద్దలు నడుచుకుంటే ఇలాంటి ఇబ్బందులుండవు.
కొంతమంది మహిళలు ఎన్ని ఒత్తిడులు చుట్టుముడుతున్నా తొణకరు. అన్నిటినీ సమన్వయపరచుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. కానీ, కొందరుంటారు, తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళనేవారు. అంటే.. ప్రతి పనీ తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలనుకునేవారు. సరిగ్గా ఇలాంటివారికే ఇబ్బందులు తప్పవు. వారు అనుకున్నవి ఏవీ జరగనప్పుడు మానసిక ఒత్తిడికి గురౌతారు. అధికంగా ఇంటి పనులతో పాటు ఉద్యోగ రీత్యా బాధ్యతలతో కూడినవారు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక లక్ష్యంతో ఉన్నత స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగినులు క్రింది ఉద్యోగులను సమన్వయం చేసుకోలేక, కోఆర్డినేషన్ లోపం కారణంగా అంటే లౌక్యం నేర్చుకోక తన మాట వినడం లేదని ధోరణిలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. నిత్యం ఇలా.. ఆందోళనలు పడుతూ ఓర్పు, నేర్పు లేక కోపం ప్రదర్శిస్తుంటారు. అలా నిత్యం మానసిక ఒత్తిడులకు గురవుతూ చివరికి బీపీలు, షుగర్లు లాంటి అనారోగ్యాలను కోరి తెచ్చుకుంటారు.
అందుకే ప్రతిదానికీ పరిమితులుంటాయి. వాటిని బట్టి పోతుంటే ఎలాంటి చికాకులు కలగవు. ఎంతటి ఒత్తిడినైనా అవలీలగా అధిగమించవచ్చు. ముందు మహిళలు లౌకికం నేర్చుకోవాలి. భూదేవికున్న ఓర్పును ప్రతి మహిళ గుర్తుంచుకోవాలి.
కొందరు పొగడ్తలకు లొంగిపోయి కొన్ని సమస్యలు కోరితెచ్చుకుంటారు. ఎవరేది అడిగినా వెనుక ముందు ఆలోచించకుండా సరేననడం, తర్వాత ఆ పని చేయలేక నానా తంటాలు పడుతుంటారు. ఇది ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఎందుకంటే.. గొప్పలకు పోయి ఇబ్బందులు పడకూడదు.
అంత్య నిష్ఠూరంకన్నా ఆది నిష్ఠూరం మేలన్న చందంలా ముందే చాచక్యంగా చేయలేని పని నుంచి తప్పించుకోవడం అత్యుత్తమం. ఏదైనా చేయగలిగిందే చేయాలి. తలకు మించిన భారం పెట్టుకోవద్దు.
ఒక పనిలో నిబద్ధత అవసరమే. కుటుంబ విషయంలోగాని, ఉద్యోగ నిర్వహణలోగాని బాధ్యతలు తప్పవు. నియమ నిబంధనలు, నియంత్రణలు, కట్టుబాట్లు, సంప్రదాయాలుంటాయి. ఇవన్నీ ఓర్పుతో, నేర్పుతో లౌక్యంతో సమన్వయం చేసుకొంటూ ముందుకెళ్లాలి. అంతేగాని మన పరిధిలో లేని సంబంధం లేని విషయాలపై ఎలాంటి పరిస్థితిలో దృష్టి పెట్టకూడదు. సమన్వయం లోపించినపుడు, ఆ పని విషయంలో తెగేదాకా లాగకూడదు. రోజులు మారుతున్న కొద్ది మనలోనూ మార్పులు రావాలి. దేన్ని గురించి అదేపనిగా ఆలోచించకూడదు. సాధ్యమైనంతవరకు ఎక్కడి విషయాలను అక్కడే వదలివేయాలి. వాటిని మరిచిపోవడానికి ప్రయత్నించాలి. బయట విషయాలు ఇంటికి, ఇంటి విషయాలు బయటకు పోనీయకూడదు. ఇలాంటివాటితో కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు.
అలాగే, ఇంట్లో చికాకులు, ఇబ్బందులూ ఉన్నా అవి మీరు చేసే పనిమీద ప్రభావితం చూపేలా ఉండకూడదు. మనోనిబ్బరం ఉంటే ఏ సమస్యా మనల్నేమీ చేయవవు. మీరు చేసే పనిని నిశ్చయంగా, ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగకుండా చేయండి. ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే, ఎక్కడ చేయాల్సిన పనులను అక్కడే చేసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవు. మానసికంగా శారీరకంగా మీపై బడిన ఒత్తిడులను తగ్గించుకోవచ్చు.
వృత్తిమూలంగా, ఇంటి సమస్యలు కారణంగా తలెత్తే ఒత్తిడిని తట్టుకోవాలంటే మనం ఆసక్తిగా చేసే కొన్ని హాబీలే చక్కటి పరిష్కారాలు. వీటివల్ల కూడా ఒత్తిడిని తేలిగ్గా అధిగమించవచ్చు. ఈ విషయాలను చాలామంది గమనించకుండా ‘ఇంకా ఇలాంటి హంగులకు సమయమెక్కడా...’ అంటూ నిరాశగా దీర్ఘాలు తీస్తుంటారు. పుస్తక పఠనం, వ్యాయామం, సంగీతం, కుట్టు, అల్లికలు, చెట్లు పెంచడం, పిల్లలతో అంత్యాక్షరి, క్విజ్‌లు, వినోదాలతో కూడిన ఎలాంటి మంచి అలవాట్లయినా, హాబీ ఏదైనా సరే మన మనస్సుకు ఎంతో ఉల్లాసం కలిగిస్తుంది. అంతేకాదు మానసిక, శారీరక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మనసుకు ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి.
తల్లిగా, భార్యగా, భర్తకు చేదోడు వాదోడుగా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకోవడానికి, కుటుంబాన్ని చక్కబెట్టడానికి హాబీలు కూడా దగ్గరయితే మీ సామర్థ్యాన్ని స్థైర్యాన్ని ఎంతో పెంచుతుంది. ఒత్తిడులను అధిగమించి జీవితాన్ని ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా గడపగలుగుతారు. మీరేగాదు ఇంటిల్లిపాది ఆనంద డోలికల్లో తేలియాడుతారు.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660