మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమయంతి పాత్ర చిత్రణ మిక్కిలి హృదయంగమమైనది. దమయంతి అతిలోక సుందరి. సౌందర్యంతోపాటు సౌశీల్యం ఆమెలో పెనవేసుకొనిపోయింది. సౌందర్య సౌశీల్యాలేగాక ఆమె తెలివితేటలు నిరుపమానాలు. నలుడు జూదమాడుతుండగానే ఆమె భర్త ఓటమిని ఊహించింది. వెంటనే తన పిల్లలను తన తల్లిదండ్రులవద్దకు విదర్భకు పంపింది. నలుని జూదం ఆపటానికై పౌరులను వెంటబెట్టుకొని వచ్చి ప్రయత్నించింది.
నలుడు జూదంలో ఓడిపోయి అడవులపాలుకాగా అతడిని అనుసరించింది. అరణ్యంలో ఆమె పడినపాట్లు వర్ణనాతీతం. ఆ కష్టాలు ఆమె పాతివ్రత్యాన్ని చాటిచెప్పింది. దమయంతి ఇంగిత జ్ఞానం కూడా అనన్య సామాన్యమైనట్టిదే.
నలుని కనుగొనటానికి ఆమె పన్నిన పన్నుగడ కూడా చాలాగొప్పది. అదే ఆమె చేపట్టిన ద్వితీయ స్వయంవర పథకం. నలుణ్ణి ఉద్విగుడిని చేయటానికై బ్రాహ్మణుల చేత అనిపించిన ఎత్తిపొడుపు మాటలు నలుని హృదయాన్ని కరిగించేవిగానే ఉన్నాయి.
అంతేగాదు బాహుక వేషధారి అయిన నలుని గుర్తించటానికి ఆమె అనుసరించిన విధానం ఆమె తెలివితేటలకు, జాగరూకతకు నిదర్శనం.
అంతేగాక బాహుకుడు నలుడు కాదు. వార్‌ష్ణేయుడు నలుని గుర్తించలేకపోయాడు. ఋతుపర్ణుడిని తీసికొని అయోధ్యనుండి విదర్భకు పయనమైనపుడు బాహుకుడి సారథ్యాన్ని చూచి కొంచెం సందేహం మాత్రం కలిగింది వార్‌ష్ణేయునికి. అయితే ఊగిసలాడాడే కాని గుర్తించలేకపోయాడు. ఒక స్థిర నిర్ణయానికి రాలేకపోయాడు.
జీవలుడు బాహుకుడిని మాత్రం ఒక ద్విపాద జంతువుగానే పరిగణించాడు.
దమయంతి యొక్క అద్వితీయ మేధ బాహుకుడిలో అణిగిమణిగియున్న నలుడి వ్యక్తిత్వాన్ని సులువుగా గుర్తించ గలిగింది. ఆమె మనోనేత్రం విజయం సాధించింది.
నలుని మనస్సుకు వాడి బాణాలవలే నాటే మాటలు విని వర్ణాదుడికి ఏకాంతంగా బాహుకుడు సమాధానం చెప్పక తప్పింది కాదు. నూరు ఆమడలు ఒక్క దినంలో నడపగల నేర్పు ఒక్క నలుడికి మాత్రమే కలదు. సుదేవుడు పెట్టిన గడువులోపలనే నలుడు రథాన్ని నూరు ఆమడల దూరాన్ని సునాయాసంగా దాటి అయోధ్యనుండి విదర్భకు వచ్చాడు.
నలుని రథనేమి ధ్వని దమయంతికి సుపరిచితం. ఋతుపర్ణుడు విదర్భకు చేరగానే దమయంతి నలుని రథఘోషను గుర్తించింది.
నలభీమ పాకమని లోకప్రసిద్ధి. సంకల్ప మాత్రంచేతనే నిప్పు, కల్పించగల శక్తి నలుడికి మాత్రమే కలదు.
(విరటుని కొలువులో వంటలవాడుగానున్న భీమసేనునికి ఆ శక్తిలేదు)
మరే మానవమాత్రులకు లేదు. అలాంటి శక్తిని నలునకు దిక్పాలకులైన అగ్నివరుణుల వలన లభించాయి. నలుని వంటచేసే విధానాన్ని పరిశీలించిన కేశినివలన దమయంతి గ్రహించగలిగింది. నలుడు వండిన నంజుళ్ళ రుచిని (వాటిని తెప్పించుకొని) దమయంతి గ్రహించి రూఢి చేసుకొనగలిగింది.
పుత్రులను కేశిని ద్వారా బాహుకుడివద్దకు పంపించింది దమయంతి. పిల్లలను చూచిన బాహుకుడు వారిని కౌగలించుకొని అనంద తన్మయుడయ్యాడు. దమయంతి బాహుకుడే నలుడని నిర్ణయించుకొన్నది.
చివరకు బాహుకుడే తన నిజరూపంతో ప్రసన్నుడయ్యాడు. కథ ముగిసింది.
***
‘‘అమ్మా! నలమహారాజును! (బాహుకుడిని) మన మందిరంలో ప్రవేశపెట్టండి. లేదా నేనే అచటికి వెళ్ళటానికి సమ్మతించండి.! తండ్రిగారికి ఈ విషయం తెలిసినా, తెలియకపోయినా ఈ పని చెయ్యండి!’’అని దమయంతి తల్లిని బలవంత పెట్టింది.
- ఇంకాఉంది