మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత లోతుగా నిక్షేపించాడంటే, మల్లినాథసూరి వంటి సుప్రసిద్ధ వ్యాఖ్యాతలకే అవి పూర్తిగా కొరుకుడు పడలేదు.
ఇటీవలి కాలంలో గుంటూరు శేషేంద్రశర్మగారు అనే తెలుగుకవి ఈ కావ్యాన్ని బాగా పరిశీలించి, ‘‘స్వర్ణహంస’’అనే పేరుతో 1964లో ఒక వ్యాసం ప్రకటించారు. ఈ గుంటూరు వారు శ్రీ విద్యారహస్యవేత్త కావటంవల్ల, వీరికి శ్రీహర్షకావ్యంలోనూ, వ్యాసపురాణంలోనూ కూడా, నలచరిత్ర నిండా శ్రీ విద్యారహస్యాలే కనిపించాయి.
తత్ఫలితంగా వీరు-- నలుడంటే సామాన్య మానవుడని, వాడి భార్యయైన దమయంతి సాక్షాత్తుగా శ్రీ మహాత్రిపుర సుందరి అని, ఆమె తండ్రి భీమరాజు శివుడని,
నలదమయంతుల మధ్య దౌత్యం నడిపిన స్వర్ణహంస అజపామంత్రాధిదేవత అని ప్రతిపాదించారు.
దీని తరువాత కొంత కాలానికి ఎమెస్కోవారు ప్రచురించిన తెలుగు శృంగార నైషధ కావ్యానికి పీఠిక వ్రాసిన సుగృహీత నామధేయులు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు గుంటూరువారి సిద్ధాంతాన్ని ప్రస్తావించి, దానితో ఏకీభవించక, నల దమయంతులు ఇద్దరూ ఉత్తమ సంస్కార సంపన్నులైన మానవ జీవులనీ, వారిద్దరిమధ్యా దౌత్యం నడిపిన హంస దేవుడేననీ అంటూ, ‘‘హంస శ్శివస్సోహం’’అనే వేదవాక్యాన్ని ఉదహరించారు.
విశ్వనాథవారు మూల చరిత్రలోగల వైచిత్య్రాలకూ, వైషమ్యాలకూ కూడా, కొంత సమన్వయం చూపించారు కానీ, ఆయన ఆ వ్యాసంలో కావ్య పరిశీలన చేస్తున్నారు కనుక, రస దృష్టితోనే ముందుకు సాగిపోయారు.
కథలోని అంతస్సూత్రం:
ఎంత చెప్పినా వీరిద్దరూ శ్రీహర్ష శ్రీనాథ పరిశీలకులే గానీ, శ్రీ వ్యాస పరిశీలకులు కాదు. అంటే, వారిద్దరూ వ్యాస భారతాన్ని చూడలేదని నా ఉద్దేశ్యంకాదు. వారి దృష్టి కేంద్రీకరణం దానిమీద లేదని మాత్రమే. ఈ కథలోని వ్యాస హృదయం అంతుబట్టాలంటే, ఆయన ఈ కథను ఎప్పుడు చెప్పాడు? ఎవరికి చెప్పాడు? ఎందుకోసం చెప్పాడు? అనే అంశాల దగ్గరనుంచీ పరిశీలన ప్రారంభించాలి.
పై మూడు ప్రశ్నల్లోనూ ‘‘ఎందుకోసం చెప్పాడు?’’అనేది మరింత ముఖ్యమైన ప్రశ్న. ఆ విషయాన్ని వ్యాసమహర్షి నలోపాఖ్యానం చివరిలో వాచ్యంగానే చెప్పాడు ఏమనంటే-
కర్కోటకస్య నాగస్య దమయన్త్యా నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్‌॥
(వనపర్వం 79-10) - అని.
అంటే, ‘‘నాగుడైన కర్కోటకుడ్ణి, నలుడ్ణి, దమయంతిని, రాజర్షి అయిన ఋతుపర్ణుడ్ణి, కీర్తిస్తే, కలిదోషాలు పోతాయి’’- అని అర్థం.
ఈ శ్లోకం ఈ ఉపాఖ్యానం మొత్తానికి సూత్రస్థానీయం. అనేక వేల సంవత్సరాలుగా ఈ దేశంలోని పెద్దలకు ఇది నిత్యస్మరణీయ మంత్రం. ఇటీవలి కాలంలో పోయిందిగానీ, పూర్వకాలంలో ఈ శ్లోకాన్ని అన్ని వర్ణాలవారూ ప్రతిరోజూ స్మరిస్తూ వుండేవారు.
ఇంతటి గొప్పతనం వున్న ఈ శ్లోకంలో కనిపించేవన్నీ వైరుధ్యాలే!
ఈ నల చరిత్ర జరిగింది కృతయుగంలో! దీన్ని వ్యాసుడు రచించింది ద్వాపర యుగంలో! ఇది పోగొట్టేది మాత్రం కలిదోషాలను!- ఇది ఒక వైరుధ్యం.

- కుప్పా వేంకటకృష్ణమూర్తి