మెయిన్ ఫీచర్

...సౌత్‌దే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ స్టామినా ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ఇది -ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. నిజానికి సెవెంటీస్ నుంచే మొదలైందని చెప్పడానికి
ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రామ్‌గోపాల్ వర్మ ‘శివ’ ఎరా నుంచి ‘సత్య’ ఎరా వరకూ.. మధ్యలో అనేకమంది హీరోలు, దర్శకులు వాళ్ల చిత్రాలతో బాలీవుడ్‌పై తీవ్ర ప్రభావమే
చూపించారు. ఇప్పుడు నార్త్ ఆడియన్స్ -తెలుగు హీరోలు,
దర్శకులనే ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే -హిందీ చానెల్స్ సైతం టాలీవుడ్ హీరోలకు ‘స్పెషల్ వీక్స్’ నడిపిస్తున్నాయి.
అతి త్వరలోనే దేశం మొత్తంమీద అతి పెద్ద ఇండస్ట్రీగా టాలీవుడ్
ఆవిర్భవిస్తుందని బల్లగుద్ది
మరీ చెప్పొచ్చు.
ఆ మధ్య అశ్వమేథం సినిమాతో తెలుగుకు పరిచయమైన మరాఠీ దర్శకుడు నితిన్ అబ్జర్వేషన్ ఇది.
కొనే్నళ్ల క్రితం వరకూ -
హిట్టందుకున్న తెలుగు సినిమా తమిళంలో కనిపించేది. సక్సెస్ కొట్టిన తమిళ సినిమా -తెలుగు స్క్రీన్‌మీద అనువాదంగానో, రీమేక్‌గానో కనిపించేది. ఇప్పుడు -చాలావరకూ పెద్ద సినిమాలన్నీ మొత్తం సౌత్‌నే టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. అన్ని భాషల్లో ఏకకాలంలో స్క్రీన్‌మీద సినిమా చూపించేందుకే దర్శక, నిర్మాత, హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే -మొత్తం సౌత్ మీదే బాలీవుడ్ ఓ కనే్నసి ఉంచుతోంది. దర్శకుడు నితిన్ చెప్పినట్టు -సౌత్ సినిమాని బాలీవుడ్ రీమేక్ చేసుకోవడం ఇప్పటిదేం కాదు. 80, 90 దశకాల్లోనే అలాంటి సినిమాలు మనకు కనిపించినా -ఆ కథ వేరు. ఇప్పటి కథ వేరు. శాటిలైట్ పెరిగింది. డిజిటల్ మార్కెట్ విస్తృతమైంది. దీంతో సౌత్ సినిమాకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు -బాలీవుడ్‌లో హైవే ఏర్పడింది. సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా దాదాపు వస్తున్న సినిమాలన్నీ నార్త్‌లోకీ అనువాదమవుతున్నాయి. సౌత్ సినిమాలకు ఒకరకం ఆదాయ వనరు -బాలీవుడ్ డబ్బింగ్ అంటే అతిశయోక్తి కాదు. ప్రాంతీయ భాషల్లో వస్తోన్న చిన్న సినిమాలు -ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంటే బాలీవుడ్ వర్షన్‌కు భారీ రేటు వచ్చినట్టే. ఇది ఇప్పటి పరిస్థితి.
బాలీవుడ్‌కు సబ్జెక్టులు లేక ప్రాంతీయ భాషలవైపు చూస్తోందనుకోవడం తప్పు. ప్రాంతీయ భాషల్లో జరిగే ప్రయోగాలను -నేషనల్ స్క్రీన్‌గా ఓన్ చేసుకుంటోంది. ప్రాంతీయ భాషా సినిమాలను తనలో మిళితం చేసుకోడానికి జరుగుతోన్న ప్రయత్నంగానే దీన్ని చూడాలి. అందుకే -రీమేక్, డబ్బింగ్ పదాలను సక్సెస్‌కు సింపుల్ సూత్రమన్నట్టే భావిస్తోంది బాలీవుడ్. అందుకే -జాతీయ సినిమా అంటే బాలీవుడ్ అనే నమ్మకాన్ని క్రమంగా చెరిపేసుకుని.. సినిమాను విస్తృతం చేస్తోన్న వివిధ భాషల్లోని మేకర్లతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇదో గొప్ప పరిణామంగానే భావించాలి. దక్షిణాది తారలు, ప్రాంతీయ భాషా సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుండటాన్ని ఈకోణంలోనే చూడాలి. గత ఐదేళ్లలో -దేశప్రజల దృష్టిని ఆకర్షించిన ప్రతి ప్రాంతీయ సినిమా బాలీవుడ్‌లో రెపరెపలాడటానికి కారణమిదే.
స్టోరీల కోసమో, సక్సెస్ కోసమో.. ప్రాంతీయ భాషా చిత్రాల వద్దకే బాలీవుడ్ పరిగెత్తుకొస్తోందన్న చర్చ ఒకవైపు వినిపిస్తుంటే.. ఇదే చర్చ బాలీవుడ్ కోణంలో మరోలా వినిపిస్తోంది. ప్రాంతీయ భాషా చిత్రాలను జాతీయ స్థాయికి తీసుకొస్తున్నామన్న అక్కడ దృక్పథం కనిపిస్తోంది. మంచి కథ, మంచి స్క్రీన్‌ప్లే.. ప్రయోగాత్మక సినిమా.. ఇలా వైవిధ్యం అనిపించుకున్న ప్రతి సినిమానూ పునఃనిర్మించటానికి, అనువదించటానికి బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపించటానికి కారణం ఇదే. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లే ఈ విషయంలో ఆసక్తి చూపించటంలోని ఔచిత్యం- స్థాయిదిగని వ్యాపార సూత్రమే. క్రేజీ అని ఇమేజ్ తెచ్చుకున్న సినిమాలు విడుదలకు ముందే -బాలీవుడ్‌లో రీమేక్‌కు ఒప్పందాలు జరిగిపోతున్న వైనాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆమధ్య ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రీమేక్‌కు స్పందించాడంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఆరు కోట్ల ధరకు రీమేక్ రైట్స్ కొనేశారన్నది సమాచారం. సౌత్‌లో ‘డియర్ కామ్రేడ్’కు ఎక్స్‌పోజర్ రాలేదు కనుక, హిందీ వర్షన్ రీమేక్‌పై అనుమానాలు ముసురుతున్నాయి. డబ్బింగ్‌తో సరిపెట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నది పరిశీలకుల మాట. పైన దర్శకుడు నితిన్ చెప్పినట్టు -హిందీ జనాల్లో హీరో విజయ్‌కూ మంచి క్రేజ్ ఉంది కనుక.. డబ్బింగ్‌తోనూ లాభాలు వచ్చిపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రాంతీయ భాషా చిత్రాలకు జాతీయస్థాయిలో ఎక్స్‌పోజర్ వస్తుండటంతో -అక్కడి హీరోలు ఒకవిధంగా గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటోన్న వైనం కనిపిస్తోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలకు ‘ఇండియన్ సినిమా’ స్టేటస్ వస్తుండటంతో.. బాలీవుడ్ హీరోలకు ప్రతి సినిమా కత్తిమీద సామే అవుతోంది. కండలవీరుడు సల్మాన్‌ఖాన్ కమర్షియల్ గ్రాఫ్ దాటి బయటకు రావడం లేదు. చేస్తున్న కమర్షియల్ సినిమాలన్నీ హిట్టవుతున్న దాఖలాలూ లేవు. శక్తికిమించి పాపులార్టీ తెచ్చుకున్న షారూఖ్‌ఖాన్‌కు ఇటీవలి కాలంలో ఫ్లాపులే తప్ప పాస్ అన్నదే లేదు. ఇక సూపర్ సక్సెస్ అన్న ఆలోచనే మర్చిపోయిన పరిస్థితి. దంగల్ తరువాత అమీర్ ఆ స్థాయి విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. అక్షయ్‌కుమార్ తన మార్క్ సినిమాలు చేసుకుంటూ వెళ్లడం తప్ప, ఇండియన్ సినిమా అన్నంత ప్రభావం చూపే సినిమా ఒక్కటీ చేయలేదు. ప్రాంతీయ భాషా చిత్రాల హీరోలకంటే తక్కువ గ్రాఫ్‌తోనే నడుస్తోంది అజయ్ దేవ్‌గణ్ కెరీర్. మెరుపులు మెరిపించే చిత్రాలేవీ బాలీవుడ్‌నుంచి రాలేకపోతుండటంతో-సౌత్ సినిమాలు చెలరేగిపోతున్నాయి. గత కొంతకాలంలో పెళ్లిచూపులు, కేరాఫ్ కంచరపాలెం, మహానటి, ఆ, అర్జున్‌రెడ్డి, మల్లేశంలాంటివైవిధ్యమైన, ప్రయోగాత్మక సినిమాలతో టాలీవుడ్ తన స్టామినాను చూపించుకుంది. కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకుడిని కట్టిపడేసింది. కమర్షియల్ సినిమా అన్నది కొంతమంది హీరోలకే పరిమితమైతే.. మెజారిటీ వర్గం ఆ చట్రం నుంచి బయటకు ఎప్పుడో వచ్చేసింది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాను స్క్రీన్‌పైకి తెచ్చేందుకు కొత్త దర్శకులు, మేకర్లు, ఎస్టాబ్లిష్ అవుతోన్న హీరోలు అహరహం ఆసక్తి చూపిస్తున్నారు. మలయాళంలో ప్రేమమ్, అంగమాలి డైరీస్‌లాంటి చిత్రాలు సెనే్సషన్ సృష్టిస్తే.. తమిళంలో జిగర్‌తాండా, సేతుపతి, పేరన్బులాంటి సినిమాలూ, మారాఠిలో సైరత్‌లాంటి వైవిధ్యమైన చిత్రాలూ ప్రత్యేకతను చాటుకున్నాయి.
అందుకే -సౌత్ సినిమా అంటే ఒక వైవిధ్యం అనే పరిస్థితి వచ్చింది. ప్రయోగాలు పెరిగాయి. తెలుగు సినిమాను కామెడీ సినిమా తరహాలో చూసిన హిందీ ప్రేక్షకులు -ఇప్పుడు ఇక్కడి హీరోల సినిమాల కోసం ఎగబడుతున్నారు. బాహుబలి, అర్జున్‌రెడ్డిలే అందుకు ఉదాహరణ. సౌత్ సెలబ్రిటీలంటే -ఇప్పుడు నార్త్‌లో పిచ్చి క్రేజ్. దర్శకుడు నితిన్ అంచనా నిజమైతే -సౌత్ సినిమాదే రాజ్యం. అందులో తెలుగు పరిశ్రమకే అగ్రతాంబూలం.

-విజయప్రసాద్