మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగబట్టి, భూలోకానికి వచ్చి, పనె్నండు సంవత్సరాలు కాపలాకాచి, చివరికి ఏదో సందు చూసుకొని నలుడిలో ప్రవేశించాడు.
దానికి ఫలితంగా నలుడు తన సోదరుడైన పుష్కరుడితో జూదం ఆడి, జూదపు మత్తులో తన రాజ్యమంతా కోల్పోయి, అడవుల పాలయ్యాడు. దమయంతి మాత్రం, ఎంతచెప్పినా వినకుండా, భర్త వెంట అడవికి నడిచింది.
అడవిలో ఆకలికి తట్టుకోలేక, నలమహారాజు కొన్ని పక్షులను పట్టుకుందామనే ఆశతో, తను కట్టుకున్న ధోవతిని వలగా విసిరాడు. ఆ పక్షులు ఆ పంచెతో సహా ఆకాశాలోకి ఎగిరిపోయాయి. దమయంతి తన చీరలో సగ భాగం చించి, కట్టుకోమని నలుడికి ఇచ్చింది.
అలా దిక్కులేని పరిస్థితిలో నల దమయంతులిద్దరూ ఒక చెట్టుక్రింద నిద్రకు ఉపక్రమించారు. దమయంతికి నిద్ర పట్టింది. నలుడికి నిద్రపట్టక, ‘‘ఈమెను వదిలేసి నేను కనుపించకుండాపోతే, ఈమె ఎలాగోలా తల్లిగారింటికి చేరుతుంది. నా బాధలు నేను పడతాను’’అని భావించి, భార్యను వదలి పారిపోయాడు.
అలా వెళుతున్న నలుడ్ణి ఒక అడవిలో ‘‘కర్కోటకుడు’’అనే నాగరాజు కాటు వేశాడు. దాని ఫలితంగా, నలుడు మరణించలేదు గానీ, అతని రూపం మరుగుజ్జుగా మారిపోయింది. కర్కోటకుడి సలహామేరకు నలుడు తన పేరును ‘‘బాహుకుడు’’గా మార్చుకొని, అక్షహృదయ విద్యావేత్త అయిన ‘‘ఋతుపర్ణుడు’’ అనే అయోధ్యా నగరరాజు దగ్గర వంటవాడిగా చేరి, జీవనం సాగించాడు.
ఒంటరిగా మిగిలిన దమయంతి అష్టకష్టాలూ పడి, చిట్టచివరకు పుట్టింటికి చేరింది. ఆమె తండ్రి తన అల్లుడికోసం అనే్వషణ మొదలుపెట్టాడు. దానిలో భాగంగా ‘‘దమయంతికి రెండవ స్వయంవరం ఏర్పాటుచేశాం రండి’’ అనే వార్తను ఋతుపర్ణుడికి పంపారు. ‘‘అయోధ్య నుంచీ విదర్భకు పోవాలి. ఒక్కరోజే సమయం వుంది. ఎలాగా?’’ అని ఋతుపర్ణుడు ఆలోచిస్తూ వుంటే, వంటవాడైన బాహుకుడు వచ్చి, తనకు గుర్రాలను తోలటంగూడా వచ్చుననీ, ఒక రోజులోనే విదర్భకు చేర్చగలననీ చెప్పాడు. రాజు సరేనన్నాడు. వారిద్దరూ వెళుతూ వుండగా ఒక విచిత్రం జరిగి, బాహుక ఋతుపర్ణులు అశ్వహృదయ-అక్షహృదయ విద్యలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఈ విద్యల ప్రభావం వల్ల, కర్కోటకుడి విషప్రభావంవల్ల, నలుడ్ణి ఆవహించి వున్న కలిపురుషుడు ఇక తట్టుకోలేక బయటకు వచ్చి, నలుడ్ణి విడిచి వెళ్ళిపోయాడు.
తీరా, విదర్భకు పోయి చూస్తే, అక్కడ స్వయంవర ప్రయత్నమే లేదు. దమయంతి బాహుకుడ్ణి తెలివిగా పరీక్షించి, నలుడేనని గుర్తుపట్టింది. నలుడికి రూపం మారినా, దమయంతికి నలుడి మీది అనురాగం మారలేదు. నలుడు కర్కోటకుడ్ణి స్మరించగానే, అతడి అసలు రూపం అతడికి వచ్చేసింది. నలదమయంతులు మళ్ళీ కలిశారు. నలుడు పుష్కరుడి మీదికి దండెత్తి, మళ్ళీ రాజ్యాన్ని పొందాడు. కథ చివరికి ఇలా సుఖాంతమైంది.
ఇన్ని మెలికలూ, ఇంత పొడుగూ వున్న ఈ కథలో దమయంతీదేవి తప్ప చెప్పుకోదగినంత గొప్పవారు ఎవరైనా కనిపిస్తున్నారా? దమయంతి భర్తతో అడవులకు నడిచింది. పస్తులు పడుకుంది.
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి