మెయన్ ఫీచర్

కశ్మీర్ సమస్యకు మతం రంగు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం తాత్కాలిక ప్రాతిపదికన రాజ్యాంగంలో ప్రవేశ పెట్టిన ఆర్టికల్ 370ని ఏడు దశాబ్దాలపాటు కొనసాగించిన అనంతరం, ఇప్పుడు రద్దు చేస్తే దే శంలో అనూహ్యంగా మద్దతు లభిస్తున్నది. వామపక్షాలను మినహాయించి దాదాపు అన్ని పార్టీలలో ఈ చర్య పట్ల మద్దతు వ్యక్తం అవుతున్నది. చివరకు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు సహితం రాజ్యాంగంలో ఈ అధికరణ కొనసాగాలని పేర్కొన కపోవడం గమనార్హం. కేవలం దానిని రద్దు చేసిన విధానం పట్లనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా, అక్కడ అసెంబ్లీ లేని స మయంలో, అర్ధాంతరంగా ఇటువంటి ప్రతిపాదనను తె రపైకి తీసుకువచ్చిన తీరునే తప్పుబడుతున్నారు. ఇటు వంటి విమర్శలకు మోదీ ప్రభుత్వం తగు సమాధానం చెప్పవలసిందే. ఇప్పుడు కాకపోయినా, రేపయినా స్థానిక ప్రజల విశ్వాసం పొందకుండా జమ్మూ కశ్మీర్ సంపూర్ణ విలీనం కార్యరూపం దాల్చలేదు. కేవలం సైన్యం, సా యుధ బలగాలతో ఈ లక్ష్యసాధన సాధ్యం కాబోదు.
అయితే, ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం చేసిన వ్యాఖ్య ఈ మొత్తం రాజకీయ అంశానికి కొత్త రూపం ఇచ్చినట్లు అయింది. కశ్మీర్ లోయలో ముస్లింలు ప్రధానంగా ఉన్నందునే భాజపా ఆర్టికల్ 370ని రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. అదే హిందువులు అక్కడ అత్యధిక సం ఖ్యలో ఉన్నట్లయితే ఈ విధంగా చేసి ఉండేవారా? అని ప్రశ్నించారు. కండబలంతో కాశ్మీర్ లోయ విలీనం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ విధమైన ఆరోపణలు చేయడంలో చిదంబరం ఉద్దేశం ఏదైనప్పటికీ భార తదేశంలో రాజకీయ నాయకులు ప్రవచించే లౌకికవాదం డొల్లతనాన్ని ఆయన వ్యాఖ్యలు వెల్లడి చేస్తున్నాయి. కేవలం ముస్లింలను సంతృప్తి పరచడం కోసమే లౌకికవాదులుగా మారుతున్నారనే అభిప్రాయం కలుగుతున్నది. దేశ సమగ్రత అంశానికి మతం రంగు పూసిన్నట్లు అయింది. అసలు జమ్మూ కశ్మీర్ అనగానే ముస్లిం ప్రాంతం అనే దురభిప్రాయం కలుగుతుంది. మొత్తం భూభాగంలో మూడోవంతుకన్నా తక్కువ ప్రాంతమే గల కశ్మీర్ లోయలో మాత్రమే ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో సహితం ముస్లింలు సగానికి అటు, ఇటుగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్ అంటే మూడు ప్రాంతాలు. అవి కాశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్.
కాశ్మీర్ లోయలో మాత్రమే ముస్లింలు అత్యధికంగా ఉండగా జమ్మూలో హిందువులు, లడఖ్‌లో బౌద్దులు ఉన్నారు. అటువంటప్పుడు జమ్మూ కశ్మీర్ అనగానే కేవలం ముస్లిం సమస్యగా ఎందుకు ప్రస్తావిస్తూ ఉంటారు? కశ్మీర్ లోయలోని పరిస్థితులనే ఎందుకు ఉదహరిస్తూ ఉంటారు? ఇటువంటి వైఖరి మన రాజకీయ నాయకుల దివాలా ధోరణులకు నిదర్శనమని చెప్పవలసిందే. దేశంలో అన్ని సంస్థానాలను భారత్‌లో విలీనం కావించే బాధ్యతలను నాటి హోమ్ మంత్రిగా సర్దార్ పటేల్ చేపడితే కేవలం జమ్మూ కశ్మీర్, హైదరాబాద్ అంశాలను మాత్రం స్వయంగా చేపడతానని నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిర్ణయించుకున్నారు. ఈ రెండు ప్రాం తాలలో ముస్లింలు అధికంగా ఉండటం అందుకు కార ణం కాదా ?
అందుకనే ఈ విషయంలో నెహ్రూ సహితం తన లౌకికవాద ధోరణులకు చాటింపు వేసుకునేందుకు ప్రా ధాన్యత ఇచ్చారు గాని క్షేత్రస్థాయి వాస్తవాలను పరి గణనలోకి తీసుకోలేదు. కేవలం ఆయన ధోరణి కారణంగానే జమ్మూ కశ్మీర్ ను ఇప్పటికీ ఒక సమస్యగా భావించే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి ధోరణుల కారణంగానే కశ్మీర్ సమస్యకు మతం రంగు పులిమి వాస్తవాలను గ్రహించే విచక్షణను కోల్పుతున్నట్లు భా వించవలసి వస్తున్నది. ఉదాహరణకు కశ్మీర్ లోయ నుండి సుమారు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్ లను దారుణంగా గెంటివేసి, అక్కడ మరో మతం వారికి నివాస యోగ్యత లేదనే అరాచక పరిస్థితులు కల్పిస్తే మన దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఏవీ కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. చివరకు ప్రభుత్వాలు సహితం కశ్మీరీ పండిట్‌లకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఇప్పటి వరకు చెయ్యనే లేదు. మయన్మార్, బాంగ్లాదేశ్‌ల నుండి వచ్చే వలస ప్రజలపై సానుభూతి చూపుతున్న రాజకీయ పార్టీలు తమ స్వదేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీరీ పండిట్‌ల దీన పరిస్థితుల గురించి మాట్లాడే సాహసం చేయడం లేదు. కేవలం వారి లౌకికవాదం అనే ముసుగే అందుకు అడ్డు వస్తున్నదా ?
కేవలం కండబలంతో ప్రజల విశ్వాసం పొందలేమని చిదంబరం చెప్పిన మాటలను అంగీకరించ వలసిందే. రెండు తెలుగు ప్రాంతాలను కలిపి సుమారు 60 ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్‌గా ఉంచినా, రెండు ప్రాంతాల ప్రజల మధ్య భావాత్మక ఐక్యతను సాధించే ప్రయత్నం చేయలేక పోవడంతో పరస్పరం అనుమానాలు పెంచుకొని, చివరికి విడిపోవలసి వచ్చింది. కాశ్మీర్‌లో కూడా అదే జరు గుతోంది. అక్కడి ప్రజలలో తమ చర్యల పట్ల విశ్వాసం కలిగించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేని పక్షంలో సైనికుల పహారాతో కట్టివేసి ఉంచలేము. ఇక్కడ మరో సమస్య కూడా తలెత్తుతుంది. గత 70 ఏళ్లలో బీజేపీ కేవలం 11 ఏళళు మాత్రమే అధికారంలో ఉంది. గతంలో వాజపేయి గాని, ఇప్పుడు మోదీ గాని బలప్రయోగం ద్వారా అక్కడి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు. అయితే వారిద్దరికీ కాశ్మీర్ పట్ల సరైన దృక్కోణం లేదని భావించినా, సుమారు 60 ఏళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఇతర ప్రభుత్వాలు ఏవీ బలప్రయోగం చేసిన సందర్భాలు లేవు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను మనలో కలుపుకొని అవకాశం చిక్కినా నిగ్రహంతో వ్యవహరించాయి. అయినా వారెవ్వరూ కశ్మీర్ సమస్య పరిష్కారంలో చెప్పుకోదగిన విజయం ఎందుకు సాధించలేక పోయారు ?
ఈ దిశలో ఆర్టికల్ 370 రద్దును ఒక కీలక అంశంగా పరిగణించాలి. భారత ప్రభుత్వం వేసిన ఒక పెద్దడుగుగా గుర్తించాలి. అయితే జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న సమస్యలు అన్నింటికీ ఈ అధికరణ మాత్రమే కారణం అనే అభిప్రాయాలు గాని, దీనిని రద్దు చేయడంతో అన్ని సమస్యలు పరిష్కరించినట్లే అని గాని భావించడం సహితం ఆత్మహత్య సదృశమే కాగలదు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధిలో వెనుకబడి ఉండడానికి ఆర్టికల్ 370 మాత్రమే కారణం అనడం కేంద్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నంగానే భావించవలసి ఉంటుంది. బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాలకన్నా ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజ ఉన్నదని గ్రహించాలి. కశ్మీర్ లోయలో ఉగ్రవాదం విజృభించడానికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను సహితం కారణమని గమనించాలి.
ఈ సందర్భంగా మూడు దశాబ్దాల క్రితం రైల్వే మంత్రిగా జార్జ్ ఫెర్నాండెజ్ గుంటూరు వచ్చినప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తున్నది. యువతలో నిరుద్యోగం ప్రబలిన కారణంగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదం పెబుల్లుకుటున్నట్లు చెప్పుకొచ్చారు. బిహార్, ఒడిశాలలో అంతకన్నా ఎక్కువగా నిరుద్యోగం నెలకొన్న దృష్ట్యా ఆయా రాష్ట్రాలలో కూడా ఉగ్రవాదం చెల రేగుతున్నదని భావిస్తున్నారా? అని ఒక విలేఖరి అడ గడంతో జార్జ్ ఆగ్రహంతో ఉలిక్కిపడ్డారు.
ఆర్టికల్ 370ని రద్దు చేసినంత మాత్రం చేత దేశంలో ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా వెళ్లి అక్కడ ఆస్తులు సమకూర్చుకొని, పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా స్థానిక ప్రజలను నెట్టివేసి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కొందరు భయాలను వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో ఇటువంటి విషయాలపై పలు ఆంక్షలు ఉన్నాయి. ఇష్టం వచ్చినంత ఆస్తులు సమకూర్చుకొనే అవకాశం లేదు. జమ్మూ కశ్మీర్‌లో సహితం అటువంటి ఆంక్షలు విధిం చాలని బిజెపి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ ప్రధానిని కోరారు. ఆర్టికల్ 370 రద్దుకు ముస్లిం రంగు పులమడం ద్వారా దేశంలో ముస్లింలు అందరినీ బాధితులుగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందే జిన్నా తరహా రాజకీయాలకు చిదంబరం తలప డుతున్నట్లు అర్థం అవుతుంది. అటువంటి సంకుచిత రాజకీయ విధానాలు అనుసరించిన కారణంగానే కాంగ్రెస్ దేశంలో పలు చోట్ల వేర్పాటువాద ధోరణులకు అవకాశం కలిగించిందని గుర్తుంచుకోవాలి.
ఆర్టికల్ 370 రద్దు ద్వారా.. ‘ఒకే దేశం.. ఒకే రా జ్యాంగం’- అనే అభిలాష నెరవేరిన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సంతోషం వ్యక్తం చేశారు. అయితే అక్కడి ప్రజలపై విధించిన ఆంక్షలను తొలగించి, సాధారణ పరిష్టితులు ఏర్పాటు చేయడానికి స్థానిక ప్రజల విశ్వాసం పొందేందుకు తక్షణం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ అధికారులతో కాకుండా రాజకీయ చొరవ ద్వారా ప్రజల విశ్వాసం పొందగలమని గ్రహించాలి. ఆ దిశలో గతంలో వాజపేయి విశేషమైన కృషి చేశారు. అనేకసార్లు ప్రధాని మోదీని కలసి రాజకీయ చొరవకు పూనుకోవాలని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అభ్యర్ధించిన విధంగా వాజపేయి ఎక్కడైతే ఆగి పోయారో, అక్కడి నుండి ఇప్పుడు మోదీ ప్రయాణం చేయాలి. అప్పుడే కశ్మీర్ భావాత్మకంగా భారత్‌లో విలీనం సంపూర్ణం కాగలదు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణకు పూనుకోవాలి.

-చలసాని నరేంద్ర 98495 69050