మెయన్ ఫీచర్

అయోధ్య వివాదానికి ఇక భరతవాక్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలో చిరకాలంగా కొనసాగుతున్న ‘రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాని’కి భరతవాక్యం పలికేందుకు సర్వోన్నత న్యాయస్థానం సిద్ధపడింది. వచ్చే నవంబర్ 17న ఈ వివాదంపై తుది తీర్పు ఇస్తామని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృతస్థాయి సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 1,480 గజాల స్థలం కోసం శతాబ్దాలుగా ‘మందిర్-మసీదు వివాదం’ కొనసాగుతోంది. ఈ వివాదాస్పద స్థలానికి సంబంధించి విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 1528లో బా బర్ రాకతో రామమందిరాన్ని కూల్చివేశారనేది ఒక కథనమైతే, ముంబయిలోని పురావస్తు గ్రంథాలయంలో లభించిన అముద్రిత గ్రంథాల ఆధారంగా చూస్తే రామమందిరాన్ని క్రీస్తు పూర్వం 1426లోనే కూల్చేశారన్న ప్రచారం ఉంది. అంటే దాదాపు 3,445 ఏళ్లుగా ఈ వివాదం ఉంది.
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. 2010లో అలహాబాద్ హైకోర్టు నాలుగు పిటిషన్లను విచారించి సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా , రాం లల్లా విరజ్‌మాన్ సంస్థలు 2.77 ఎకరాల స్థలాన్ని సమానంగా పంచుకోవాలని ఇచ్చిన తీర్పు అయోధ్య వివాదాన్ని మరో మలుపు తిప్పింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో 11 పిటిషన్లు దాఖలయ్యాయి. వా టిపై విచారణ మొదలయ్యాక, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలని సుప్రీం కోర్టు భావించి ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించింది.
నిజానికి శ్రీరాముడు ఎపుడు పుట్టాడో, ఎన్నాళ్లకు అవతారం చాలించాడో పురాణాల్లో మనం చెప్పుకుంటున్నా, నిర్ధారిత ఆధారాలు మాత్రం అందుబాటులో లేవు. ఇబ్ర హీం లోడీని ఓడించమని బాబర్ 1526లో ఆనాటి ఇండియన్ గవర్నర్‌ను ఆహ్వానించాడు. ఆ క్రమంలోనే బాబర్ అయోధ్యను సందర్శించాడు. ఇంత వరకూ రికార్డులు పక్కాగా ఉన్నా, కొన్నింటిలో మాత్రం బాబర్ ఆదేశాలతోనే అయోధ్యలో మసీదు నిర్మాణం జరిగిందని కొందరు చరిత్రకారులు వాదిస్తున్నారు. అసలు అక్కడ రామమందిరం ఉన్న విషయం బాబర్‌కు తెలియదని, బాబర్ వద్ద సైన్యాధిపతిగా ఉన్న మీర్ బాకీ తాష్కండి ఆ పని పూర్తిచేశాడని మరికొంత మంది చరిత్రకారులు చెబుతున్నారు. మందిరం కూల్చివేత బాబర్ పనేనన్న ఆధారాలు లేకుండా చేసేందుకే బాబర్‌నామాలో 1528 ఏప్రిల్ 2 నుండి 1528 సెప్టెంబర్ 8వ తేదీ వరకూ పేజీలు లేకుండా చేశారనే వాదన మరొకటి ఉంది. అబుల్ ఫజల్ అక్బర్‌కు అంకితం ఇస్తూ రాసిన ఇనీ అక్బరీలో అయోధ్య ప్రస్తావన, రాముడి ప్రస్తావన ఉంది. ‘ఎర్లీ ట్రావెల్ ఇండియా’ అనే తన గ్రంథంలో విలియం ఫాస్టర్ అయోధ్య ప్రస్తావన చేశారు. 1608 నుండి 11 మధ్య విలియం పింఛ్ రాసిన గ్రంథంలోనూ రామమందిరానికి సంబంధించిన పలు ఆధారాల ప్రస్తావన ఉంది. ఫాదర్ జోసఫ్ తిఫిన్ తిలర్ 1789లో అయోధ్యకు వచ్చినపుడు ఆనాటి పరిస్థితులను గ్రంథస్తం చేశాడు. అందులో కూడా అయోధ్య గురించి, రాముడి జన్మస్థలం గురించి ప్రస్తావన ఉంది.
అయోధ్యలో ఒక ఇంట్లో మహావిష్ణువు జన్మించాడనే ప్రతీతి ఉందని పేర్కొన్నాడు. ఇక్కడ విష్ణువు అంటే రాముడే అని హిందువుల నమ్మకం. ఔరంగజేబు మసీదును నిర్మించాడని కొంత మంది, బాబర్ నిర్మించాడని మరికొంత మంది చెప్పినట్టు పేర్కొన్నాడు. మందిరం- మసీదుకు సంబంధించి తొలిసారి భూ వివాదం 1853లో చెలరేగింది. వాల్టర్ హమిల్టన్ ప్రచురించిన ఈస్టు ఇండి యా గెజిటర్ 1816లో అబుల్ ఫజల్ రాసిన ఇనీ అక్బరీ గ్రంథంలో అయోధ్య ప్రస్తావన ఉంది. మాంట్గోమేరీ మార్టిన్ రాసిన మరో గ్రంథంలో 360 హిందూ దేవాలయాలు ధ్వంసం అయిన అంశాన్ని ప్రస్తావించారు. మీర్‌బాకీ తాష్కండి అక్కడ ఉన్న పూజారుల నుండి రామమందిర స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మార్టిన్ పేర్కొన్నాడు. తాష్కండి కొత్త నిర్మాణం తర్వాత ఆ మసీదును కొంత కాలం పాటు మసీదు ఇ- జన్మస్థాన్ అని పిలిచేవారు. ఆ తర్వాత దాని పేరు బాబ్రీ మసీదుగా మారింది. 1859లో బ్రిటిష్ పాలకులు వివాదాస్పద స్థలంలో కంచెను ఏర్పాటు చేశారు. లోపలి భాగంలో ముస్లింలు, బయటిభాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఉండేది. ఆర్కియాలజీ నిపుణుడు ప్రొఫెసర్ ఏఎం శాస్ర్తీ, డాక్టర్ కేవీ రమేష్, డాక్టర్ టీపీ వర్మ, ప్రొఫెసర్ బీఆర్ గ్రోవర్, డాక్టర్ ఏకే సిన్హా తదితరులు రాసిన వ్యాసాల్లో మసీదు కూల్చినపుడు దొరికిన శిలాఫలకాల్లో అంతకు పూర్వం దేవాలయం ఉండేదనే సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు.
మహంత్ రఘుబీర్‌దాస్ 1885 జనవరి 28న దాఖలు చేసిన పిటిషన్ (61/280)పై స్పందిస్తూ 1886 మార్చి 18న ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి వివాదస్పద స్థలంపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించారు. 1949 డిసెంబర్ 23న మసీదులో రాముడి విగ్రహాలను ఉంచినపుడు ఆ నాటి యూపీ సీఎం జీబీ పంత్‌కు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లేఖ రాస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 1961లో ఈ వ్యవహారాలు కేసుల వరకూ దారితీశాయి. 1984లో వివాదాస్పద స్థలంలో మందిర నిర్మాణానికి ఉద్యమం మొదలైంది. 1986లో ఆనాటి ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా మసీదు తాళం తీయాలని ఆదేశించారు. ముస్లింలు దానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు పోరాట సమితిని ప్రారంభించారు. 1989లో వీహెచ్‌పీ రామమందిర నిర్మాణం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేసిం ది. వివాదాస్పద స్థలం వద్ద మందిర నిర్మాణానికి పునాది వేసింది. 1990లో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా వివాదానికి పరిష్కారం చూపాలని ప్రయత్నించినా కు దరలేదు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కొంతమంది కూలగొట్టారు. తర్వాత తలెత్తిన ఎన్నో వివాదాలు న్యాయస్థానాల్లో పిటిషన్లకు కారణమయ్యాయి.
2002 మార్చి 13న సుప్రీం కోర్టు దీనిపై యథాతథ స్థితిని కొనసాగిస్తామని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ అధీనంలోని ఈ స్థలంలోకి ఎవరినీ అనుమతించకూడదని పేర్కొంది. సుప్రీం తీర్పును శిరసావహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. 2003 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలంలో పురావస్తుశాఖ తవ్వకాలు ప్రారంభించగా, ఆ ఏడాది జూన్ వరకూ అవి కొనసాగించాయి. మందిరాన్ని పోలిన కొన్ని అవశేషాలు లభించాయని పురావస్తుశాఖ నివేదిక ఇచ్చింది. వివాదం పరిష్కారానికి కంచి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి కూడా ప్రయత్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణకు ఏర్పాటు చేసిన లిబర్‌హాన్ కమిటీ 17 ఏళ్ల తర్వాత అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు 2009 జూన్ 30న నివేదికను ఇచ్చింది. అదే ఏడాది జూలై 7న యుపీ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలైంది. స్థల వివాదానికి సంబంధించిన 23 ఫైళ్లు కనిపించడం లేదన్నది ఆ అఫిడవిట్ సారాంశం.
2010 సెప్టెంబర్ 30న వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా అలహాబాద్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దీనిపై 2011 మే 9న సుప్రీం కోర్టు స్టే విధించింది. 2017 మార్చి 21న- అయోధ్య వివాదాన్ని పరస్పరం చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ సూచించారు. తర్వత అలహాబాద్ హైకోర్టులో ఇస్మియిల్ ఫరూఖీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు 2017 ఆగస్టు 7న త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. వివాదం పరిష్కారానికి ముగ్గురు మధ్యవర్తులతో కూడిన కమిటీని నియమించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా అధ్యక్షతన ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులను నియమించింది. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎన్‌వీ నజీర్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఉభయ పక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ హిందూ, ముస్లిం వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపినా ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించడంలో విఫలమైందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై ఈనెల 6నుండి రోజువారీ విచారణను సుప్రీం చేపట్టింది. సుప్రీంలో జరుగుతున్న తాజా వాదనల ప్రకారం రామమందిరం ఉన్న ప్రదేశం సున్నీ వక్ఫ్ బోర్డునకు చెందిందే అని చెప్పడానికి అవసరమైన పత్రాలు ఏవీ తమ వద్ద లేవని స్పష్టం చేయడం జరిగింది. నిర్మోహి సంస్థ తరఫున న్యియవాది సుశీల్ కుమార్ జైన్, ముస్లిం పార్టీల తరఫున రాజీవ్ ధావన్, రాంలీల తరఫున కే పరాశరన్ వాదనలు వినిపిస్తున్నారు. ముస్లిం సంస్థలు వివాదాస్పద స్థలం తమదేనని భావిస్తున్నామే తప్ప, ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని స్పష్టం చేశాయి. ఇక మార్గం సుగమం అయింది. త్వరలోనే సర్వోన్నత న్యాయస్థానం భారతీయుల మనోగతానికి అనుగుణమైన తీర్పు ఇస్తుందనేది అందరి భావన.

-బీవీ ప్రసాద్ 98499 98090