మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మాటలే అతడు ‘నలుడు’ అనటానికి ప్రమాణాలు. ఈ విషయాన్ని మహారాజుకు విన్నవించండి.’’
అని పర్ణాదుడు వివరించి వెళ్ళిపోయాడు. పర్ణాదుడు చెప్పిన మాటలు విన్న దమయంతి చాలాసేపు ఆలోచించింది. కన్నీరు నింపుకొన్నది. తనలో తాను అనుకొన్నది
‘‘అతడు నలుడుగాని పక్షంలో ఎందుకు ఎదురు సమాధానం చెపుతాడు. ఇంకను వీలైనవాళ్ళను పంపించి అతడి సంగతిని సంపూర్ణంగా తెలిసికొనవలసి ఉన్నది.’’అని ఒక నిర్ణయానికి వచ్చింది.. వెంటనే తల్లివద్దకు వెళ్ళింది. ఏకాంతంలో తల్లితో
‘‘అమ్మా! నేను చెప్పిన విషయాన్ని నాన్నగారికి ఎప్పుడూ చెప్పకు. నీ సమక్షంలోనే సుదేవుని మన పనికై నియమిస్తాను. నీవు నాకు మేలు కోరిన దానివైతే నా అభిప్రాయాన్ని తండ్రిగారికి ఎట్టి పరిస్థితులలోనూ తెలియనీయవద్దు. అలాచేయడమే నీ కర్తవ్యం. శుభకరుడైన సుదేవుడు నన్ను బంధుజనాల చెంతకు త్వరితగతిని చేర్చినాడు. ఆ సుదేవుడే ఇపుడు నలుని తీసికొని రావడానికి అయోధ్యానగరానికి వెళ్ళాలి’’అని అన్నది.
పర్ణాదుడు విశ్రాంతిగొని వచ్చిన తరువాత దమయంతి అతడికి అధికమైన ధనాన్ని ఇచ్చి సత్కరించింది.
‘‘బ్రాహ్మణోత్తమా! నలమహారాజు తిరిగి ఇక్కడికి వస్తే మరలా మరింత ధనాన్ని ఇస్తాను. విప్రోత్తమా! అతి త్వరలో నా భర్తను కలిసేటట్లు ఎవ్వరూ చేయలేనంత మేలును మీరు నాకు చేశారు’’అని అనగా పర్ణాదుడు దమయంతిని మంగళకరమైన ఆశీస్సులతో ఊరడించాడు. తన గృహానికి తిరిగి వెళ్ళాడు.
తదుపరి దమయంతి తల్లి అనుమతితో సుదేవుని పిలిపించుకొన్నది. అతడిని తన తల్లివద్దకు తోడ్కొనిపోయింది. తల్లి సమక్షంలోనే దమయంతి సుదేవునితో.
‘‘ఓ బ్రాహ్మణోత్తమా! విద్వాంసులచేత కీర్తింపబడే ఓ సుదేవా! బుద్ధిలో నీవు బృహస్పతి అంతటివాడవు. నీవు సకల సద్గుణాలు కలవాడివి. నీవు నన్ను గుర్తించి తెచ్చావుగదా? అట్లే లోకులచే ప్రశంసింపబడే నల మహారాజును కూడా వెదికి కౌశలంతో గుర్తించి తెచ్చే పని నీ భుజస్కంధాలపై ఉంచుతున్నాను.’’
సుదేవా! విప్రోత్తమా! నీవు స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా అయోధ్యకు విదేశ విప్రుడివలె వెళ్ళుము. వెళ్ళి ఉత్తర ‘కోసలాధిపతి’, సూర్యుడి వంటి ప్రతాపం చేత ఉన్నతుడూ, పుణ్యాత్ముడూ, దేవతలతో సమానుడూ అయిన ‘ఋతుపర్ణ మహారాజును’ దర్శించుము. అతడితో
‘‘ఋతుపర్ణ మహారాజా! విదర్భ రాజైన ‘్భమమహారాజు అల్లుడైన నలమహారాజును అనే్వషించడానికై పలువురిని పుత్తెంచాడు. అయితే ఎక్కడా అతడి జాడ తెలియలేదు. అతడి జాడ తెలియజాలక ‘దమయంతికి’ ద్వితీయ స్వయంవరాన్ని ఏర్పాటుచేశాడు. అందుకు భూమండలంలోని రాజులందరినీ ఆహ్వానించాడు. వారందరూ వస్తున్నారు. ఆమె ‘రేపు సూర్యోదయ సమయంలో రెండవ భర్తను వరిస్తుంది’అని విన్నవించుము.
సుదేవునితో పైవిధంగాచెప్పి అతడిని మిక్కిలి శీఘ్రంగా అయోధ్యకు వెళ్ళటానికి తగిన ఏర్పాటును చేయించింది.
దమయంతి మాటప్రకారం సుదేవుడు వెంటనే పయనమై అయోధ్యాపురానికి చేరాడు. ఋతుపర్ణ మహారాజును సందర్శించాడు. అతడితో
‘‘ప్రభూ! విదర్భ మహారాజు అయిన భీముడు, నలమహారాజు జాడ తెలియకపోవటంతో తన కూతురైన దమయంతికి ద్వితీయ స్వయంవరం జరుప నిర్ణయించాడు. ఆ స్వయంవరం రేపు జరుగుతుంది. కావున తమరు వెంటనే బయలుదేరి రావలసినదిగా నాచే ఆహ్వానము పంపడమైనది’’ అని నివేదించాడు.
సుదేవుని మాటలు విన్న ఋతుపర్ణుడు అశ్వాధ్యక్షుడైన బాహుకుని పిలిపించాడు.
ఋతుపర్ణ మహారాజు బాహుకుని పిలిపించుకొని అతడితో
- ఇంకాఉంది