మెయిన్ ఫీచర్

భక్తుల పాలిట కల్పతరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వరాలయం
*
మృత్యుంజయాయ రుద్రాయ నీల కంఠాయ సంభవే
అమృతేశాయ శర్వాయ మహా దేవాయుతే నమః
వ్యాసుడు రచించిన పురాణాల్లో వాయుపురాణంలోగోస్తనీ నది గురించిమామహేశ్వర క్షేత్రం గురించి ప్రస్తావించబడి ఉంది.
సాక్షాత్తు ఆ క్షేత్రమే నేటికి పశ్చిమ గోదావరిజిల్లా పెనుమంట్ర మండలంలో జుత్తిగా గ్రామంలో అలరారుతోంది. సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయంగా ఈ ఉమావాసుకీ రవి సోమేశ్వరాలయం ప్రసిద్ధి కెక్కింది.
భక్తుల కోర్కెలు తీరే కల్పతరువుగాఈ ఆలయం భాసిస్తోంది. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులకు శత్రు, రుణ, రోగ, మృత్యుభయాలు దూరమవుతాయి. కోరిన కోరికలన్నీ ఈడేరుతాయి అని భక్తుల నమ్మకం. ఈ సోమేశ్వరుణ్ణి అర్చించి ఇక్కడకు వచ్చిన భక్తులకు అన్నదానం చేస్తే సోమేశ్వరుడు సంతృప్తిపడి వారికి పునర్జన్మ రహితమైన కైవల్యాన్ని ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జుత్తిగ లోని ఈ సోమేశ్వరాలయం కాశీక్షేత్రం అంత పవిత్రమైందని ఇక్కడకు ఎందరో ఋషిపుంగవులు వచ్చి స్వామిని అర్చించి సేవించి వెళ్తుంటారని స్థానికులు చెబుతారు.
పురాణ గాథ: త్రేతాయుగంలో రావణాసురుడు అతని పరివారం దేవతలందరినీ పీడిస్తూ ఉండేవాడు. ఒకరోజు రవి,వాసుకి, సోముడు రావణ భటులచే పరాభవింపబడి దుఃఖించడం బ్రహ్మా చూశాడు. వారిని ఓదారుస్తూ త్వరలోనే ఈ రావణుడు అంతం అయ్యేరోజులు వస్తున్నాయి. మీరు దుఃఖించకండి అని చెబుతూ మీరు ఈ గోస్తనీ నది తీరంలో ఉత్తర వాహినీ, నిత్య పుష్కరిణి ఉన్నచోట పశ్చిమాభిముఖంగా శివలింగాన్ని ప్రతిష్టించుకుని కొలవండి. మీ కోరికలు నెరవేరుతాయని సలహా ఇచ్చాడు. అట్లా బ్రహ్మ చేత ఉపదేశం పొంది వారంతా ఈ ఉమావాసుకీ రవి సోములు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించి శివునికి నిత్యం ఆరాధించేవారు. కొన్నాళ్లకు బ్రహ్మ నుడివినట్లే రాముడు రావణ వధ జరిపి వారి బాధలను తొలగించాడు. అప్పటినుంచీ ఈ ఆలయం ఉమావాసుకి రవి సోమేశ్వరాలయంగా పేరుబడిసింది.
కలియుగంలో ఎందరో రాజులు ఈ ఆలయానికి మెరుగులు దిద్ది సోమేశ్వరుని కృపను పొందారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. సత్తిరాజు వంశస్తులచే ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగినట్లు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి.
ఈ స్వామికి మహాన్యాస, నమక , చమక సంపుటీకరణతో అభిషేకాలు, బిల్వార్చనలు చేసి భక్తులంతా ఆనందిస్తుంటారు. ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాభిముఖంగా పార్వతీ దేవి కొలువై ఉంది. గర్భాలయాన అమ్మవారు స్వర్ణకిరీటి ధారిణియై భక్తులచే కుంకుమార్చనలను అందుకుంటూ వారికి సౌభాగ్యసిద్ధిని కలుగచేస్తుంటుంది.
ఈ ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. పార్వతీదేవి ఎడమ భాగాన భద్రకాళి వీరభద్రేశ్వరుల ఆలయం ఉంది. శివలింగానికి ఎదురుగా ముఖ మండపంలో శ్రీ శారదాదేవి, శ్రీఅనిసమ్మదేవి కొలువై ఉన్నారు.
ఈ ప్రాంగణంలోనే లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం ఉంది. వైశాఖ శుద్‌ద త్రయోదశి నుంచి పూర్ణిమ దాకా లక్ష్మీజనార్దన స్వామికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతుంటాయి.
ఆలయానికి ఈశాన్యంలో సూర్యనారాయణ స్వామి, శ్రీకాల భైరవ స్వామి ఆలయం సప్తశ్వరథారూడుడైన సూర్యనారాయణుడు సతీసమేతంగా వేంచేసి ఉన్నారు. ప్రథాన ఆలయానికి ఆగ్నేయంలో గణపతి, నైరుతి దిక్కున శ్రీ దుర్గాదేవి ప్రతిష్టితులై ఉన్నారు. దూతికాదేవి ఆలయం కూడా ఇక్కడ నెలకొని ఉంది. నవ గ్రహమండపం, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువైన ఆలయాలు ఈ ప్రాంగణంలో నే ఉన్నాయి. సంతానం లేనివారు ఇక్కడ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యునికి దర్శించుకుని పూజిస్తే వారికి సత్సంతానం కలుగుతుంది. ఆలయ మొదటి ప్రాకరాకి ఉత్తర దిక్కులో కంచి కామాక్షి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోని ఈ అమ్మవార్లను దర్శించుకుని సోమేశ్వరునికి అభిషేకాదులు నిర్వర్తించిన వారికి రోగ పీడలు, గ్రహపీడలు దూరమవుతాయని ప్రసిద్ధి.
దేవాలయానికి మార్గం:
జుత్తిగను చేరడానికి తణుకు నుంచి బస్సు,ఆటో, జీపు, కారు లాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం నుంచి ఈ క్షేత్రం 14.కి.మీదూరంలో ఉంది. తాడేపల్లి గూడెం నుంచి28 కి.మీ, అత్తిలి నుంచి 6 కి.మీ దూరంలోను, మార్టేరు నుంచి 15 కి.మీ దూరంలోను ఈ క్షేత్రం ఉంది. తణుకు రావడానికి రైలు సౌకర్యం ఉంది.

- వారణాశి రామమోహన్ శర్మ 9849482803