మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడెవడో? ఎక్కడున్నాడో? తెలిసికోవాలి.
బ్రాహ్మణోత్తములారా! మీరన్న మాటలకు ఎవరైనా సమాధానమిస్తే అటువంటివారి మాటలు నాకు తెలియజేయండి. మీ మాటలకు సమాధానమిచ్చే వ్యక్తికి మీ గురించి తెలియకుండా మీరు జాగ్రత్తపడి, ఎలాంటి తొట్రుపాటు లేకుండా తిరిగి రండి. అతడు ధనికుడా, పేదవాడా, అసమర్థుడా తెలిసికొని అతడేమి చేయదలచినాడో తెలుసుకోవాలి’ అని
దమయంతి చెప్పిన మాటలన్నీ విని బ్రాహ్మణులు వ్యసనపరుడైన నల మహారాజును వెదకటానికై నలుదిక్కులకు వెళ్ళారు. సభలలో, పట్టణాలలో, గ్రామాలలో, పల్లెలలో, ఆశ్రమాలలో నలునికోసం గాలించారు. దమయంతి చెప్పిన మాటలను యధాతథంగా అక్కడక్కడా పలికారు. అయినా ఫలితం దక్కలేదు. నలుని జాడ కానక తిరిగి వచ్చారు.
***
అలా నలుని కొరకై వెదకటానికై వెళ్ళిన బ్రాహ్మణ సమూహంలో ‘‘పర్ణాదుడు’’ అనే ఒక బ్రాహ్మణుడు మాత్రం ‘అయోధ్యా నగరానికి’ వెళ్ళాడు. అచ్చట పర్ణాదుడు ‘ఋతుపర్ణుడి సభలో దమయంతి చెప్పిన మాటలు పలికాడు. అక్కడ ఒక కురూపి, కురుచ చేతులవాడు, ఋతుపర్ణుడి వద్ద వంద గద్యాణాల వేతనంతో పనిచేసే సేవకుడూ, వంటలు చేయటంలో నేర్పరీ, గుర్రాలకు శిక్షకుడిగాఉన్న ‘బాహుకుడు’అనేవాడు పర్ణాదుడి మాటలు విన్నాడు.
ఋతుపర్ణుడు కూడా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. సభాసదుల్లో ఒక్కడు కూడా మాట్లాడలేదు. అయితే బాహుకుడు అనే అతడు పర్ణాదుడిని రహస్యంగా కలిసి ముచ్చటించాడు.
పర్ణాదుడు తిరిగి విదర్భకు వచ్చాడు. దమయంతిని కలిసి ఆమెతో
‘‘అమ్మా దమయంతీ! నల మహారాజు జాడ కనిపెట్టడానికై నేను అయోధ్యానగరానికి వెళ్ళాను. అక్కడి రాజు ఋతుపర్ణుడు. అతని దగ్గరకు వెళ్ళాను. ఆ ఋతుపర్ణ మహారాజుగారి సభలో మీరుచెప్పిన మాటలన్నిటిని యధాతథంగా వినిపించాను. ఎన్నోసార్లు నేను ప్రస్తావించినా ఆ ఋతుపర్ణ మహారాజు ఏమీ మాట్లాడలేదు. ఆ సభాసదుల్లో ఒక్కడుకూడా నాతో మాట్లాడలేదు.
అయితే రాజపరివారంలో ఉన్న ఒక కురూపి, కురుచ చేతులు కలవాడు, సేవకుడు వంటలు చేయడంలో నేర్పరి, రాజుగారి అశ్వాధ్యక్షుడిగా వేతనంపై పనిచేస్తున్న బాహుకుడు అనే పేరుగలవాడు, నా మాటలు విని అనేకసార్లు నిట్టూర్చాడు. రహస్యంగా నన్ను కలిసికొని నిట్టూర్పులు వెదజల్లుచూ చాలా క్షేమ సమాచారాలను అడిగి తెలిసికొన్నాడు.’’
నాతో ఇలా పలికాడు ‘‘కుల స్ర్తిలు ఎన్ని కష్టాలు సంభవించినా, ధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు. వాటిని రహస్యంగానే ఉంచుతారు. ఎవడు తన్నుతాను జయించగల్గుతాడో అతడు స్వర్గాన్ని జయించినవాడైతాడు. సందేహం లేదు. ఉత్తమ స్ర్తిలు భర్త వియోగం పొందినాకోపించరు. తమ ప్రాణాలను కవచంగా తమ సత్ప్రవర్తను ధరిస్తారు.’’
మగడియందు తప్పులుంటే తెలిసియుండి కూడా సైరించే భార్య ఎప్పుడైనా ఇహలోకంలో భర్తనుండి తాను కోరిన సౌఖ్యం తప్పక పొందుతుంది. ఆ పుణ్యంవలన మరుజన్మలో కూడా పుణ్యాన్ని పొందగలదు.’’
ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ పక్షులచే వస్త్రాలు అపహరింపబడి మనోవ్యధతో ఉన్న ఆ భర్త విషయంలో భార్య కోపగించటం భావ్యంగాదు.’’
భర్త తనను గౌరవించినా, గౌరవించకపోయినా రాజ్యభ్రష్టుడైనా, దరిద్రుడైనా ఆర్తుడైనా, వ్యసనపరుడైనా, జూదపరుడైనా, భార్య ఎట్టి పరిస్థితులలోనూ కోపాన్ని చూపరాదు.’’
అని ఆ బాహుకుడు పై మాటలను చెప్పి తదుపరి వౌనం వహించాడు. తాను నివసించినచోటికి వెళ్ళిపోయాడు. బాహుకుని మాటలు విని నేను త్వరితగతిన ఇక్కడికి వచ్చాను.
- ఇంకాఉంది