మెయన్ ఫీచర్

హిమవన్నగ ప్రాంతానికి వనె్న తేవాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలబడుతోంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఇటీవల జీఎస్‌ఎల్‌వీ మార్క్-3-ఎం-1 వాహక నౌక దూసుకెళ్ళగా.. చంద్రయాన్-2 కల సాకారమవుతుండగా కోట్లాది భారతీయుల గుండెలు ఉప్పొంగాయి. దేశ ప్రజలంతా గర్వంతో కరతాళ ధ్వనులు చేశారు.
అమెరికా చంద్రునిపైకి తమ వ్యోమగాములను దింపి అర్ధ శతాబ్దం పూర్తయిన సందర్భంలో భారత్ ఈ ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రాజెక్టును చేపట్టింది. అమెరికా సైతం సాధించని ఘనతను చంద్రయాన్-1 సాధించిందని, చంద్రునిపై నీరు ఉన్న సంగతి ప్రపంచానికి తొలిసారి చాటి చెప్పింది మనమేనని మరువరాదు. నీటి జాడలే గాక మరిన్ని రహస్యాలను ఛేదించేందుకు, పరిశోధనలు జరిపేందుకు ఇప్పుడు చంద్రయాన్-2 సిద్ధమైంది.
చైనా, రష్యా, ఐరోపా దేశాల సమాఖ్యలు సైతం తమ పాదముద్రలు చంద్రుడిపై వేసేందుకు సిద్ధమవుతున్నాయి. పరిశోధనా కేంద్రాలను నెలకొల్పేందుకు ఉవ్విళ్ళూరుతున్నాయి. 2024 సంవత్సరంలో అమెరికా చందమామపై తొలి మహిళను దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనా, రష్యాలు ఈ విషయమై ఎంతగానో పోటీపడుతున్నాయి.
అమెరికా పారిశ్రామికవేత్త ఇవాన్ మస్క్‌కు చెందిన స్పేస్-ఎక్స్ సంస్థ సైతం చంద్రుని కక్ష్యలోకి పర్యాటకుల్ని తీసుకెళ్ళేందుకు సిద్ధపడుతోంది. ఈ ఊపు, ఉత్సాహం దేన్ని సూచిస్తోంది..? మానవుని జిజ్ఞాసను, జ్ఞానాన్ని, గమ్యాన్ని ఏర్పరచుకుని దాన్ని ముద్దాడే తత్వాన్ని... ఈ ‘గుణం’తోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వచ్చే సంవత్సరం ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నది. సూర్యుని ఉష్ణోగ్రతల వద్ద ఉన్న ‘కరోనా’ గుట్టును తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ ఆదిత్య-ఎల్ 1. అంతేనా..? కాదు మంగళయాన్-2ను సైతం త్వరలో ప్రయోగించనున్నది. గగన్‌యాన్ పేర వ్యోమగాములను రోదసిలోకి పంపే కార్యక్రమాన్ని ‘ఇస్రో’ చేపట్టనున్నది.
హైదరాబాద్‌కు చెందిన ‘అనంత్ టెక్నాలజీస్’ సంస్థ ‘ఇస్రో’కు గత పాతిక సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం చంద్రయాన్-2కు సైతం ఆ సంస్థ సేవలు అందించడం గమనార్హం. అమెరికాలోని స్పేస్-ఎక్స్ మాదిరి భారతదేశంలోనూ ప్రైవేట్ రంగంలో అంతరిక్ష రంగంలో విశేష కృషిచేస్తున్న సంస్థల్లో ఈ ‘అనంత్ టెక్నాలజీస్’ ఒకటి.
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడంలో మహిళల పాత్ర కీలకమని తెలిసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. వీరిలో శ్యామా నరేంద్రనాథ్, మేఘాభట్‌లు ఉన్నారు. వీరితోబాటు మరెందరో మహిళా శాస్తవ్రేత్తలు కృషి ఆ విజయంలో తొంగి చూసింది. దీన్లో ఆధునిక కంప్యూటర్ల, సూపర్ కంప్యూటర్ల పాత్ర గణనీయంగా ఉందనే మాట విస్మరించరాదు.
పైథాన్ లాంగ్వేజి...
ఇప్పుడు ప్రపంచమంతా ‘కృత్రిమ మేధ’లో తలెత్తే సమస్యల పరిష్కారానికి గాని ‘పైథాన్’అనే కంప్యూటర్ లాంగ్వేజిని ఉపయోగిస్తున్నారు. ఈ పైథాన్‌లో శిక్షణ పొందే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో చాలామంది అటువైపు అడుగులు వేస్తున్నారు. వీరిలో భారతీయులు అందులోనూ హైదరాబాదీయుల సంఖ్య గణనీయంగా ఉండటం విశేషం. బహుళ ప్రయోజనాలున్న ఈ కంప్యూటర్ భాషను నేర్చుకోవడమంటే భవిష్యత్‌ను భద్రపరచుకోవడమే! అమెరికా, బ్రిటన్‌కు చెందిన కంప్యూటర్ నిపుణులు సైతం ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌లోని పైథాన్ లాంగ్వేజ్ నిపుణుల నుంచి నేర్చుకుంటున్నారని వినికిడి. ఈ లాంగ్వేజి సబ్జెక్టును ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరంలో చేర్చారు. దీనిపై అవగాహన పెంపొందించేందుకు సదస్సులను సైతం నిర్వహిస్తున్నారు.
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వచ్చే ఏడాది నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో మరింత వేగం పెరగనున్నది. అందుకనుగుణంగా మానవ వనరులను తయారుచేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగా ఖరగ్‌పూర్ ఐఐటీ చొరవ తీసుకుని హైదరాబాద్ సహా వివిధ ప్రధాన నగరాల్లో ఏఐ కోర్సులను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రైవేట్ రంగంలోనూ ఈ కోర్సులు కొనసాగుతున్నాయి. ఖరగ్‌పూర్ ఐఐటీ అందించే ఈ కోర్సు తరగతులు వారాంతాల్లో జరుగుతాయని, కొన్ని తరగతులు ఆన్‌లైన్‌లో కొనసాగుతాయని తెలుస్తోంది. ఇందులో గణితం, అల్గారిథం, కృత్రిమ మేధ, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ తదితర అంశాలను బోధించనున్నారు.
సరికొత్త స్మార్ట్ఫోన్...
శక్తివంతమైన స్మార్ట్ఫోన్ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ సంస్థ నోట్ 10, నోట్ 10 ప్లస్ పేర రెండు వెర్షన్లను విడుదలచేస్తోంది. ఈ ఫోన్లు 5జి నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. సత్య నాదెళ్ళ నాయకత్వంలోని మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో శామ్‌సంగ్ ఈ ఫోన్లను రూపొందించడం గమనార్హం. స్మార్ట్ఫోన్‌తోపాటు పలుచని గెలాక్సీ నోట్‌బుక్ కంప్యూటర్‌ను సైతం ఆ సంస్థ ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించింది.
స్మార్ట్ఫోన్ నోట్-10, గెలాక్సీ నోట్‌బుక్ ఇవి రెండు వర్తమాన జీవన శైలిపై ప్రభావం చూపగలవని భావిస్తున్నారు. ఆధునిక యుగంలో స్మార్ట్‌పోన్ మానవ జీవితాన్ని, జీవన విధానాన్ని మార్చుతుందని గతంలో ఎవరూ ఊహించలేదు. కాని వర్తమానంలో ఆ ‘దృశ్యం’ కళ్ళకు కడుతోంది. ప్రపంచం మొత్తం ఒదిగిపోయి స్మార్ట్ఫోన్‌లో కనిపిస్తే, మానవ మేధ... కృత్రిమ మేధ ఆధారంగా మానవాళికి సౌకర్యవంతమైన, మేలైన జీవన శైలిని అందిస్తుంటే ఎవరైనా అందుకోకుండా ఎలా ఉండగలరు? ఇప్పటివరకు చూసిన స్మార్ట్ఫోన్‌కు పరాకాష్ఠగా ఈ శ్యామ్‌సంగ్ నోట్ 10ప్లస్ నిలుస్తుందని భావిస్తున్నారు. 5జి వేగంతో ఆ సౌకర్యాలు అరచేతిలోకి వస్తే ఇక కావలసిందేమిటి? ఆ ఫోన్ సెన్సార్లు, కెమెరా ఇలా రకరకాల ఆధునిక సాంకేతికతకు చిహ్నంగా నిలుస్తోంది. ఇలా భూగోళంలోనేగాక అంతరిక్షంలో ‘మనం’ సత్తాచాటుతున్నప్పుడు ఆ సత్తాలో జమ్మూ-కశ్మీర్, లద్దాక్ ప్రజల భాగస్వామ్యం ఉండాలి కదా? అందుకోసం అడుగులు పడటాన్ని అందరు ఆహ్వానించాలి కదా? ఆ హిమవన్నగ ప్రాంతానికి వనె్నతేవాలి కదా?...

-వుప్పల నరసింహం 99857 81799