మెయన్ ఫీచర్

అవును.. మోదీ మొనగాడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోజు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌కు నిద్రపట్టి ఉండదు. అన్నం కూడా ముట్టి ఉండడు. సరిగ్గా 12 రోజుల క్రితం ఈ ముష్కరమూకల నేత ఏమన్నాడు? ‘్భరతీయుల శూరత్వం బాలీవుడ్ చిత్రాలకే పరిమితం. సినిమాల్లో భారత్‌ను తిరుగులేని శక్తిగా, పాక్‌ను బలహీనమైన దేశంగా చిత్రీకరిస్తారు. ఆ హీరోలు వారి నీడను చూసి వారే భయపడుతుంటారు. వారి ఒంటి నిండా ఉత్తి గ్యాసే ఉంటుంది. సినిమాల్లో మాత్రం పాక్‌పై దాడి చేసినట్లు, క్యాంపులు ధ్వంసం చేసి ముజాహిదీన్లను పట్టుకున్నట్లు చిత్రీకరిస్తారు’ అని వాక్రుచ్చాడు కదా?! 12రోజుల తర్వాత ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో పాక్ లాగులు తడిసిపోయాయి. ఒక మంత్రి ప్యాంటే జారిపోయింది. కేవలం నాలుగున్నర గంటల నిర్దేశిత యుద్ధంతోనే భారత్ తమ దేశానికి చెమటలు పట్టిస్తుందని అజహర్ ఊహించి ఉండడు.
ఒక్క అజహరే కాదు. మోదీ వౌనం, సర్కారు ఊగిసలాట చూసి ఎవరూ పాక్‌పై కాలుదువ్వుతామని ఊహించి ఉండరు. అంతెందుకు? భాజపాకు మిత్రపక్షమే అయిన శివసేన కూడా ఊరీ ఉగ్రవాద దాడి అనంతరం మోదీ మెతక వైఖరిపై పెదవి విరిచింది. రెండు డజన్ల మంది శివసేన సైనికులు ఆత్మాహుతి దళాలుగా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు జాబితా కూడా ప్రకటించింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోకుండా మాటలతో సరిపెడుతోందన్న శివసేన నేతలు.. పీఓకెపై భారత జవాన్ల దాడి తర్వాత నాలుక్కరుచుకుని ఉండాలి. ఊరీ ఘటన తర్వాత పాక్‌కు ఇండియా ఎలాంటి శిక్ష విధిస్తుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోందన్న శివసేన కోరికను మోదీ నెరవేర్చారు కూడా!
నిజానికి ఊరీ సైనిక శిబిరంలో అలసిపోయి సేద తీరుతున్న భారత సైనికులపై పిరికిపందలా దొంగ దెబ్బ తీసిన పాక్‌పై యావత్ భారతావని ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. సర్కారు వౌన వ్రతాన్ని చేతకానితనం, మితిమీరిన సహనంగానే భావించింది. 10 రోజులు కూడా గడవకముందే, ప్రపంచం అంతా గాఢ నిద్రలో ఉండి, తెల్లారకముందే పాక్‌ను దెబ్బకు దెబ్బ తీస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. అది ప్రజల తప్పు కాదు. ఇప్పటివరకూ జరిగిన అవమానకర, ఉత్తరకుమార అనుభవాలు అలాంటివి!
దశాబ్దాల నుంచి పాక్ కవ్వింపు చర్యలతోపాటు, కొందరు భారత సైనికుల మృతదేహాలను మనకు బహుమానంగా అప్పగిస్తూ, హైదరాబాద్ వంటి నగరాల్లో బాంబుదాడులతో అమాయకులను విగతజీవులుగా చేస్తున్నా, సరిహద్దులో దాడులు చేస్తున్నా, మన పాలకుల నుంచి తగిన జవాబు లేకపోవడం ‘మన బుద్దులు యుద్ధంతో సమాధానం చెప్పర’న్న నిశ్చితాభిప్రాయం కలిగించింది. పార్లమెంటులోకి దూసుకుని వచ్చి సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసినా మన నెత్తురు మరగలేదు. శక్తులు ఉరకలేదు. ముంబయి దాడులు చేసిన ముష్కర ముఠాలున్న దేశంపై తెగబడాలన్న ఆలోచన లేకపోగా, పట్టుబడిన ఉగ్రమూకలకు పొట్టపగిలేలా బిర్యానీలు పెట్టి, విచారణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, చచ్చు పుచ్చు సమీక్షలతో కాలం గడిపిన అసమర్థ నాయకత్వం మనది. ఏడాది పొడవునా దేశంలో ఎక్కడో చోట, పాక్ పుట్టించిన ఉగ్రవాద రాక్షసుల విషచర్యలకు వందలమంది నేలకొరుగుతున్నారు. సైనికులు అమరులవుతున్నా మన పాలకుల్లో చీము, నెత్తురూ కనిపించలేదు. ఒకరకంగా పాక్‌కు, అది విషం పోసి పోషించే కిరాతక మూకలకు మనమంటే అలుసయింది కూడా అందుకే!
మోదీ కూడా అదే బాపతు అనుకున్న దేశ ప్రజల అనుమానాలు, పాక్ అక్రమ సంతానమైన ఉగ్రవాద ముఠా ధీమాను దేశ ప్రధాని నిశ్శబ్దంగానే తిప్పికొట్టి తానేమిటో చేతల్లో చూపించారు. మునుపటి రాజకీయ నాయకత్వం మాదిరిగా, నత్తలనూ ఈర్ష్యపరచకుండా చేయాల్సిన పనిని నాలుగున్నర గంటల్లో ముగించి దెబ్బకు దెబ్బ తీసి, భారతజాతి సత్తాను ప్రపంచానికి చాటారు.
నిజం చెప్పాలంటే ఇది ప్రపంచమంతా గాఢనిద్రలో ఉన్నప్పుడు జరిగిన నిశ్శబ్ద యుద్ధమైనా, ప్రపంచానికి దేశం చేసిన బహిరంగ హెచ్చరిక లాంటిదే! ఇది మోదీ పనితీరు, దేశం పట్ల బిజెపికి ఉన్న చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం. లేకపోతే.. ఎప్పుడూ మోదీని విమర్శించడమే జీవితలక్ష్యంగా పెట్టుకుని, మసాజులు, రిట్రీట్ల పేరుతో దేశం పట్టకుండా విదేశాలకు తిరుగుతూ, పార్లమెంటులో కూడా సుఖనిద్ర పోయే విలాస పురుషుడయిన రాహుల్ గాంధీ లాంటి వాళ్లు కూడా మోదీ మంచిపని చేశారని కీర్తించరు కదా?!
ఊహలను పటాపంచలు చేయటం, అంచనాలను తారుమారు చేయటం మోదీకి కొత్తేమీ కాదు. 2014 మేలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాక్ ప్రధాని నవాజ్‌ని ఆహ్వానించి విస్మయపరిచారు. శత్రువు తనను ఆహ్వానిస్తారని బహుశా నవాజ్ కూడా ఊహించి ఉండరు. రష్యా నుంచి తిరిగివస్తూ ఆఫ్ఘన్ మీదుగా లాహోర్ వెళ్లి షరీఫ్ మనుమరాలి పెళ్లి విందులో పాల్గొని మరింత షాక్ ఇచ్చారు. అదొక దౌత్య చతరుత! ఈ ఏడాది చివరలోగానీ- పారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించేది లేదని చైనా జీ-20 సదస్సులో చెప్పి, అంతలోనే ఒబామా కోసం ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు వెల్లడించి తనలోని దౌత్య వ్యూహకర్తను ఆవిష్కరించారు. పాక్‌లో జరగనున్న సార్క్ దేశాల సదస్సును బహిష్కరిస్తున్నట్లు మోదీ ప్రకటించాక శ్రీలంక, బంగ్లాదేశ్ సహా అన్ని దేశాలూ బహిష్కరిస్తాయని ఎవరైనా ఊహించారా? ఒక్క ఆసియా దేశాలే కాదు. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా భారత్‌కు దన్నుగా నిలిచించి. ఇండియాపై పాక్ చేసే కుట్రలకు కనిపించని సాయం చేస్తున్నా, పాక్‌కు బహిరంగ మద్దతునీయలేని పరిస్థితిని చైనాకూ కల్పించారు. ఇది పాక్‌ను దౌత్యపరంగా వెలివేయించడమే. నిత్యం పాక్ చిమ్మే కాలకూట విషానికి బలవుతున్న బలూచిస్తాన్ కూడా ‘్భరత్ ఏది చేస్తే అదే రైట’ని కితాబు ఇచ్చింది.
గతంలో ప్రతిపక్షాలు మోదీయిజం అమలుచేస్తున్నారని, నియంతగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించేవి. అవును! ప్రపంచంలో భారత్‌ను అద్వితీయ శక్తిగా మార్చాలన్నా.. పాక్ వంటి విషనాగులను గద్దలా రక్కేయాలన్నా ఇప్పుడు అలాంటి మోడీయిజం, నియంతృత్వం కావాల్సిందే. ఈ సమయంలో భారత్‌కు కావలసింది గుజరాత్ గాంధీ కాదు, గుజరాత్ మోదీ! ఇది జాతి నిశ్చితాభిప్రాయం. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నట్లు మోదీ చెప్పిందే చేస్తున్నారు.
ఎవరు ఎన్ని వక్రభాష్యాలు చెప్పినా, ఎంతమంది కుహనా లౌకిక మేధావులు వంకరమాటలతో వెక్కిరించినా మోదీది హీరోయిజమే. ఒకరకంగా పేరులోనే తప్ప ఆచరణలో కనిపించని అన్ని జాతీయ రాజకీయ పార్టీలను మోదీ ‘జాతీయబాట’ పట్టించారు. యుపిలోని మొరాదాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఊరీ ఘటన వ్యతిరేక ర్యాలీలో,కొందరు కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాంటి ‘కాంగ్రెస్ ఉత్తరాధికారి’ రాహుల్‌కు ఇప్పుడు మోదీని కీర్తించాల్సిన అనివార్య పరిస్థితి! బిజెపి వ్యతిరేక ధోరణిని పోగొట్టుకోలేనంతగా నరనరాన జీర్ణించుకున్న వామపక్షాలు సైతం మోదీకి బాసటగా నిలవడం, ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేస్తానని నిర్భీతిగా ప్రకటించిన మజ్లిస్ నేత కూడా పాక్ దాడిని ఖండించి, భారత్‌కు బాసటగా నిలుస్తామని ప్రకటించడం నిస్సందేహంగా మోదీ విజయమే. పీఓకెలో భారత దళాలు చొచ్చుకుపోయి 38 మంది ఉగ్రవాదుల కుత్తుకలు కత్తిరించిన వైనాన్ని స్వాగతిస్తూ, వేలాది ముస్లింలు మసీదుల వద్ద పండుగ చేసుకుని, పాకిస్తాన్ జెండాలు కాల్చిన దేశభక్తి దృశ్యాలను జాతి మునె్నన్నడయినా దర్శించిందా?
ఇలా పార్టీలకు, వాదాలకు, మతాలకు అతీతంగా భారత జవాన్లకు బాసటగా నిలిపేలా చేసిన మోదీ నాయకత్వ సమర్థతకు భారతజాతి సెల్యూట్ చేయడంలో తప్పేమీలేదు. బహుశా.. దేశభక్తి లేశమాత్రమైనా లేని కొన్ని శక్తుల మోదం పొందిన నేత మోదీ ఒక్కరేనేమో! పాక్‌ను దెబ్బకుదెబ్బ తీసిన తర్వాత కోట్లాదిమంది నోటి నుంచి వచ్చిన ఒకే మాట.. భారత సత్తాను దిగ్దిగంతాలకు చాటిన మోదీ లాంటి మొనగాడు ఇంతకుముందు లేకపోయెనే అని!
‘మంత్రికి తెలివుండాలి. బంటుకు భక్తి ఉండాలి. గుర్రానికి వేగం ఉండాలి. ఏనుగుకు బలం ఉండాలి. సేనాధిపతికి వ్యూహం ఉండాలి. సైనికుడికి తెగింపు ఉండాలి. యుద్ధంలో నెగ్గాలంటే వీళ్లందరి వెనుక కసి ఉన్న ఒక రాజు ఉండాలి. రాజంటే కిరీటం, కోట, పరివారం కాదు. రాజంటే ధైర్యం. రాజంటే ధర్మం, రాజంటే యుద్ధం’ భారత ప్రభుత్వ ప్రతీకార దాడి తర్వాత అందరికీ తెలిసొచ్చించి ఇదే!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144