మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగం చీర చింపి భర్తకు ఇచ్చింది. భర్త తనను మోసగించి పారిపోతే, మళ్ళీ భర్త దొరికే దాకా అదే సగం చీరతో జీవితం గడిపింది. ఇంత గొప్ప పాతివ్రత్యదీక్ష పురాణ వనితల్లో ఈమెకు తప్ప మరొకరికి లేదేమో! అందుకనే కొందరు ఈమెను సాక్షాత్తుగా మహాత్రిపుర సుందరీదేవి అన్నారు.
కానీ, కలిదోష సంహరణంలో ఈమె పాత్ర ప్రధానంగా కనిపించడం లేదు. వ్యాస మహర్షి మాటలలోనూ, పెద్దల అనూచాన సంప్రదాయంలోనూ కూడా నలచరిత్ర కలిదోష నివారకంగా కీర్తింపబడుతూ వస్తోంది. కానీ, ఈ కలిదోష నివారణలో దమయంతికి విశేష ప్రాధాన్యం కనిపించటం లేదు.
ఈ సమన్వయం కుదరకపోవటం వలననే శ్రీహర్షుడు, గుంటూరువారు, విశ్వనాథవారు మొదలైనవారు ఈ కథలోని అంతరార్థాల అనే్వషణలో మునిగిపోయారు.
ఆ ప్రయత్నంలో వారు నలదమయంతీ స్వర్ణహంసలను పట్టుకొన్నారే గానీ, కర్కోటకుడ్ణీ, ఋతుపర్ణుడ్ణీ పట్టించుకోలేదు. వ్యాస మహర్షేమో నలచరిత్ర సూత్ర శ్లోకంలో ‘‘కర్కోటకస్య నాగస్య’’ అంటూ కర్కోటకుడికే ప్రథమస్థానం ఇచ్చాడు. ఇతడి ప్రస్తావనలోని వైరుధ్యాల గురించి వ్యాస ప్రారంభంలోనే మనం చర్చించుకొన్నాం.
ఉపక్రమోప సంహారాలు:
ఈ వైరుధ్యాలన్నీ తీరి, ఈ కథలో వ్యాసమహర్షి దాచివుంచిన ‘‘వ్యాస ఘట్టాలను’’ ఛేదించాలంటే, మనం మూల భారతంలోని కథాప్రారంభంనుంచి అనే్వషణ ప్రారంభించాలి.
పాండవులు అరణ్యవాసంచేస్తూ వుండగా, అర్జునుడు పాశుపతాస్త్ర సంపాదనకోసం తపోవనాలకు వెళ్ళినప్పుడు, ధర్మరాజాదులు అర్జునుడికోసం దిగులుపడుతూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు భీముడు ధర్మరాజుతో చాలా వాగ్వాదం చేశాడు.
దాని సారాంశం ఏమిటంటే, ‘‘మహారాజా! నువ్వుచేసేది రాజనీతి శాస్తప్రరంగానూ, ధర్మశాస్త్ర ప్రకారంగానూ కూడా, తప్పు. రాజనీతి శాస్త్రం ప్రకారం వంచకుడ్ణి వంచనతోనే జయించాలి. ఇక ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ఒక రోజు అంటే ఒక సంవత్సరం.
సంవత్సరలో మహారాజ పూర్ణో భవతి కచ్ఛ్రతః॥
యది వేదాః ప్రమాణాస్తే దివసాదూర్థ్వమచ్యుత॥ (వన పర్వం 52-24)
నీకు వేదాలే ప్రమాణమైతే, రోజు దాటితే సంవత్సరం దాటినట్లే లెక్క. ఆ లెక్క ప్రకారం 13 యేళ్ళు ఎప్పుడో దాటిపోయాయి. కనుక, వెంటనే దాడి చేద్దాం’’- అని.
ఈరోజు భీముడు చెపుతున్న వాదానికీ, ఆనాడు కణికుడు అనే మంత్రి దుర్యోధనుడికి చేసిన ఉపదేశానికీ, పెద్ద తేడా ఏమీలేదు. కలియుగం ఇంకా ప్రవేశించకముందే, భీముడివంటి దైవాంశ సంభూతిడిలోనే,
ఇలాంటి కలికాలపు బుద్ధులు పొటమరించడం చూసేసరికి, ధర్మరాజు లోలోపల బాధపడి, తమ్ముడ్ణి గట్టిగా మందలించలేక, పూర్తిగా నచ్చచెప్పలేక, ఇబ్బందిపడుతున్న సమయంలో తలవని తలంపుగా, ‘‘బృహదశ్వుడు’’ అనే మహర్షి వారి దగ్గరకు వచ్చాడు.
ఈ పేరును గమనించండి- ‘‘బృహత్- అశ్వుడు’’. - ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి