మెయన్ ఫీచర్

మెరుపుదాడి తర్వాత ఏం జరుగుతుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైషే మహమ్మద్ సంస్థ స్థాపకుడు మసూద్ అజర్ ఉగ్రవాది కాదు.. ఈ మాట తాజాగా చైనా అన్నది. మరి- యూరీ సెక్టార్‌పై దాడి చేసి 19 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్నది ఈ సంస్థయే కదా! యూరీ దాడి తర్వాత 65 గంటల్లో 65 సీమోల్లంఘనలు పాక్ చేసింది. ‘పాక్‌తో సంభాషణలు జరుపుకుందాం’ అన్నాడు సిపిఎం నేత ఏచూరి సీతారాం. గత డెబ్బది సంవత్సరాలుగా వి.కె.కృష్ణమీనన్ రోజుల నుండి సంభాషణలు జరుపుతూనే ఉన్నాము కదా? పాకిస్తాన్‌లో నాలుగు వర్గాలున్నాయి 1. ప్రజలు 2. సైన్యం 3.ప్రభుత్వం 4. ఉగ్రవాద జీహాదీ సంస్థలు- వీరిలో ఎవరితో సంభాషణలు జరపాలో ఏచూరి చెప్పలేదు. జాతి మొత్తం ఏకమై పాక్‌కు బుద్ధిచెప్పాలనుకుంటున్న తరుణంలో సిపిఎం నేడు పాకిస్థాన్ అధికార ప్రతినిధిగా మాట్లాడటం తగునా? 1962లో భారతపై చైనా దండయాత్ర చేసినప్పుడు మొత్తం భారతదేశం ఏకమైంది. ఒక్క సిపిఎం మాత్రం ఇండియాయే చైనా మీదికి దండయాత్ర చేసింది అని మాకినేని బసవపున్నయ్య విజయవాడలో చేసిన ప్రసంగం నాకు బాగా గుర్తుంది.
బ్రహ్మపుత్ర నదిపై చైనా ఇప్పటికే 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో జాం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నిర్మించింది. ఇప్పుడు 740 మిలియన్ డాలర్ల వ్యయంతో మరో ప్రాజెక్టు మొదలుపెట్టింది. ఇది 2019 నాటికి పూర్తవుతుంది. నిన్న చైనా ఈ నది యొక్క ఉపనదీ ప్రవాహాన్ని నిలిపివేసింది. ఇండియా 1960 నాటి సింధూనదీ జలాల ఒప్పందం రద్దుచేసుకుంటున్న నేపథ్యంలో చైనా ఈ చర్య తీసుకుంది. దీనివల్ల సిక్కిం, అరుణాచలప్రదేశ్ వంటి ప్రాంతాలు దెబ్బతింటాయి. భద్రతామండలి 1267వ కమిటీ సమావేశంలో మసూద్ అజర్‌ను శిక్షించే ప్రతిపాదనను చైనా వీటో చేసింది. దీనికి సిపిఎం నేతలు ఏం జవాబు చెబుతారు? ఇక, మన దేశంలో అంతర్గత శత్రువులపై చర్య తీసుకోకుండా పాక్‌తో యుద్ధానికి వెళ్లి లాభం లేదు. సిపిఎం, దాని అనుబంధ సంస్థలపైన, అవార్డు వాపసీ బ్రిగేడ్‌పైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
మరోవైపు ‘మా దేశానికి ప్రజాస్వామ్యం సరిపడదు’ అని తాజాగా పాక్ నేత స్పష్టంగా ముషారఫ్ ప్రకటన విడుదల చేశారు. వారి సర్వసైన్యాధిపతి రహీబ్ షరీఫ్ నవంబరు 2016లో రిటైర్ అవుతున్నాడు. తన పాలనా కాలంలో ఇండియా సర్జికల్ ఆపరేషన్ చేయటం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకని ఈ అక్టోబరు 2016లోనే ఇండియాపై భారీగా దెబ్బకొట్టాలని రహీబ్ షరీఫ్ నిర్ణయించాడు. ఈ దశలో పాక్,చైనా అనుకూల వర్గాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలి. ఇక, గుజరాత్ తీరంలో 9 మంది పాకిస్తానీ సైనికులు బోటులో పట్టుబడ్డారు. ఆదివారం రాత్రి జైషీ మహ్మద్ ఉగ్రవాదులు బారాముల్లా వద్ద జరిపిన దాడిలో 8 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దశలో పాక్‌తో చర్చలకు అవకాశం ఉందా?
ఇండియా ‘ఆపరేషన్ కోల్ట్‌స్టార్ట్’ నిర్వహించటం ప్రపంచాన్ని విస్మయపరిచింది. పాకిస్తాన్ కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది. కారణం ఇండియా జరిపిన దాడి పాకిస్తాన్ పౌరుల మీద కాదు. ఉగ్రవాద స్థావరాల మీదనే. కాశ్మీరులో నాలుగు భాగాలున్నాయి. ఒకటి జమ్మూ. ఇది హిందూ మెజారిటీ ప్రాంతం. రెండవది కాశ్మీరులోయ. ఇక్కడ ప్రస్తుతం సున్నీ ముస్లిములు మెజారిటీలో ఉన్నారు. లోగడ ఇక్కడ నాలుగు లక్షల మంది హిందూ బ్రాహ్మణులు ఉండేవారు. వారిని తరిమివేశారు. మూడవది లఢక్. ఇక్కడ ప్రధానంగా బౌద్ధులున్నారు. ఇక నాల్గవది పాక్ ఆక్రమిత కాశ్మీరు. ఇక్కడే జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద స్థావరాలు దాదాపు రెండువందలున్నాయి. గత నెల 28న భారత సైన్యం వాయుమార్గాన వాస్తవాధీన రేఖనుదాటి పది కిలోమీటర్ల అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలల్లో ఏడింటిని ధ్వంసం చేసి దాదాపు నలభై మందిని హతమార్చి వచ్చింది. దీనికే సర్జికల్ ఆపరేషన్ అని పేరు. దీని లక్షణం ఏమంటే లక్ష్యాన్ని నిర్ణయించుకొని రహస్యంగా దెబ్బకొట్టాలి. ఇలాంటి దాడులు లోగడ ఇజ్రాయిల్ వంటి దేశాలు చేశాయి. ఎంటెబ్బీ సంఘటనలో ఇజ్రాయిలీలు శత్రు సైనికుల వేషాలలోనే వెళ్లి అరబ్బు సైనికులను మట్టుపెట్టివచ్చారు. జమ్మూకాశ్మీర్‌లోని యూరీ సెక్టారుపై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు గ్రైనేడ్లు విసిరి 20 మంది భారత సైనికులను హతమార్చి మరొక పాతిక మందిని తీవ్రంగా గాయపరిచారు. అందుకు ప్రతీకారంగా భారత సైన్యం మెరుపుదాడిని జరిపింది. విచిత్రమేమంటే యూరీ సైక్టారుపై పాకిస్తాన్ జరిపిన దాడిని వారు అంగీకరించటం లేదు. కాని భారత ప్రభుత్వం మాత్రం తాము జరిపిన ఉగ్రవాద నిర్మూలనా దాడిని ప్రపంచ దేశాలన్నింటికీ బహిరంగంగా తెలియజేసింది. చాలా మంచి పని చేశారని హిల్లరీ క్లింటన్ ప్రశంసించింది కూడా. ఈ ఒక్క సంఘటనతో ప్రధాని మోదీ అంతర్జాతీయ హీరో అయిపోయాడు. దేశంలో సిపిఎం, ముస్లింలీగ్ వంటి రెండుమూడు పార్టీలను మినహాయిస్తే తక్కిన వారంతా ముక్తకంఠంతో మెరుపుదాడికి మద్దతు పలికారు. 26/11 బొంబాయి దాడుల తర్వాతనే ఈ పని భారత ప్రభుత్వం చేసి ఉండవలసింది. కాని అప్పటి అధినాయకత్వం సైనికుల చేతులను కట్టివేసింది. కాబట్టి వారు నిస్సహాయంగా ఉండిపోయారు. మనం ఔనన్నా కాదన్నా ఇప్పుడు ‘పరిమిత యుద్ధం’ మొదలయింది. లోగడ యుద్ధాలకు ఇప్పటి యుద్ధానికి కొన్ని తేడాలున్నాయి. యుద్ధం, సర్జికల్ ఆపరేషన్ వంటి పదాలు సామాన్యంగా రెండు దేశాలు తమ వాస్తవాధీన రేఖను ఉల్లంఘించి పోరాడినప్పుడే వర్తిస్తుంది. ఈ విధంగా చూచినప్పుడు భారత వైమానిక దళం సెప్టెంబరు 28న జరిపిన దాడి యుద్ధం కిందికే వస్తుంది. భారత్ జరిపిన మెరుపుదాడిని పాకిస్తాన్ దాచిపెట్టింది. ముందు ‘దాడి జరుగలేదు’ అని బుకాయించింది. ఆ తర్వాత- ‘దాడిలో 8 మంది భారత సైనికులు హతులైనారు. ఒకణ్ణి సజీవంగా పట్టుకున్నాం’ అని బుకాయించింది.
పాక్ ఏం చేస్తుంది...?
భారత్ మళ్లీ ఇవ్వాళ రేపట్లో మరొక సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా? ఒకవేళ చేస్తే అది ఎక్కడ జరుగుతుంది? అని విశే్లషకులు ఊహాగానాలు మొదలుపెట్టారు. చెప్పి చేసేది మెరుపుదాడి కిందికి రాదు. పైగా పాకిస్తాన్ ఇప్పుడు ఎలర్ట్ అయింది. కాబట్టి వెంటనే రెండవ సర్జికల్ స్ట్రైక్ జరుగకపోవచ్చు. కాకుంటే ‘మేము ప్రతీకారం తీర్చుకుంటాము’ అని పాకిస్తాన్ ప్రకటించింది. అందుకని భారత్ అప్రమత్తమయింది. గుజరాత్,రాజస్థాన్, పంజాబు వంటి ప్రాంతాలలోని సరిహద్దు గ్రామాలలోని ప్రజలను దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఖాళీ చేయించారు. పాకిస్తాన్ నేరుగా సరిహద్దులోని భారత భద్రతాదళాల మీద దాడి చేయబోతున్నదా? లేక బొంబాయిలోని నౌకాస్థావరాల వంటి వాటిని టార్గెట్‌గా ఎంచుకున్నదా? అనే విషయంలో రక్షణశాఖ ఆలోచిస్తున్నది. ఇప్పుడు కొన్ని అంతర్జాతీయాంశాలను మనం గుర్తించాలి. ప్రతి దేశమూ తన స్వార్థాన్ని, రక్షణను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది. 1971లో ఇండో-పాక్ యుద్ధం జరిగినప్పుడు అమెరికా భారతదేశానికి సహకరించలేదు సరికదా హెన్రీ కిసింజర్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారత్‌ను హెచ్చరించారు. ఐనా, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ లెక్కబెట్టలేదు. ఇవ్వాళ 2016లో అమెరికా భారత్‌ను వెన్నంటి ఉంది. ఇందుకు కారణాలేమిటి? 1970వ దశకంలో ఒసామా బిన్ లాడెన్ అనే ఉగ్రవాదిని సృష్టించింది అమెరికాయే. అప్పుడు ఆఫ్‌గనిస్థాన్ యుద్ధంలో పాకిస్తాన్‌కు సంపూర్ణ ఆయుధ, ఆర్థిక సహాయం వైమానిక బలం అమెరికానుండే వచ్చింది. ఇవ్వాళ పరిస్థితులు మారిపోయాయి. భారత్ అమెరికాకు సన్నిహితంగా ఉంటున్న కారణంగా రష్యా పాకిస్తాన్‌తో ఉమ్మడి సైనిక విన్యాసాలకు సిద్ధపడింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి అని చైనా నీతులు చెపుతూ పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా అణ్వాయుధ సంపత్తిని సమకూరుస్తున్నది. అంటే ఇండియాకు చుట్టూఉన్న రష్యా, చైనా, పాకిస్తాన్‌లు ఇండియా పట్ల సుముఖంగా లేవు. నేపాల్‌లో భట్టారాయ్ ప్రభుత్వం చైనా చెప్పినట్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్‌గనిస్థాన్‌లు ఇచ్చే మద్దతుమీద మాత్రమే ఆధారపడవలసి ఉంటుంది. వీరు ఇవ్వగలిగింది నైతిక మద్దతు మాత్రమే. ఈ కారణం చేత అమెరికా తన శక్తివంతమైన సెవెన్త్ ఫ్లీట్‌ను పాకిస్తాన్ వైపుకు సముద్ర జలాలల్లో ప్రవేశపెట్టింది. అంటే పాకిస్తాన్‌ను నిర్మూలించడానికి లేదా బెదిరించడానికి ఈ సెవెన్త్ ఫ్లీట్ చాలు. లోగడ యుద్ధాలు తుపాకులతో జరిగాయి. ఐతే ఇప్పుడు అణ్వాయుధ సమృద్ధిగల రెండు దేశాల మధ్య జరుగుతున్నది. దీనివల్ల ఇండియా, పాకిస్తాన్‌లకు మాత్రమే కాదు మొత్తం ఆసియా ఖండానికే ముప్పువాటిల్లుతుంది. ఓజోన్ పొరకు చిల్లుపడితే మొత్తం భూగోళమే ప్రమాదంలో చిక్కుకుంటుంది. పాకిస్తాన్ మతోన్మాదులు తొందరపడి ఒక అణుబాంబును విసిరితే రాజస్థాన్, గుజరాత్, పంజాబు ప్రాంతాలకు భారీ నష్టం వాటిల్లవచ్చు కాని ఆ తర్వాత పాకిస్తాన్ అనే ఒక దేశం ప్రపంచపటంలో మిగలదు.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులలో ఎక్కువమంది నిరుపేదలు. వారికి పెద్ద మొత్తంలో ధనం ఇచ్చారు. ‘చస్తే మీరు అల్లాదగ్గరికి వెళ్లి స్వర్గసుఖాలు అనుభవింపవచ్చు. అప్పుడు మీ కుటుంబాలను మేమే పోషిస్తాం’ అని హషీద్ సయ్యద్ జిలానీ, దుర్హన్‌వానీ వంటి నాయకులు చెప్పారు. కాశ్మీరు కాదు సరికదా.. మొత్తం భారతదేశాన్ని పాకిస్తాన్‌కు దానం చేసినా వారి వాహిబ్ జీహాదియత్ ఉగ్రవాదం ఆగదు. ‘ఇండియాపై మీరు దాడికి దిగితే మా సహకారం ఉండదు’ అని అమెరికా నిన్న తెగేసి చెప్పింది. ఇది మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణలకు అద్దంపడుతున్నది. చైనా,పాక్‌లు ఒకవర్గంగా అమెరికా,యూరప్, ఇండియా మరొక వర్గంగా అవతరించబోతున్నాయి.రష్యా ఇప్పుడు పాకిస్తాన్‌తో చెలిమిచేయటం ఆ దేశపు దీర్ఘకాలిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. ఎందుకంటే ఇండియా చేస్తున్న యుద్ధం పాక్‌మీద కాదు. అంతర్జాతీయ ఉగ్రవాదం మీద!!
భారత రాజకీయాలల్లో సిపిఎం, ముస్లింలీగ్, ఇత్తెహాదుల్ మజ్లీస్‌లు జతకట్టే అవకాశం ఉంది. త్రిపుర, కేరళ, యుపి ప్రభుత్వాలు మోడీకి మద్దతునివ్వవు. ఈ మొత్తం ఇతివృత్తంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా పాక్ వ్యతిరేక ధోరణిని అవలంభించటం భారత రాజకీయాలల్లో కీలక పరిణామం అంటే కేంద్రంలో పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్షం సైనికుల సాహసాన్ని ప్రశంసిస్తున్నది. ఇది శుభ సూచన.

- ముదిగొండ శివప్రసాద్