మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కేశినీ! నీవు ఒక పనిచెయ్యాలి. ఋతుపర్ణుడు అయోధ్యకు రాజు. అతడితోపాటు వచ్చిన వార్‌ష్ణేయుని సూతపుత్రుని నేను గుర్తించాను. అయితే ఆ రథంప్రక్కన పొట్టి చేతులతో, వికృత రూపంతో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ రథసారథి ఎవరో తెలుసుకో! అతడు ఎవడై ఉండవచ్చునో తెలుసుకో! వాడి పట్ల నా హృదయం సంతోషం పొందుచున్నది. కేశినీ! ఆ పురుషుని చెంతకేగి, ఏమాత్రం తొందరపాటు లేకుండా మృదువుగా క్షేమసమాచారాలను అడిగి తెలుసుకో! మనం అయోధ్యకు పంపిన పర్ణాదుడికి ప్రత్యుత్తరమిచ్చినవాడు అతడే అయి ఉండవచ్చును. నల మహారాజేమోనని అనుమానం కలుగుతోంది! కేశినీ అతడితో సంభాషణ ముగిసే సమయంలో పర్ణాదుడు చెప్పిన మాటలన్నీ పలుకుము. నీ పలుకులకు అతడు ఏమి సమాధానం చెపుతాడో వినుము’’అని చెప్పి పంపింది.
***
దమయంతి పంపిన కేశిని అనే ఆ దాసి బాహుకుడైన నలునివద్దకు వచ్చింది. బాహుకుని చూచి
‘‘అయ్యా! మీకు స్వాగతం! మీరు క్షేమంగా ఉన్నారు గదా? మా రాజపుత్రి అయిన దమయంతి తమ యోగక్షేమాలను అడిగి రమ్మని నన్ను పంపింది.
అయ్యా! ఇచటికి మీరు ఎందుకు వచ్చారు? మీరు ఎప్పుడు బయలుదేరారు? మీరు ఆ విషయం గురించి యదార్థాన్ని చెప్పండి.! దానిని దమయంతి వినగోరుచున్నది’’అని వినమ్రంగా అడిగిన కేశినితో బాహుకుడు
‘‘కోసల దేశాధీశుడైన ఋతుపర్ణ మహారాజు ఒక బ్రాహ్మణోత్తముని వలన దమయంతికి ద్వితీయ స్వయంవరం రేపు జరుగుతుందని విన్నాడు. అందుకు అందరు క్షత్రియ వీరులను ఆహ్వానించి రప్పించారుగదా! విషయాన్ని విన్న వెంటనే ఋతుపర్ణ మహారాజు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. నూరు యోజనాల దూరాన్ని శీఘ్రంగా పయనించగల గుర్రాలతో రథాన్ని సిద్ధంచేశాను. నేను ఆ ఋతుపర్ణుని సారథిని. అయోధ్యనుండి నేరుగా ఇచటికి వచ్చిన సంగతి వినలేదా? నేనుగూడా అతడితో పాటే వచ్చాను’’అని అనగా.
‘‘మీలో ఆ మూడవ వ్యక్తి ఎవరికి సంబంధించినవాడు? ఇంతటి మహత్కార్యం నీపై ఎందుకు ఉంచబడింది? అని ప్రశ్నించింది కేశిని.
‘‘్భద్రా! ఆ మూడవ వ్యక్తి ఒకానొకనాడు నలమహారాజు రథసారథిగా ప్రసిద్ధిపొందినవాడు. అతడి పేరు వార్‌ష్ణేయుడు. గౌరవింపదగిన వ్యక్తిత్వం కలవాడు. నలమహారాజు రాజ్యాన్ని వదలివెళ్ళిన తరువాత వార్‌ష్ణేయుడు ఋతుపర్ణ మహారాజు చెంత చేరాడు. నేనుగూడా అశ్వశాస్త్ర రహస్యాలు తెలిసిన వాడిని. రథ సారథ్యంగూడా తెలిసినవాడినే! అందుచేత ఋతుపర్ణ మహారాజు నన్ను తన సారథిగా మాత్రమేగాక వంట వానిగా కూడా నియమించాడు. నా పేరు బాహుకుడు’’అని సమాధానమిచ్చాడు నలుడు.
‘‘బాహుకా! నలుడు ఎక్కడికి వెళ్ళింది వార్‌ష్ణేయునకు తెలుసా? అతడెప్పుడైనా నీకీ విషయాన్ని చెప్పి ఉండాలే?’’అని అన్నది కేశిని అందుకు
‘‘నలుని పుత్రుని దేవసేనుని, పుత్రిక దేవసేనను ఆ వార్‌ష్ణేయుడు కుండిన నగరంలో వారి మాతామహులవద్ద విడిచి అతడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. నలుని గురించి అతడికి తెలియదు. నలుడు ఈ లోకంలో రహస్యంగా తిరుగుచున్నాడు. అతని విషయం ఆ భగవంతునికే తెలియాలి. లేదా నలుని అంతరాత్మకే తెలియాలి. నలుడితోపాటు ఏకాంతంగా అడవికి వెళ్ళిన భీమనందన దమయంతికి తెలియాలి లేదా నలుడికి తెలియాలి. నలుడు తన గుర్తులేమిటో ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు’’అని అన్నాడు బాహుకుడు.
(వార్‌ష్ణేయుడు నలుని పిల్లలను వారా తాతగారింట్లో వదలిన విషయం బాహుకునికి ఎలా తెలుసు? అతడు చెప్పాడా లేక తానే నలుడని తెలిసికోవాలని అలా అని ఉంటాడేమో)

- ఇంకాఉంది