మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాహుకా! ఇది ‘‘అక్ష హృదయం’’అనే ప్రసిద్ధికెక్కిన విద్య. దీన్ని శాస్ర్తియంగా అభ్యసించాలి. అలా అభ్యసించిన మనుజుడు సంఖ్యావేత్త కాగలడు. అతడు పాపాలనుండి దుర్మార్గాలనుండి విషంనుండి విముక్తిని పొందుతాడు.
అంతేకాదు ఈ విద్యను పొందిన వ్యక్తి సకల గుణప్రసిద్ధుడై విశ్వశ్రేయస్సును ఒనగూర్చినవాడు కాగలడు సుమా!! అని పలికాడు. అంతట బాహుకుడు
‘‘పురుషశ్రేష్ఠుడవైన ఓ ఋతుపర్ణ మహారాజా! ‘అక్షహృదయ’విద్యను నాకు అనుగ్రహించండి. నావలన ‘అశ్వహృదయ’విద్యను మీరు గ్రహించండి అని అనగా ఋతుపర్ణుడు అందుకు అంగీకరించాడు.
‘‘బాహుకా! నీవు కోరినట్లే అక్షహృదయ విద్యను నీవు గ్రహించుము. అశ్వహృదయ విద్యను నాకు ప్రసాదించుము’’అని ఋతుపర్ణుడు
అక్షహృదయ విద్యను బాహుకునకు యధావిధిగా ఉపదేశించాడు. అంత బాహుకుడు ‘‘ప్రభూ! అశ్వహృదయ విద్యను ఉపదేశిస్తాను. గ్రహించండి’’అని చెప్పగా ఋతుపర్ణుడు.
‘‘బాహుకా! అట్లే గ్రహిస్తాను. అంతవరకు ఆ విద్యను నీవద్దనే ఉంచనిమ్ము.
నాకు అవసరమైనప్పుడు దానిని స్వీకరిస్తాను’’అని బదులుపలికాడు.
అక్ష హృదయ విద్యను బాహుకుడు గ్రహించిన వెంటనే నలుని శరీరంలో ఉన్న ‘కర్కోటక’ విషాన్ని మాటిమాటికి నోటినుండి క్రక్కుతూ ‘కలిపురుషుడు’ నలుని శరీరంనుండి బయటపడ్డాడు. అప్పుడే విష రూపమయమైన ‘కలి’ శాపాగ్నికూడా బయటపడింది.
ఆ ‘కలి’పెట్టిన బాధవలనే అంతవరకు నలుడు కర్తవ్యమూఢుడయ్యాడు. విష విముక్తుడైన ‘కలి’ స్వస్వరూపాన్ని పొందాడు. దానితో విషయాన్నంతా అర్థం చేసికొన్న నలమహారాజు కోపంతో కలిపురుషుని శపింపబోగా ‘కలి’ పురుషుడు చేతులు జోడించి వణకిపోతూ భయపడిపోతూ
‘‘నల మహారాజా! దయచేసి కోపాన్ని నిగ్రహించుకొనండి.! మీకు అపారమైన కీర్తిని కలుగజేస్తాను. నీచే విడిచిపెట్టబడిన నీ భార్య నీపై కోపం గల్గినా నిన్ను శపించలేదు. కానీ ఆమె శాపంచేత నీ శరీరంలోఉన్న నేను మిక్కిలి బాధను పొందాను. నీ శరీరంలో ఉన్నప్పుడు చాలా దుఃఖాన్ని పొందాను. నాగరాజ శ్రేష్ఠుడైన కర్కోటకుని కాటుచే నీ శరీరంలో ప్రవేశించిన విషం నీలోనున్న నన్ను రాత్రింబవళ్ళు దహించివేసింది. నేనిప్పుడు నిన్ను శరణుపొందాను. నా మాట మన్నింపుము.
శరణు పొందిన నన్ను నీవు శపించకుండా ఉన్నట్లయితే లోకంలో నిన్ను కీర్తించే మనుషులకు నావలన ఎలాంటి భయమూ కష్టమూ ఉండదు. నిన్ను, నీ భార్య అయిన దమయంతిని ధ్యానించినవారు నావలన భీతిని పొందరు (కలిదోష విముక్తులౌతారు) (ఇది ఫలశ్రుతి) అని వేడుకొనగా నలుడు తన కోపాన్ని నిగ్రహించుకొన్నాడు.
భయపడిన ‘కలి’వెంటనే ఆ ‘విభీతిక వృక్షంలో’(తాండ్ర చెట్టు) ప్రవేశించాడు. అదృశ్యుడయ్యాడు.
తాండ్ర చెట్టుకుగల ఫలాలను లెక్కించి, కలి దోషంనుండి విముక్తుడైన నలుడు తేజస్వియై, సమధికోత్సాహంతో రథాన్ని అధిరోహించి బయలుదేరాడు.
నలుడు రథాన్ని నడుపుతుంటే గుర్రాలు పక్షుల్లా ఆకాశంలో ఎగురుతున్నాయి. విదర్భ దేశంవైపు గుర్రాలు పరుగులు పెట్టాయి. సూర్యాస్తమయ సమయానికే సత్యవిక్రముడైన నలుడు ఋతుపర్ణ వార్‌ష్ణేయులతో కలిసి విదర్భనగరానికి (కుండనపురం) చేరాడు.
ప్రజలు ఋతుపర్ణ మహారాజు రాకను విదర్భ దేశాధిపతి అయిన భీమమహారాజుకు తెలియపరచారు. దిక్కులన్నిటా రథఘోషలు ప్రతిధ్వనిస్తుండగా ఋతుపర్ణమహారాజు ‘కుండిన నగరంలోనికి’ ప్రవేశించాడు.నగరంలో ఉన్న నలుడి గుర్రాలు ఈ రథఘోషను విన్నాయి.
- ఇంకాఉంది