మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తదుపరి పుష్కరుడు అచట ఒక నెలరోజులుండి సంతుష్టుడై తన పరివారంతోకూడి తన నగరానికి వెళ్ళిపోయాడు.
నలమహారాజు గొప్ప సైన్యంతోనూ, విశ్వాసపాత్రులైన పరిచారకులతోనూ సూర్యునివలె వెలుగొందాడు. అత్యంత శోభాయమానమైన తన నగరాన్ని ప్రవేశించాడు, నగర ప్రవేశంచేసి ప్రజలందరిని ఊరడింపజేశాడు. పౌరులు, జానపదులు సంతోషంతో పులకించిపోయారు. మంత్రి ప్రముఖులు ప్రజలు వినయంతో అంజలి ఘటించి
‘‘నలమహారాజా! దేవతలు ఇంద్రుని సేవించినట్లు, మేమంతా మిమ్ము సేవించుకొనటానికై మా అదృష్టంకొద్ది తిరిగి వచ్చారు’’ అని అన్నారు. నలదమయంతుల కథ సుఖాంతమైంది.
***
నలచరిత్రలో అంతరార్థాలు
‘‘నైషధము’’అనే పేరుతో కలిదోష నివారకమైన నలచరిత్రను నవలా రూపంలో మీరు ఇప్పటిదాకా అధ్యయనం చేశారు. ఈ కథ ఎన్నో అంతరార్థాలతోనూ, సంకేతార్థాలతోనూ, ధర్మసూక్ష్మాలతోనూ నిండి వుంది. వాటిలో ప్రధానమైన వాటిని మనమిప్పుడు చర్చించుకుందాం.
‘‘పురాణగాథలను నమ్మవచ్చునా?’’
‘‘అవి నిజంగా జరిగినవేనా?’’
‘‘అవి కేవలం సంకేత రూపమైన కల్పిత కథలా?’’
ఈ చర్చ మన దేశంలో అనేక శతాబ్దాలుగా జరుగుతూనే వుంది. కొందరు ఇవి సంకేత గాథలేనని పట్టుబడుతూ వుండగా, కొందరు ఇవి యథార్థ చరిత్రలని నొక్కివక్కాణిస్తున్నారు.
ఈ రెండు వాదాల బలాబలాల గురించి, వీటి సమన్వయం గురించి, నేను ‘‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు (ఎమెస్కో పబ్లికేషన్స్, హైదరాబాద్) అనే గ్రంథంలో ‘‘పురాణ గాథలు సంకేతార్థాలు’’అనే వ్యాసంలో విస్తారంగా చర్చించాను. ఆ చర్చ అంతా ఇక్కడ పునరుక్తి చేయను గానీ, యుగసంధులలో జన్మించి జీవించిన విచిత్ర విశిష్టవ్యక్తుల యొక్క చరిత్రలనే వ్యాస మహర్షి తన పురాణాలలో ఎక్కువగా చిత్రీకరించాడనీ, ఆ కథాశిల్పంలో భాగంగా సంకేతార్థాలను కూడా గుప్పించాడనీ, ఆ వ్యాసంలో నేను నిరూపించాను.
నల చరిత్రను సంస్కృత సాహిత్యంలో బాగా ప్రచారంలోకి తెచ్చినవాడు శ్రీహర్ష మహాకవి. ఆయన ఈ చరిత్రలోని కొంత భాగాన్ని ‘‘నైషధీయ చరితం’’అనే పేరుతో లోకోత్తర ప్రౌఢకావ్యంగా సంతరించాడు. ఆయన దేవీ ఉపాసకుడు, పండితుడు, కనుక, ఈ కావ్యంలో అనేక మంత్ర రహస్యాలను, వేదాంత రహస్యాలను గుప్పించాడు.
ఈ సంస్కృత కావ్యాన్ని శ్రీనాథ మహాకవి తెలుగు మహాకావ్యంగా అనువాదం చేస్తూ, మంత్ర రహస్యాలను ప్రక్కనపెట్టి, శృంగార రసానికి పట్టంకట్టాడు.
వీరిద్దరికంటే ముందుగా నలచరిత్రను తెలుగు దేశానికి పరిచయం చేసినవాడు నన్నయ మహర్షి. ఈయన వ్యాస మహర్షి దోవలోనే నడుస్తూ, సంగ్రహ విధానంలో సాగిపోయాడు.
పూర్వ పరిశోధనలు:
ఇది మనుషులు, దేవతలు, నాగజాతివారు, కలగాపులగంగా కలిసి భూలోకంలో తిరిగే రోజులలో జరిగిన కథ. అందువల్లే, ఇందులోని ఘట్టాలు అనేకం నమ్మశక్యం కాకుండా వుంటాయి. దానివలనే ఈ సన్నివేశాలకు సంకేతార్థాలను వెతుక్కోవాలని పండితులు ఎంతోకాలంగా ఆరాటపడుతూ వచ్చారు. అలాంటి వారిలో మహోద్ధండ శాస్త్ర పండితుడు శ్రీ హర్ష మహాకవి కూడా వున్నాడు. అయితే ఆయన నిరంకుశ కవి గనుక, మూలకథను ఆధారమాత్రంగా తీసుకొని, తన ఉపాసనను, తన సిద్ధులను, తన పాండిత్యాన్ని, దాంట్లో యథేచ్ఛగా నిక్షేపించేశాడు.
- ఇంకాఉంది